Amaravati Railway Line : రాజధాని ప్రాంత ప్రజలకు గుడ్‌న్యూస్.. అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం-union cabinet approves amaravati railway line ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Amaravati Railway Line : రాజధాని ప్రాంత ప్రజలకు గుడ్‌న్యూస్.. అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

Amaravati Railway Line : రాజధాని ప్రాంత ప్రజలకు గుడ్‌న్యూస్.. అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

Basani Shiva Kumar HT Telugu
Oct 24, 2024 03:46 PM IST

Amaravati Railway Line : అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 57 కిలో మీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్‌కు ఆమోదం తెలిపింది. రూ.2,245 కోట్ల వ్యయంతో కొత్త రైల్వే లైన్ నిర్మాణం జరగనుంది. కృష్ణా నదిపై 3.2 కి.మీ మేర రైల్వే వంతెన నిర్మాణానికి ఆమోదం లభించింది.

అమరావతి రైల్వే లైన్‌కు గ్రీన్‌సిగ్నల్
అమరావతి రైల్వే లైన్‌కు గ్రీన్‌సిగ్నల్ (@AmaravatiNexus)

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కృష్ణా నదిపై 3.2 కి.మీ. మేర రైల్వే వంతెన నిర్మాణం జరగనుంది. రూ.2,245 కోట్లతో 57 కి.మీ. రైల్వేలైన్‌ నిర్మాణం చేపట్టనున్నారు. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా.. నంబూరు వరకు కొత్త రైల్వే లైన్‌కు ఆమోదం లభించింది.

yearly horoscope entry point

రింగ్ రోడ్డు నిర్మాణానికి..

అటు అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు.. ఫైనల్ ఎలైన్‌మెంట్‌, డీపీఆర్‌, భూసేకరణపై ఫోకస్ పెట్టారు. ఇదే సంవత్సరంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. 2018 లోనే ఈ ప్రాజెక్టు కోసం అడుగులు పడినా.. 2019లో ప్రభుత్వం మారడంతో.. ఆగిపోయింది.

చంద్రబాబు సీఎం అయ్యాక..

2024లో చంద్రబాబు సీఎం అయ్యాక.. మళ్లీ ఈ ప్రాజెక్టుకు ఊపిరి పోశారు. కేంద్రం నుంచి అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు ఆమోదం లభించేలా చేశారు. దీంతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు రంగంలోకి దిగారు. భూసేకరణ కోసం అధికారులను నామినేట్‌ చేయాలని కోరుతూ.. ఇటీవల ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, ఈ ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజించి అభివృద్ధి చేయనున్నారు. తూర్పు భాగం 78 కి.మీ వరకు ఉంటుంది. పశ్చిమ భాగం 111 కి.మీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ప్రాజెక్ట్ మొత్తం పొడవు 189 కి.మీ ఉండనుంది. ఆరు లేన్లుగా ఓఆర్ఆర్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో 150 మీటర్ల ఆర్‌వోడబ్ల్యూ, మూడు సొరంగాలు, తొమ్మిది ఇంటర్‌ఛేంజీలు, కృష్ణా నదిపై 2 వంతెనలు ఉండనున్నాయని తెలుస్తోంది. ఇది అన్ని ప్రధాన ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, మచిలీపట్నం ఓడరేవుకు లింక్ కానుంది.పల్నాడు జిల్లాల కలెక్టర్లకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు లేఖలు రాశారు.

అమరావతి ప్రాంతంలోని 22 మండలాలు, 87 గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ నిర్మాణం కానుందని తెలుస్తోంది. దీంతో ఆయా గ్రామాల్లో భూములకు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. విజయవాడ చుట్టుపక్కల ఉన్న మైలవరం, గన్నవరం, నూజివీడు, గుడివాడ, మంగళగిరి, తాడికొండ, పొన్నూరు, పెడన, మచిలీపట్నం, దెందూలూరు నియోజకవర్గాల్లోని భూముల ధరలు పెరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

Whats_app_banner