Private FM channels: ఏపీలో 68, తెలంగాణ‌లో 31.. కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం-union cabinet approved the auction of 68 private fm channels in andhra pradesh and 31 private fm channels in telangana ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Private Fm Channels: ఏపీలో 68, తెలంగాణ‌లో 31.. కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం

Private FM channels: ఏపీలో 68, తెలంగాణ‌లో 31.. కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం

HT Telugu Desk HT Telugu
Aug 29, 2024 02:27 PM IST

Private FM channels: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఎఫ్ఎం ఛాన‌ల్స్‌ మూడో బ్యాచ్ కింద ఈ వేలం వేసేందుకు కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో మూడో ద‌శ పాల‌సీ కింద‌ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

ప్రైవేట్ ఎఫ్ఎం ఛాన‌ల్స్‌
ప్రైవేట్ ఎఫ్ఎం ఛాన‌ల్స్‌ ((Image Source: ANI))

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 68 , తెలంగాణ‌లో 31 ప్రైవేట్ ఎఫ్ఎం ఛాన‌ల్స్ మూడో బ్యాచ్ కింద ఈ వేలం వేసేందుకు.. కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. బుధ‌వారం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన మంత్రివ‌ర్గ సమావేశంలో.. పైవేట్ ఎఫ్ఎం రేడియో మూడో ద‌శ పాల‌సీ కింద‌ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో మాతృభాషలో స్థానిక కంటెంట్‌ను పెంచడానికి, కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడానికి అవకాశం ఉంటుందని కేంద్ర ప్ర‌భుత్వం వివరించింది.

22 న‌గ‌రాల్లో 68 ప్రైవేట్‌ ఎఫ్ఎం ఛానల్స్‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 22 న‌గ‌రాల్లో 68 ప్రైవేట్‌ ఎఫ్ఎం ఛానల్స్‌కు కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వియ‌జ‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం, అమ‌లాపురం, భీమ‌వ‌రం, ఏలూరు, మ‌చిలీప‌ట్నం, చిల‌క‌లూరిపేట‌, న‌ర‌స‌రావుపేట‌, చీరాల‌, ఒంగోలు, చిత్తూరు, క‌డ‌ప‌, ధ‌ర్మ‌వ‌రం, గుంత‌క‌ల్లు, హిందూపురం, మ‌ద‌న‌ప‌ల్లి, అథోని, నంద్యాల‌, ప్రొద్దుటూరు, తాడిప‌త్రి న‌గ‌రాల్లో మూడేసి చొప్పున ప్రైవేట్ ఎఫ్ఎం ఛాన‌ల్స్ ఈ వేలం కోసం ఆమోదించారు. అలాగే కాకినాడ‌, క‌ర్నూల్ న‌గ‌రాల్లోలో నాలుగేసి ప్రైవేట్ ఎఫ్ఎం ఛాన‌ల్స్ ఈ వేలం కోసం ఆమోదించారు.

తెలంగాణ‌లో 10 న‌గ‌రాల్లో 31..

తెలంగాణలోని 10 న‌గ‌రాల్లో 31 ప్రైవేట్ ఎఫ్ఎం ఛాన‌ల్స్‌కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నల్గొండ, రామగుండం, సూర్యాపేట న‌గ‌రాల్లో మూడు ఛానెల్స్ చొప్పున.. అలాగే నిజామాబాద్‌లో నాలుగు ప్రైవేట్‌ ఎఫ్ఎం ఛానల్స్ వేలం కోసం ఆమోదించారు.

దేశ‌వ్యాప్తంగా 234 న‌గ‌రాల్లో..

దేశ‌వ్యాప్తంగా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 234 కొత్త నగరాల్లో 730 ఛానెల్స్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.784.87 కోట్ల అంచ‌నా రిజర్వ్‌డ్ వ్య‌యంతో.. ఇప్పటి వరకు ఎఫ్ఎం కవర్ కానీ ప్రాంతాల్లో వీటిని పెట్టనున్నారు. ఈ నిర్ణయంతో మాతృభాషలో స్థానిక కంటెంట్‌ను పెంచడానికి, కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడానికి అవకాశం ఉంటుందని కేంద్ర ప్ర‌భుత్వం అభిప్రాయపడింది. ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా క్షేత్రస్థాయి వరకు చేర్చేందుకు వీలు కలుగుతుందని మోదీ సర్కార్ భావిస్తోంది.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)