AP Students Dead : ఐర్లాండ్‌లో రోడ్డు ప్రమాదం - ఇద్దరు ఏపీ విద్యార్థులు మృతి-two youths from ap died in a road accident in ireland ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Students Dead : ఐర్లాండ్‌లో రోడ్డు ప్రమాదం - ఇద్దరు ఏపీ విద్యార్థులు మృతి

AP Students Dead : ఐర్లాండ్‌లో రోడ్డు ప్రమాదం - ఇద్దరు ఏపీ విద్యార్థులు మృతి

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 01, 2025 12:17 PM IST

ఐర్లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. ఒకరు ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన చిట్టూరి భార్గవ్‌ (25), పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేష్‌ (26) గా గుర్తించారు. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది

ఐర్లాండ్‌లో రోడ్డు ప్రమాదం
ఐర్లాండ్‌లో రోడ్డు ప్రమాదం (image source unsplah)

ఐర్లాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కృష్ణా జిల్లాకు చెందిన భార్గవ్ , మరొకరు పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేష్‌ ఉన్నారు.

yearly horoscope entry point

కృష్ణా జిల్లా జగ్గయ్య పేట పట్టణానికి చెందిన భార్గవ్(25) ఉన్నత చదువుల కోసం ఐర్లాండ్ వెళ్ళాడు. శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి బయటకి వెళ్లగా… కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్గవ్ తో పాటు పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెరుకూరి సురేశ్(26) కూడా ప్రాణాలు కోల్పోయాడు. చేతికి అందివచ్చిన కుమారులు చనిపోవడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

మరో ఇద్దరికి గాయాలు…

చిట్టూరి భార్గవ్‌, సురేశ్ శుక్రవారం స్నేహితులతో కలిసి కారులో బయల్దేరారు. ఈ క్రమంలోనే వారి కారు ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్గవ్‌, సురేశ్ మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. వీరంతా కూడా కార్లో లో ఉన్న సౌత్ ఈస్ట్ టెక్నాలిజికల్ యూనివర్శిటీలో చదువుతున్నట్లు తెలిసింది.

Whats_app_banner