RTC Bus Driver: లోకేష్‌ను కలిసిన తుని ఆర్టీసీ డ్రైవర్‌, మంత్రి చొరవతో సస్పెన్షన్ రద్దు-tuni rtc driver meets lokesh suspension lifted on ministers initiative ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rtc Bus Driver: లోకేష్‌ను కలిసిన తుని ఆర్టీసీ డ్రైవర్‌, మంత్రి చొరవతో సస్పెన్షన్ రద్దు

RTC Bus Driver: లోకేష్‌ను కలిసిన తుని ఆర్టీసీ డ్రైవర్‌, మంత్రి చొరవతో సస్పెన్షన్ రద్దు

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 06, 2024 01:37 PM IST

RTC Bus Driver: రోడ్డుపై నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ డ్యాన్స్‌ గుర్తుందా… కొద్ది వారాల క్రితం ఏపీలో ఆగిపోయిన ఆర్టీసీ బస్సు ముందు డాన్స్‌ చేసినందుకు ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురై, సస్పెండ్‌ అయిన డ్రైవర్‌కు మంత్రి లోకేష్‌ చొరవతో ఉద్యోగం దక్కింది. తాజాగా మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

కుటుంబ సభ్యలతో కలిసి నారా లోకేష్‌ను కలిసి  ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు
కుటుంబ సభ్యలతో కలిసి నారా లోకేష్‌ను కలిసి ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు

RTC Bus Driver: రోడ్డుపై నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు ముందు డాన్స్‌ చేసి అధికారుల ఆగ్రహానికి గురైన కాంట్రాక్ట్ డ్రైవర్‌కు మంత్రి నారా లోకేష్‌ చొరవతో తిరిగి ఉద్యోగం లభించింది. కొద్ది వారాల క్రితం ఆర్టీసీ బస్సుల ముందు దేవర సినిమా పాటకు డ్యాన్స్ వేసి డ్రైవర్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఈ వ్యవహారం ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. పలువురు టీడీపీ కార్యకర్తలు అకారణంగా డ్రైవర్‌ను సస్పెండ్‌ చేశారు, జోక్యం చేసుకోవాలని మంత్రి నారా లోకేష్‌ను ట్యాగ్‌ చేస్తూ రీ ట్వీట్ చేశారు. ఈ వ్యవహారం కొద్ది రోజుల క్రితం వైరల్‌గా మారింది.

yearly horoscope entry point

విధి నిర్వహణలో ఉండగా దేవర సినిమాలోని పాటకు స్టెప్పులు వేసి సస్పెన్షన్ కు గురైన తుని ఆర్టీసీ డిపో డ్రైవర్ లోవరాజు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. తన సస్పెన్షన్ రద్దుచేయించి, తిరిగి విధుల్లోకి తీసుకునేలా చొరవ చూపించిన మంత్రి లోకేష్ ను కుటుంబంతో సహా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపోలో లోవరాజు అవుట్ సోర్సింగ్ విధానంలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 24న బస్సు రౌతులపూడి నుంచి తుని డిపోకు వెళ్తుండగా మార్గమధ్యలో కర్రల లోడ్ ట్రాక్టర్ అడ్డొచ్చింది. చిన్న రోడ్డు కావడం, బస్సు ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో బస్సును నిలిపివేశారు. ఈ లోగా ప్రయాణికులకు వినోదం పంచడానికి సరదాగా కాసేపు దేవర సినిమాలోని పాటకు డ్యాన్స్ వేశాడు. ఇది కాస్తా ఓ యువకుడు వీడియో తీయడంతో వైరల్ అయింది. సోషల్ మీడియాలో డ్రైవర్ లోవరాజు డ్యాన్స్ చూసిన మంత్రి లోకేష్ మెచ్చుకున్నారు.

ఈ క్రమంలో ట్విట్టర్‌లో బస్సు ముందు డ్రైవర్ డాన్సులు చేయడంతో నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో లోవరాజును అధికారులు సస్పెండ్ చేశారు. కొందరు ప్రయాణికులు బస్సు డ్రైవింగ్ వదిలేసి డాన్స్‌ చేస్తున్నాడని వైరల్‌ చేయడంతో అధికారులు చర్యల చేపట్టారు.

ఈ వ్యవహారాన్ని టీడీపీ కార్యకర్తలు మంత్రి నారా లోకేష్ దృష్టికి రావడంతో సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేయిస్తానని హామీ ఇచ్చారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా కలుస్తానని మాట ఇచ్చారు. దీంతో లోవరాజు కుటుంబంతో సహా మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా లోవరాజు యోగక్షేమాలను మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాల అండగా ఉంటానని చెప్పారు. సస్పెన్షన్ ఎత్తి వేసినందుకు డ్రైవర్‌ లోవరాజు కృతజ్ఞతలు తెలిపారు.

Whats_app_banner