Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు స్థానిక కోటా టికెట్లు విడుదల, ఇలా పొందండి
TTD Local Darshan Quota Tokens : తిరమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. ఇవాళ(జనవరి 5)స్థానిక కోటా టికెట్లను విడుదల చేయనుంది. మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలతో పాటు తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఈ టోకెన్లను జారీ చేస్తారు.
తిరుమల తిరుపతి దేవస్థానం మరో ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ఇవాళ స్థానిక కోటా టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా..ఇవాళ టికెట్లను జారీ చేయనున్నట్లు పేర్కొంది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
కౌంటర్లు ఇవే…
ఈ టికెట్లను తిరుపతి మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలో, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాలులో పొందవచ్చని టీటీడీ సూచించింది. స్థానిక కోటా కింద తిరుపతిలో 2500, తిరుమలలో 500 టికెట్లను జారీ చేస్తారు. తిరుమల, తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంటకు చెందిన భక్తులు…. స్థానిక కోటా కింద తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు పొందవచ్చు. ఇందుకోసం భక్తులు తమ ఒరిజినల్ కార్డును చూపించాల్సి ఉంటుంది.
టీటీడీ మార్గదర్శకాలు….
స్థానిక భక్తుల దర్శనానికి టోకెన్లు తప్పనిసరి అని టీటీడీ కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన ఉచితంగా టిక్కెట్లను జారీ చేస్తారు. దర్శన టోకెన్ పొందడానికి స్థానిక నివాసితులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును తీసుకురావాల్సి ఉంటుంది. ఆధార్ వివరాల ఆధారంగా టోకెన్లు జారీ చేస్తారు.
టోకెన్లను పొందిన యాత్రికులు వారి అసలు ఆధార్ కార్డుతో పాటు శ్రీవారి దర్శనం కోసం కాలినడకన దివ్య దర్శనం ప్రవేశ మార్గంలోకి (VQC)లోకి ప్రవేశించాలి. యాత్రికులకు సర్వదర్శనం టోకెన్ యాత్రికులతో సమానంగా ఒక చిన్న లడ్డూ ఉచితంగా అందిస్తారు. ఈ కేటగిరీలో ఒకసారి దర్శనం పూర్తి చేసుకున్న వారికి 90 రోజుల తర్వాత మాత్రమే దర్శనానికి అర్హత లభిస్తుంది.
చంద్రగిరి, తిరుపతి రూరల్, అర్భన్ మండలాలకు చెందినప స్థానిక ప్రజలకు ఉచితం టోకెన్లను మంజూరు చేస్తారు. ప్రతి నెల 1వ మంగళవారం చంద్రగిరి, తిరుపతి రూరల్, అర్బన్ మండలంలోని ప్రజలకు ఉచిత శ్రీవారి దర్శనం లభిస్తుంది. చంద్రగిరి, తిరుపతి మండలాల ప్రజలకు ఉచిత దర్శనం కల్పించాలని ఎమ్మెల్యే పులివర్తి నాని సీఎంకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం… ఈ మండలాల ప్రజలకు ఉచిత దర్శనం కల్పించాలని నిర్ణయించింది.
• జనవరి 09: చిన్న శాత్తుమొర.
• జనవరి 10: వైకుంఠ ఏకాదశి, స్వర్ణ రథోత్సవం, వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం.
• జనవరి 11: వైకుంఠ ద్వాదశి, స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి చక్ర స్నానం.
• జనవరి 15: ప్రణయ కలహోత్సవం మరియు గోదా పరిణయం.
• జనవరి 17: తిరుమళిసై ఆళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
• జనవరి 18: శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం.
• జనవరి 19: పెద్ద శాత్తుమొర, వైకుంఠ ద్వార దర్శనం ముగింపు.
• జనవరి 20: శ్రీ కూరత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
• జనవరి 23: అధ్యాయనోత్సవాలు సమాప్తం.
• జనవరి 24: తిరుమల నంబి చెంతకు శ్రీ మలయప్పస్వామి వేంచేపు.
• జనవరి 25: సర్వ ఏకాశశి జనవరి 26: గణతంత్ర దినోత్సవం.
• జనవరి 27: మాస శివరాత్రి.
• జనవరి 29: శ్రీ పురంధర దాస ఆరాధన మహోత్సవాలు.
సంబంధిత కథనం