తిరుమల : శ్రీవారి భక్తులకు అలర్ట్ - మొబైల్ ఫోన్ల ఈ-వేలం, ఇలా దక్కించుకోవచ్చు-ttd will conduct an online e auction on june 20 for 74 lots of used and partially damaged mobile phones ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  తిరుమల : శ్రీవారి భక్తులకు అలర్ట్ - మొబైల్ ఫోన్ల ఈ-వేలం, ఇలా దక్కించుకోవచ్చు

తిరుమల : శ్రీవారి భక్తులకు అలర్ట్ - మొబైల్ ఫోన్ల ఈ-వేలం, ఇలా దక్కించుకోవచ్చు

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. శ్రీవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయానికి కానుకగా సమర్పించే మొబైల్ ఫోన్లను ఈ-వేలం వేయనుంది. ఆసక్తి ఉన్న వాళ్లు వేలం ద్వారా దక్కించుకోవచ్చు.ముఖ్యమైన వివరాలను టీటీడీ ప్రకటించింది.

తిరుమల శ్రీవారి ఆలయం

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్ ఇచ్చింది. శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించే మొబైల్ ఫోన్లను వేలం వేయనుంది. ఇందులో ఉపయోగించినవి / పాక్షికంగా దెబ్బతిన్నవి ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ వెల్లడించింది.

ఇవాళ, రేపు ఈ-వేలం…

74 లాట్ల మొబైల్ ఫోన్లను జూన్ 20 నుండి 21వ తేదీ వరకు టీటీడీలో ఆన్ లైన్ ద్వారా ఈ – వేలం వేయనున్నారు. కార్భన్ , ఎల్ వై ఎఫ్, నోకియా, శాంసంగ్, లావా, ఐటెల్, లెనోవా, ఫిలిప్స్, ఎల్.జి.సాంసుయ్, ఒప్పో, పోకో, ఏసర్, పానాసోనిక్, హానర్, వన్ ప్లస్, బ్లాక్ బెర్రి, ఎంఐ, జియోనీ, మైక్రోసాఫ్ట్ , ఆనస్, కూల్ పాడ్, హెచ్ టి సి, మోటోరోలా, టెక్నో, ఇంఫినిక్స్, రియల్ మీ, హువాయ్, సెల్కన్, వివో, మైక్రో మాక్స్ మరియు మొబైల్ ఫోన్లు ఇందులో ఉన్నాయి.

ఆసక్తి ఉన్నవారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ – కొనుగోలు పోర్టల్ లో రిజిస్టర్ అయిన బిడ్డర్లు వేలంలో పాల్గొనటానికి అర్హులు. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్( వేలంలు), / ఏఈవో ( వేలంలు), టిటిడి, హరే కృష్ణ మార్గ్, తిరుపతిలో https://konugolu. ap.gov.in లేదా టీటీడీ వెబ్ సైట్ www.tirumala.org లేదా 0877 – 2264429 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చని టీటీడీ ప్రకటించింది.

క్రమం తప్పకుండా ఫీడ్ బ్యాక్ - టీటీడీ ఈవో

శ్రీవారి భక్తుల నుంచి క్రమం తప్పకుండా అభిప్రాయ సేకరణ జరుగుతోందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. వారి ఇచ్చే ఫీడ్ బ్యాక్ ప్రామాణికంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు.

శ్రీవారి దర్శనం, అన్నప్రసాదాలు, వడ పంపిణీ, వసతి, కాలినడక భక్తులకు అందితున్న సేవలు, లగేజీ, కళ్యాణకట్ట, వైద్యం, పారిశుధ్యం, పరిశుభ్రత, విజిలెన్స్, ట్రాన్స్ ఫోర్ట్ తదితర అంశాలపై భక్తుల నుండి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామన్నారు. శ్రీ మాతృశ్రీ తరిగొండ అన్నప్రసాద భవనంలో పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా అదనపు హాళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సాధ్యాసాద్యాలను పరిశీలించాలని అధికారులను సూచించారు. భక్తులకు అన్నప్రసాదాల పంపిణీలో ఆలస్యం చేయకుండా క్రమపద్దతిలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

వసతి గృహాలలో సకాలంలో పరిశుభ్రతా ప్రమాణాలను పాటించేందుకు వీలుగా రిసెపక్షన్, ఐటీ విభాగాలు సమన్వయంతో ఎఫ్.ఎమ్. ఎస్ యాప్ ను అందుబాటులోకి తీసుకురావాలని ఈవో సూచించారు. భక్తుల రద్దీ సమయాలలో లడ్డూ కౌంటర్లలో భక్తులకు ఇబ్బంది లేకుండా, ఆలస్యం చేయకుండా లడ్డూలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రద్దీకి తగ్గట్టుగా లడ్డూ కౌంటర్లలో సిబ్బందిని నియమించాలన్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.