TTD : జులై 8న సెప్టెంబరు నెల తిరుమ‌లలో వ‌స‌తి కోటా విడుదల-ttd to release september rooms quota on 8th july ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd : జులై 8న సెప్టెంబరు నెల తిరుమ‌లలో వ‌స‌తి కోటా విడుదల

TTD : జులై 8న సెప్టెంబరు నెల తిరుమ‌లలో వ‌స‌తి కోటా విడుదల

HT Telugu Desk HT Telugu
Jul 07, 2022 06:04 PM IST

Tirumala Tirupati Devasthanam : సెప్టెంబరు నెల‌కు సంబంధించిన తిరుమ‌లలో వ‌స‌తి కోటాను జులై 8వ తేదీన విడుదల చేయనున్నారు. శుక్రవారం ఉద‌యం 9 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం

సెప్టెంబరు నెల‌కు సంబంధించిన తిరుమ‌లలో వసతి కోటాను శుక్రవారం ఉదయం విడుదల చేయనుంది టీటీడీ(TTD). అదేవిధంగా శుక్రవారం ఉద‌యం 11 గంట‌ల‌కు జులై 12, 15, 17 తేదీల్లో వ‌ర్చువ‌ల్ ఆర్జిత సేవా టికెట్లు పొందిన భ‌క్తుల‌కు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాలని టీటీడీ అధికారులు కోరారు.

జులై 9న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్యక్రమం జులై 9వ తేదీ శ‌నివారం ఉద‌యం 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంక‌టేశ్వర భ‌క్తి చాన‌ల్ ప్రత్యక్షప్రసారం చేయనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ కార్యనిర్వహణాధికారి ధ‌ర్మారెడ్డికి ఫోన్‌ ద్వారా నేరుగా చెప్పవచ్చు. భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జులై 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం అత్యంత వైభవంగా టీటీడీ నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొంటారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం