Tirumala SED Tickets : ప్రత్యేక దర్శనం.. అంగ ప్రదక్షిణం కోటా టికెట్ల అప్డేట్....-ttd to release sed tickets online quota for february 22 28 on february 13th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ttd To Release Sed Tickets Online Quota For February 22 - 28 On February 13th

Tirumala SED Tickets : ప్రత్యేక దర్శనం.. అంగ ప్రదక్షిణం కోటా టికెట్ల అప్డేట్....

HT Telugu Desk HT Telugu
Feb 10, 2023 05:57 PM IST

Tirumala SED Tickets : తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం.. అంగ ప్రదక్షిణం కోటా టికెట్లకు సంబంధించి టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ మధ్య ఎస్ఈడీ టికెట్ల కోటాను ఫిబ్రవరి 13న.... ఫిబ్రవరి 23 నుంచి 28వ తేదీ వరకు అంగ ప్రదక్షిణం కోటాను ఫిబ్రవరి 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

Tirumala SED Tickets : ఫిబ్రవరి చివరి వారంలో తిరుమల శ్రీవారి దర్శనానికి ప్లాన్ చేస్తున్న భక్తులకి... టీటీడీ కీలక అప్డెట్ ఇచ్చింది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (SED Tickets) ఆన్ లైన్ కోటా టికెట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 13న ఉదయం 9 గంటలకు టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు సంబంధించిన రూ. 300 టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. శ్రీవారి బాలాలయం నేపథ్యంలో... గతంలో ఈ తేదీలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ బ్లాక్ చేసింది. అయితే... బాలాలయం వాయిదా పడటంతో... ఎస్ఈడీ టికెట్ల కోటాను విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు... ఫిబ్రవరి 13న ఉదయం 9 గంటల నుంచి టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉండనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ఫిబ్రవరి 11వ తేదీన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను కూడా విడుదల చేయనుంది టీటీడీ. మార్చి నెలకు సంబంధించిన టోకెన్లు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు ఫిబ్రవరి 23 నుంచి 28వ తేదీ వరకు విడుదల చేయని కోటాను ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 11 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. భ‌క్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్‌లైన్‌లో టోకెన్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

బుకింగ్ ప్రాసెస్….

టికెట్లు బుక్ చేసుకునేందుకు ttdsevaonline.com లో రిజిస్టర్ చేసుకోవాలి. సైట్లో సైన్ అప్ ఆప్షన్ క్లిక్ చేయాలి. లింక్ క్లిక్ చేశాక.. అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత లాగిన్ పేజికి వెళ్తుంది. లాగిన్ తర్వాత తేదీలు అందుబాటులో ఉంటాయి. డ్యాష్ బోర్డును చూసి.. మీ తేదీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కావాల్సిన తేదీ స్లాట్ ను చెక్ చేసుకుంటే.. ఖాళీలు ఉంటే.. గ్రీన్ కలర్ కనిపిస్తుంది. ఆ తర్వాత.. అక్కడ నొక్కితే.. టికెట్ మెుత్తానికి డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. మీకు టికెట్ బుక్ అవుతుంది. సాధారణంగా ఇతర వెబ్ సైట్లలో చేసిన విధానంగానే ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్కువ లడ్డూలు కావాలంటే కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు.

టీటీడీ మొబైల్ అప్లికేషన్‌ ద్వారా కూడా వివిధ రకాల సేవా టిక్కెట్ల బుక్ చేసుకోవచ్చు. జియో సంస్థ సహకారంతో టిటిడి ఐటి విభాగం ఈ యాప్‌ను రూపొందించింది. సామాన్య భక్తులకు స్వామివారి సేవలు, దర్శనం, టికెట్లు, వసతి సులువుగా అందించేందుకు ఆన్లైన్‌ ద్వారా క్లౌడ్‌ టెక్నాలజిని వాడుతున్నారు. తద్వారా ప్రతినెలా దర్శనం, సేవలు, శ్రీవాణి టికెట్లతో పాటు తిరుమల, తిరుపతిలో వసతి కూడా ముందుగానే బుక్‌ చేసుకోవచ్చు.

IPL_Entry_Point