TTD Donations: రూ. కోటి విరాళం చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్న టీటీడీ-ttd to provide special facilities to devotees who donate rs 1 crore ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Donations: రూ. కోటి విరాళం చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్న టీటీడీ

TTD Donations: రూ. కోటి విరాళం చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్న టీటీడీ

Sarath Chandra.B HT Telugu

TTD Donations: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి భక్తులు ఇచ్చే కానుకలపై ప్రత్యేక సదుపాయాలను కల్పించనున్నట్టు టీటీడీ ప్రకటించింది. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే పలు ట్రస్టులకు ఈ విరాళాలను అందింవచ్చు.

కోటి రుపాయల విరాళంతో భక్తులకు బోలెడు సౌకర్యాలు

TTD Donations: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి రూ. కోటి విరాళం ఇచ్చే భక్తులకు టిటిడి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజులలో మినహా మిగిలిన రోజులలో విరాళం ఇచ్చిన భక్తులు తమకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవచ్చు.

టీటీడీకి రూ. కోటి విరాళం ఇచ్చే దాతలకు జీవితకాలంలో దాతతో పాటు నలుగురికి ప్రతి ఏడాది క్రింది సౌకర్యాలను టిటిడి కల్పిస్తోంది.

  • సంవ‌త్స‌రంలో 3 రోజులు సుప్రభాత సేవ మ‌రియు 3 రోజులు బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 4 రోజుల పాటు సుపథం ప్రవేశ దర్శనం ద్వారా శ్రీ‌వారి దర్శనం చేసుకోవచ్చు. వీటితోపాటు 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు, దుప్పట - 1, రవికే - 1, మహా ప్రసాదం ప్యాకెట్లు - 10, ఒక సారి వేద ఆశీర్వచనం వంటి సౌకర్యాలను పొందవచ్చు వీటితో పాటుగా రూ. 3 వేలు రుసుం విలువ చేసే వసతి గదుల సదుపాయం 3 రోజులు కల్పిస్తారు.
  • జీవిత కాలంలో ఒకసారి దాతకు ఒక 5 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ మరియు ఒక 50 గ్రాముల సిల్వర్ డాలర్ ను తగిన ఆధారాలను కార్యాలయం వారికి చూపించి పొందవచ్చు.
  • దాతలు టిటిడి ట్రస్ట్ లకు విరాళాలు ఇవ్వవచ్చు. వీటిలో కాటేజ్ డొనేషన్ స్కీం, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్, ఎస్వీ విద్యాదాన ట్రస్ట్, బర్డ్ ట్ర‌స్టు, శ్రీవేంకటేశ్వర అన్నదాన ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయాస్ ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, శ్రీవాణి ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్ట్, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదినీ స్కీమ్ (స్విమ్స్) లకు దాతలు విరాళాలు చెల్లించి సంబంధింత సౌకర్యాలను పొందవచ్చు.
  • దాతలు టీటీడీ వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in/home/dashboard లో ఆన్ లైన్ ద్వారా విరాళాలు చెల్లించవచ్చు. ఆఫ్ లైన్ లో అయితే దాతలు ఈవో, టిటిడి పేరిట డి.డి/ చెక్ లను తీసుకుని తిరుమలలోని దాతల విభాగంలో ( డోనార్ సెల్) అందజేయాల్సి ఉంటుంది.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం