TTD Updates :నేడు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల-ttd special entry tickets of december month will release today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ttd Special Entry Tickets Of December Month Will Release Today

TTD Updates :నేడు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

HT Telugu Desk HT Telugu
Nov 11, 2022 09:17 AM IST

TTD Updates తిరుమ‌ల‌లో నేడు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది. డిసెంబర్ నెలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం టీటీడీ ముందస్తు టిక్కెట్లను జారీ చేయనుంది.

తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు
తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు (twitter)

TTD Updates తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను నేడు విడుదల చేయనున్నారు. భక్తుల సౌకర్యార్థం డిసెంబ‌రు నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను న‌వంబ‌రు 11న ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నారు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

ట్రెండింగ్ వార్తలు

తిరుమల సర్వదర్శనం కోసం టోకెన్లను జారీ చేస్తున్నారు. ఏ రోజు దర్శనానికి సంబంధించిన టైమ్ స్లాట్ టికెట్లను ఆ రోజే జారీ చేస్తున్నారు. స్లాట్ దర్శనం టోకెన్లను అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో జారీ చేస్తున్నారు. రైల్వే స్టేషన్ వద్ద ఉన్న గోవింద సత్రంతో పాటు బస్టాండ్ కి ఎదురుగా ఉన్న శ్రీనివాసంలో ఈ కేంద్రాలను టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో నిర్ణీత సమయంలో శ్రీవారి దర్శనం చేసుకునేలా టోకెన్లను జారీచ ేస్తారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 7:30 గంటల వరకు మాత్రమే ఈ టికెట్స్ జారీ చేస్తారు

అధిక రద్దీ ఉన్న సమయాల్లో అర్ధరాత్రి 12 గంటలకు కూడా టికెట్స్ ఇష్యూ చేస్తారు . తిరుమల యాత్రకు వచ్చే వారు టైమ్‌ స్లాటెడ్ దర్శనాల సౌకర్యాలను వినియోగించుకోవాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు తిరుమల కొండపైకి వాహనాల రాకపోకల్ని ఉదయం మూడు గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నారు. అలిపిరి మెట్ల మార్గాన్ని ఉదయం నాలుగు గంటలకు తెరిచి రాత్రి పది గంటలకు మూసివేయనున్నారు. శ్రీవారి మెట్ల మార్గాన్ని ఉదయం 6గంటలకు తెరిచి సాయంత్రం ఆరు గంటలకు క్లోజ్ చేయనున్నారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

గురువారం శ్రీవారిని 61,304మంది భక్తులు దర్శించుకున్నారు. 30,133మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారికి హుండీల ద్వారా రూ.3.46కోట్ల రుపాయల ఆదాయం లభించింది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ️ టైం స్లాట్ సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా, ️ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

IPL_Entry_Point