Tirumala Arjita Seva: జూన్ నెల ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా విడుదల… నేటి ఉదయం నుంచి ఆన్‌లైన్‌లో విక్రయం-ttd released the srivari seva online quota of darshan tickets for the month of june 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Arjita Seva: జూన్ నెల ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా విడుదల… నేటి ఉదయం నుంచి ఆన్‌లైన్‌లో విక్రయం

Tirumala Arjita Seva: జూన్ నెల ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా విడుదల… నేటి ఉదయం నుంచి ఆన్‌లైన్‌లో విక్రయం

Sarath chandra.B HT Telugu
Mar 21, 2024 10:17 AM IST

Tirumala Arjita Seva: తిరుమల ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదలయ్యాయి. జూన్‌ నెలలో ఆర్జిత సేవా దర్శనాల కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్ల కోటాను విడుదల చేశారు.

తిరుమల ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల
తిరుమల ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల (https://ttdevasthanams.ap.gov.in)

Tirumala Arjita Seva: జూన్ నెల శ్రీ‌వారి ఆర్జిత‌సేవా టికెట్ల కోటాను Quota గురువారం ఉదయం విడుదల‌ చేశారు. తిరుమ‌ల శ్రీ‌వారి భ‌క్తుల సౌక‌ర్యార్థం జూన్ నెల‌కు June quota సంబంధించి ఆన్‌లైన్‌ కోటాను  TTD టీటీడీ విడుదల చేసింది.

yearly horoscope entry point

ఉద‌యం 10 గంట‌లకు శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తారు...

జూన్ 19 నుండి 21వ తేదీ వరకు జరుగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు గురువారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌ కోటా భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతారు.

గురువారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ్రీ‌వారి వ‌ర్చువ‌ల్ సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్లు, ద‌ర్శ‌న టికెట్ల‌ కోటాను విడుద‌ల చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్  ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు Online బుక్ చేసుకోవాల‌ని టీటీడీ సూచించింది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం స్వామివారిని 69,072 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 26,239 మంది తలనీలాలు సమర్పించారు.స్వామివారి హుండీ ఆదాయం 3.51 కోట్లుగా ఉంది.

తిరుమలలో ఉచిత సర్వ దర్శనానికి 11 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుండగా టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 6 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

సాలకట్ల తెప్పోత్సవాలు…

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు బుధవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతారామచంద్రస్వామి లక్ష్మణ ఆంజనేయ సమేతంగా దర్శనమిచ్చారు.

సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు.

తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.అధికసంఖ్యలో భక్తులు తెప్పోత్సవం లో పాల్గొన్నారు.. స్వామివారికి కర్పూర నీరాజనాలు పట్టారు.

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 20 నుండి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 20న శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. రెండవ రోజు మార్చి 21న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై మూడుసార్లు విహరిస్తారు.

మూడవరోజు మార్చి 22న శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదేవిధంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగో రోజు మార్చి 23న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 24వ తేదీ ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.

ఆర్జిత సేవలు రద్దు :

తెప్పోత్సవాల కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 22, 23, 24వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

Whats_app_banner