TTD Chairman And EO: మా మధ‌్య విభేదాల్లేవు, పొరపాటు జరిగింది.. ఇక ఆ విషయం వదిలేయండన్న టీటీడీ ఛైర్మన్, ఈవో
TTD Chairman And EO: తిరుపతిలో టోకెన్ల జారీ సందర్భంగడా జరిగిన ఘటన దురదృష్టకరమని, ఆ తర్వాత సోషల్ మీడియాలో ఈవో-ఛైర్మన్ మధ్య విభేదాలంటూ జరుగుతున్న ప్రచారంపై ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు ఖండించారు. తమ మధ్య విభేదాలు లేవని జరిగిన పొరపాటును ఇంతటితో వదిలేయాలని కోరారు.
TTD Chairman And EO: తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా బైరాగిపట్టెడ స్కూల్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఛైర్మన్ విచారం వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన పరిణామాలు దురదృష్టకరమని ఆ తర్వాత అంతా సజావుగానే జరుగుతోందని వివరించారు. తొక్కిసలాట ఘటన తర్వాత సోషల్ మీడియాలో అసత్య కథనాలు, తమ ప్రమేయం లేని విషయాలను ప్రచారం చేస్తున్నారన్నారు.

టీటీడీ ఈవోకు, తనకు మధ్య విభేదాలని వస్తున్న వార్తలను ఛైర్మన్ ఖండించారు. తనకు ఈవోకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. టీటీడీ నిర్ణయాలను ఈవో అమలు చేయడం లేదనే ప్రచారాన్ని కూడా ఖండించారు. పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో కొంత జాప్యం జరిగిందని వివరించారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు దురదృష్టకరమని చెప్పారు.
ఇకపై టీటీడీలో ఏదైనా చేసే ముందు అందరికి చెప్పే చేస్తామన్నారు. టీటీడీ పేరుతో అసత్య కథనాలు రావడం దురదృష్టకరమని, తమను సంప్రదించడానికి ఎప్పుడు అందుబాటులో ఉంటామన్నారు. తొక్కిసలాట ఘటన తప్ప మిగిలినవన్నీ అద్భుతంగా ఉన్నాయని భక్తులు చెబుతున్నారని, వైకుంఠ ఏకాదశి నిర్వహణలో సిబ్బంది శ‌్రమను గుర్తించాలన్నారు. ఏర్పాట్లలో అధికారుల శ్రమను అంతా గుర్తించాలని కోరారు. నిర్వహణ లోపంతో పాటు వద్ద ఒకటిరెండు ఘటనలు జరిగాయని, దానిని వదిలేయాలని కోరారు.
ఎవరైనా తనను నేరుగా కలవొచ్చని, తమను సంప్రదించి కథనాలకు వివరణ తీసుకొవచ్చని చెప్పారు. వైకుంఠ ఏకాదశి తర్వాత నిత్యం 60-70వేల మంది దర్శనాలు చేసుకుంటున్నారని, ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారని చెప్పారు. తొక్కిసలాట గురించి వదిలేసి దేవుడి గురించి చెప్పాలని కోరారు.
ఛైర్మన్‌తో పేచీ లేదన్న ఈవో…
సోషల్ మీడియాలో టీటీడీ గురించి తప్పుడు ప్రచారం జరుగుతోందని, వివిధ పనుల్లో బిజీగా ఉండటం వల్ల స్పందించలేదని ఈవో శ్యామలరావు చెప్పారు.ఈవోకు ఛైర్మన్‌కు సమన్వయం లేదని, ఆధిపత్య పోరు నడుస్తోందని, వ్యవస్థలు పనిచేయడం లేదని ప్రచారం జరుగుతోందని ప్రజలు కూడా వాటిని నమ్మే పరిస్థితి వచ్చిందన్నారు. సోషల్ మీడియాలో ఈవోకు ఛైర్మన్‌కు పడక ఏకవచనంతో సంబోధించారని, రకరకల కథనాలు ప్రచారం జరిగాయని, ప్రజల్లో సందేహాలు వ్యక్తం అయ్యే పరిస్థితులు రావడంపై విచారం వ్యక్తం చేశారు.
టీటీడీ బోర్డు పర్యవేక్షణలోనే నిర్ణయాలు జరుగుతాయని,టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాల ప్రకారం పనులు జరుగుతాయని, ముఖ్యమైన అంశాలన్నీ బోర్డులో చర్చించిన మేరకు జరిగాయని చెప్పారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు బోర్డులో చర్చ మేరకు జరిగాయని చెప్పారు.
అందరూ సమన్వయంతో పనిచేశారని, తొక్కిసలాట ఘటన జరిగింది తిరుపతిలో ఉన్న స్కూల్ ఆవరణలో అని ఈవో వివరించారు. తొక్కిసలాట ఘటనపై విమర్శలు చేయడం సరికాదన్నారు. సోషల్ మీడియాలో తిరుమలలో జరిగినట్టు ప్రచారం జరిగిందన్నారు. భక్తుల్ని వదిలే సమయంలో కొన్ని ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంటుందని దాని వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. ఇకపై వాటిని పునరావృతం కానివ్వమని చెప్పారు.
మరోవైపు తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట తదనంతరం జరిగిన పరిణామాలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడం, ఛైర్మన్, ఈవో సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేయడంతో విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
సంబంధిత కథనం