TTD news | శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక‌ శోభ-ttd news cultural activities at tirumala srivari brahmothsavalu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ttd News : Cultural Activities At Tirumala Srivari Brahmothsavalu

TTD news | శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక‌ శోభ

HT Telugu Desk HT Telugu
Sep 28, 2022 09:23 PM IST

Srivari brahmothsavalu: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో తిరుమలలో జరిగిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

బ్రహ్మోత్సవాల్ల భక్తులు
బ్రహ్మోత్సవాల్ల భక్తులు

Srivari brahmothsavalu: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపం, తిరుప‌తిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రం, అన్న‌మాచార్య క‌ళామందిరం, శ్రీ‌రామ‌చంద్ర పుష్క‌రిణి వద్ద ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Srivari brahmothsavalu: ఉదయం 4.30 నుంచే..

ఇందులో భాగంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధ‌వారం ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత‌, నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ‌మ‌తి బి.లక్ష్మీ సువర్ణ బృందం మంగళధ్వని కార్య‌క్ర‌మం జరిగింది. తిరుమ‌ల ఆస్థాన‌మండ‌పంలో ఉదయం 10 నుండి 11 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ‌మ‌తి ఆర్‌.వాణిశ్రీ బృదం విష్ణుసహస్రనామ పారాయ‌ణం, ఉదయం 11 నుండి 12.30 గంటల వరకు ఎస్వీ సంగీత‌, నృత్య క‌ళాశాలకు చెందిన శ్రీ‌మ‌తి పి.శైల‌జ బృందం భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. సాయంత్రం 4 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన శ్రీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, శ్రీ పి.మునిర‌త్నంరెడ్డి అన్న‌మ‌య్య విన్న‌పాలు సంగీత కార్య‌క్ర‌మం, రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌మ‌తి విజ‌య‌కుమారి హ‌రిక‌థాగానం చేశారు.

Srivari brahmothsavalu: తిరుప‌తిలో

తిరుప‌తిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు టిటిడి ఆస్థాన విద్వాంసులు శ్రీ గ‌రిమెళ్ల బాల‌కృష్ణ‌ప్ర‌సాద్ భ‌క్తి సంగీతం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అన్న‌మ‌య్య కీర్త‌న‌ల‌ను ర‌స‌ర‌మ్యంగా గానం చేశారు. అన్న‌మాచార్య క‌ళామందిరంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారిణి శ్రీ‌మ‌తి కె.విశాలాక్షి ప‌లు భ‌క్తి సంకీర్త‌న‌లు చ‌క్క‌గా ఆల‌పించారు. అదేవిధంగా, రామ‌చంద్ర పుష్క‌రిణిలో సాయంత్రం 6 నుండి 8 గంట‌ల వ‌ర‌కు పెద‌తాడేప‌ల్లికి చెందిన శ్రీ గ‌ణేష్‌కుమార్ భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

IPL_Entry_Point