TTD Recruitment 2023 : టీటీడీలో AEE ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - ముఖ్య తేదీలు, సిలబస్ ఇదే
TTD AEE Recruitment 2023: టీటీడీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఏఈఈ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ మేరకు ముఖ్య వివరాలను పేర్కొంది.
TTD AEE Recruitment 2023: నిరుద్యోగులకు మరో అలర్ట్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇందులో భాగంగా… ఏఈఈ(ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే దరఖాస్తులను ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. బీఈ (ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ముఖ్య వివరాలను వెల్లడించింది.
ముఖ్య వివరాలు:
ఉద్యోగాల భర్తీ ప్రకటన - తిరుమల తిరుపతి దేవస్థానం
ఉద్యోగాల పేరు - ఏఈఈ(ఎలక్ట్రికల్)
మొత్తం ఖాళీలు - 04
అర్హతలు - బీఈ (ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హిందూ మతస్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు అవుతారు.
వయోపరిమితి - 42 ఏళ్లు మించి ఉండకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ ఆభ్యర్థులకు 5 ఏళ్లు, పీహెచ్ అభ్యర్థులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.
వేతనం - నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760
ఎంపిక విధానం -రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు - ఆన్‌లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి.
అప్లికేషన్ చివరి తేదీ- డిసెంబర్ 19, 2023.
అధికారిక వెబ్ సైట్ - https://ttd-recruitment.aptonline.in