TTD on Cow Deaths: టీటీడీ గోశాలలో గోవుల మృతిపై వివాదం కొనసాగుతోంది. గత వారం గోశాలలో 100గోవులు మృతి చెందామయని ఆరోపించడంతో కలకలం రేగింది. దీనిని టీటీడీ ఛైర్మన్ అధికారులు ఖండించారు. దీంతో తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని భూమన ప్రకటించారు. దీంతో టీటీడీ ఈవో సోమవారం వివరణ ఇచ్చారు.
మార్చి 2021 నుండి మార్చి 2024 వరకు గోశాలలో చాలా అక్రమాలు జరిగాయని, ముఖ‌్యమంత్రి ఆదేశాలతో వాటిని సరిచేస్తున్నామని చెప్పారు. 2024 ఏడాది నాటికి 179 గోవులు మరణించగా, 2025 ఏడాదిలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో 43 గోవులు మృతి చెందాయని ఈవో తెలిపారు. చనిపోయిన గోవులు వయోభారం, వ్యాధుల కారణంగా సహజ మరణాలేనన్నారు.
ఈ సంవత్సరం ఇప్పటి వరకు 59 లేగ దూడలు జన్మించాయని, టిటిడి బోర్డు మాజీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని, గోవుల దాణాను విస్మరించినట్లు, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మృతి చెందినట్లు నిరాధారమైన ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు.
కరుణాకర్ రెడ్డికి నిజంగా గోవుల మీద ఆందోళన వుంటే వారి పాలనలో జరిగిన అక్రమాలపై ఎందుకు దర్యాప్తు చేయలేదని ఈవో ప్రశ్నించారు. టీటీడీ గోశాలకు కొత్తగా డైరెక్టర్ వచ్చాక ఈ అవకతవకలు, అక్రమాలు, నిర్లక్ష్యం తదితర అంశాలన్నీ వెలుగులోకి వస్తున్నాయన్నారు. గతంలో దళారులకు అడ్డాగా మారిన టీటీడీని , ఇపుడు దళారులపై పూర్తిగా కట్టడి చేసి చర్యలు చేపట్టామన్నారు
టిటిడి గోశాలలో గోవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని శ్యామల రావు తెలిపారు. గత పాలనలో జరిగిన అవకతవకలను ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తున్నామన్నారు. గోశాలలో గోవులకు కాలం చెల్లిన మందులు, మందులు ఎక్కడ తయారు చేశారో లేబుల్ లు కూడా లేని మందులు గోవులకు ఇచ్చినట్లు, పురుగులు పడ్డ దాణా, పాచిపట్టిన నీరు అందించారని, చనిపోయిన గోవుల వివరాలను నమోదు చేయలేదని విజిలెన్స్ నివేదికలలో నమోదైనా ఎలాంటి చర్యలు తీసుకోకుండా దాచిపెట్టారని వివరిచారు.
తీవ్ర వ్యాధులతో ఉన్న గోవులను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశమైనా ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదన్నారు. అప్పట్లో అధికారుల నిర్లక్ష్యం మూలంగా రెండు సార్లు గోశాలలో అగ్నిప్రమాదాలు జరిగాయన్నారు.
దాణా, మందుల సరఫరా కాంట్రాక్ట్ లోను భారీగా అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇపుడు వీటిపై చర్యలు చేపట్టామన్నారు. గతంలో విజిలెన్స్ అధికారులను అనుమతించలేదని, ఇపుడు ఎవరైనా గోశాలకు వెళ్లి చూడవచ్చని, చాలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నామన్నారు. టిటిడి గోశాలలో పాల ఉత్పత్తిలో గతం కంటే అదనంగా గోవులు పాలు ఇస్తున్నాయన్నారు.
టిటిడి గోశాలలో 100 ఆవులు అనుమానాస్పదంగా మరణించాయని, టిటిడి ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశ్యంతో మాజీ టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చేసిన ఆరోపణలను నిరాధారమైనవని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశ్యంతో చేసిన ఆరోపణలను ఈఓ తోసిపుచ్చారు.
మార్చి 2021 నుండి మార్చి 2024 వరకు ఎస్వీ గోశాలలో చాలా అవినీతి కార్యకలాపాలు జరిగాయని, అప్పట్లో (మార్చి 2021 నుండి మార్చి 2024 వరకు తిరుపతిలోని ఎస్వీ డెయిరీ ఫామ్‌లో) టిటిడి విజిలెన్స్ నివేదిక సమర్పించిన వీడియో క్లిప్పింగ్‌లు మరియు గణాంక ఆధారాలను, టిటిడి గోశాలలో జరిగిన దుర్వినియోగాన్ని మీడియా ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గోవులు ప్రతి నెల సగటున 15 ఆవులు వయోభారం, వ్యాధులతో చనిపోతాయని చెప్పారు.
సంబంధిత కథనం