తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. శ్రీవారి మెట్టువద్ద నుండి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా నిలిపివేసింది. శ్రీవారి మెట్టు వద్ద నుంచి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ కి మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నూతన కౌంటర్లు శుక్రవారం సాయంత్రం నుంచి అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది.
ఇదే అంశానికి సంబంధించి టీటీడీ ఈవో జె. శ్యామలరావు మంగళవారం సాయంత్రం అధికారులతో సమీక్షించారు. భక్తుల ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యమైన అంశాలను ఇక్కడ తెలుసుకోండి….
అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్ల జారీ ప్రక్రియ సజావుగా జరిగేలా నిరంతరం పర్యవేక్షించడానికి అధికారుల బృందాన్ని నియమించనున్నారు. టోకెన్ కౌంటర్ల దగ్గర ఇబ్బంది లేని వాతావరణం ఉండేలా చూసుకోవాలని ఈవో ఆదేశించారు. టోకెన్ కౌంటర్ల తాత్కాలిక మార్పు అంశంపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు . భక్తుల సౌకర్యార్థం పటిష్ట క్యూలైన్లను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
భక్తులకు అందించే అన్నప్రసాదాలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయా విభాగాధిపతులను టీటీడీ ఈవో సూచించారు. శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
సంబంధిత కథనం
టాపిక్