Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - స్థానిక కోటా దర్శనాల్లో మార్పులు-ttd changed the locals darshan from first week of tuesday to second week in the month of february 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - స్థానిక కోటా దర్శనాల్లో మార్పులు

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - స్థానిక కోటా దర్శనాల్లో మార్పులు

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 01, 2025 09:59 AM IST

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. తిరుమల, తిరుపతి స్థానిక కోటా దర్శనాల్లో మార్పులు చేసింది. రథసప్తమి దృష్ట్యా.. రెండో మంగళవారమైన 11వ తేదీకి స్థానిక కోటా దర్శనాలను మార్పు చేసినట్లు టీటీడీ తెలిపింది.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

స్థానిక కోటా టికెట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అలర్ట్ ఇచ్చింది. ఈ కోటా దర్శనాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు తెలిపింది. ఈనెల మొదటి మంగళవారమైన 4వ తేది రథసప్తమి పర్వదినం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

yearly horoscope entry point

11వ తేదీకి మార్పు…

భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండో మంగళవారమైన 11వ తేదికి స్థానిక కోటా దర్శనాలను మార్పు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్, తిరుపతిలోని మహతీ ఆడిటోరియంలో 9వ తేది ఆదివారం టోకెన్లను జారీ చేస్తారని వెల్లడించింది. స్థానికులు ఈ మార్పును గమనించి టోకెన్లు పొందాలని విజ్ఞప్తి చేసింది. ప్రతినెలా మొదటి మంగళవారం తిరుమల, తిరుపతి స్థానికులకు టీటీడీ స్థానిక కోటాలో దర్శనాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.

రథసప్తమికి వైభవంగా ఏర్పాట్లు - టీటీడీ ఛైర్మన్

ఫిబ్రవరి 4వ తేది రథసప్తమి(సూర్య జయంతి) సందర్భంగా తిరుమలలో వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. రథ సప్తమి రోజున 2 – 3 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో చైర్మన్ అధ్యక్షతన శుక్రవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రథ సప్తమి ఏర్పాట్ల గురించి ఛైర్మన్ వివరించారు.

టీటీడీ ఛైర్మన్ చెప్పిన ముఖ్య వివరాలు:

• రథసప్తమి వేళ⁠ ⁠1250 మంది పోలీసులు, 1,000 విజిలెన్స్ సిబ్బందితో భద్రతా సేవలు.

•⁠ ⁠ఆక్టోపస్, ఏపీఎస్పీ, అగ్నిమాపక దళం, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు.

•⁠ ⁠గ్యాలరీలలోకి వచ్చే భక్తుల కొర‌కు ప్రవేశ, నిష్క్రమణ మార్గాల‌తో పాటు అత్య‌వ‌స‌ర మార్గాలు (ఎమ‌ర్జెన్సీ గేట్లు) ఏర్పాటు.

•⁠ ⁠టీటీడీ నిఘా, భ‌ద్ర‌తా విభాగం అధికారులు పోలీసుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని మెరుగైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు.

•⁠ ⁠భ‌క్తుల సౌక‌ర్యార్థం చ‌క్ర‌స్నానానికి పుష్క‌రిణీలో ఎన్.డి.ఆర్.ఎఫ్, గ‌జ ఈత‌గాళ్ల ఏర్పాటు చేస్తారు.

అష్టదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దవుతాయని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. ⁠ ⁠ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు కూడా రద్ద చేస్తున్నట్లు ప్రకటించారు. ⁠ ⁠ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 03న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం