నేడు టీటీడీ ఆగస్టు నెల కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల..-ttd august quota service tickets released online today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  నేడు టీటీడీ ఆగస్టు నెల కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల..

నేడు టీటీడీ ఆగస్టు నెల కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల..

Sarath Chandra.B HT Telugu

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లలో ఆగస్టు నెల కోటా నేడు విడుదల కానున్నాయి.ఆర్జిత సేవల్లో పాల్గొనాలనుకునే భక్తులు ఎలక్ట్రానిక్‌ డిప్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారు మే 21 నుంచి 23లోగా నగదు చెల్లించాల్సి ఉంటుంది.

నేడు టీటీడీ ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల కోటా టిక్కెట్లు మే 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది. టీటీడీ ఆర్జిత సేవా టిక్కెట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

ఈ టికెట్లు పొందిన వారికి మే 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీ‌వారి సాల‌క‌ట్ల ప‌విత్రోత్స‌వాల‌ టికెట్లను మే 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

22న వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల కోటాను మే 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు….

ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల ఆన్ లైన్ కోటాను మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఆగ‌స్టు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను మే 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…

తిరుమల, తిరుపతిల‌లో ఆగ‌స్టు నెల గదుల కోటాను మే 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

29న శ్రీవారి సేవా కోటా విడుదల

తిరుమల, తిరుపతిలో జరిగే శ్రీవారి సేవ, పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ లీడర్స్ (సీనియర్ సేవక్స్) సేవల జూలై నెల కోటాను మే 29న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.

టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్‌ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం