TTD Tickets: భక్తులకు అలర్ట్.. ఈ నెల 12న శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల-ttd arjitha seva tickets will be released on 12 december 2022 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ttd Arjitha Seva Tickets Will Be Released On 12 December 2022

TTD Tickets: భక్తులకు అలర్ట్.. ఈ నెల 12న శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల

HT Telugu Desk HT Telugu
Dec 09, 2022 05:37 PM IST

TTD Arjitha Seva Tickets News: జనవరి నెలకు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈనెల 12న విడుదల చేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.

ఈ నెల 12న శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల
ఈ నెల 12న శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల (twitter)

TTD Arjitha Seva Tickets For January 2023: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది టీటీడీ. 2023 జనవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈనెల 12న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

జనవరి నెలకు సంబంధించి మరికొన్ని ఆర్జిత సేవా టికెట్లకు ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ నమోదు ప్రక్రియ డిసెంబరు 12న ఉదయం 10 గంటల నుంచి డిసెంబరు 14న ఉదయం 10గంటల వరకు ఉంటుందని వివరించింది. ఆ తరువాత లక్కీడిప్‌లో టికెట్లు కేటాయించనున్నట్టు పేర్కొంది. భ‌క్తులు ఈ విష‌యాల‌ను గుర్తించి శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌ను బుక్ చేసుకోవాల‌ని కోరింది.

బుకింగ్ ఇలా...

భ‌క్తులు ఆన్‌లైన్‌లో శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌ను బుక్ చేసుకోవాలి. నకిలీ వెబ్ సైట్లు కాకుండా.. అధికారిక వెబ్‌సైట్‌ https://ttdsevaonline.com ను సందర్శించి బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సరైన వివరాలను నమోదు చేసి ప్రక్రియను పూర్తి చేయాలి.

మరోవైపు శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పనుంది టీటీడీ. ఇకపై తిరుమలకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని యాప్‌ ద్వారా అందించేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు.. శ్రీవారి దర్శన టికెట్లు, సేవలు, వసతి గృహాలను బుక్‌ చేయడంతో సమాచారమంతా భక్తులకు అందుబాటులో ఉంచేలా ఈ యాప్‌ను రూపొందించే పనిలో ఉంది. త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. దర్శన టోకెన్లకు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో టీటీడీకి సంబంధించిన వెబ్‌సైట్‌ ద్వారా బుక్‌ చేసుకుంటున్నారు. కొత్తగా తీసుకొచ్చే యాప్‌ ద్వారా భక్తులు సులభంగా దర్శనం, గదులు, శ్రీవారిసేవా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే సేవలు జరిగే సమయంలో సుప్రభాతం, తోమాల, అర్చన వంటి వాటిని వినేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. గతంలో గోవింద యాప్ ను తీసుకొచ్చినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేదు. దీని ప్లేస్ లోనే సరికొత్తగా మరో యాప్ ను తీసుకురాబోతుంది. ఇప్పటికే దాదాపు పూర్తి కావొచ్చినట్లు తెలుస్తోంది.

IPL_Entry_Point