TTD Darshan Tickets: నేడు టీటీడీ ఏప్రిల్ నెల కోటా ఆర్జిత సేవల టిక్కెట్లు విడుదల, ఆన్‌లైన్‌‌లో ఎంపిక..-ttd april quota service tickets released today selection through online ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Darshan Tickets: నేడు టీటీడీ ఏప్రిల్ నెల కోటా ఆర్జిత సేవల టిక్కెట్లు విడుదల, ఆన్‌లైన్‌‌లో ఎంపిక..

TTD Darshan Tickets: నేడు టీటీడీ ఏప్రిల్ నెల కోటా ఆర్జిత సేవల టిక్కెట్లు విడుదల, ఆన్‌లైన్‌‌లో ఎంపిక..

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 21, 2025 09:39 AM IST

Tirumala Darshan Tickets : తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవలకు ఏప్రిల్ నెల కోటా టిక్కెట్లు నేడు విడుదల కానున్నాయి. ఆర్జిత సేవల్లో సుప్రభాతం, తోమ‌ల‌, అర్చన‌, అష్టదళ పాదపద్మారాధన సేవల 2025 ఏప్రిల్ నెల కోటా నేడు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

నేడు టీటీడీ ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల
నేడు టీటీడీ ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల

TTD Darshan Tickets: తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లలో ఏప్రిల్ నెల కోటా నేడు విడుదల కానున్నాయి. సుప్ర‌భాతం, తోమ‌ల‌, అర్చ‌న‌, అష్టదళ పాదపద్మారాధన సేవల ఏప్రిల్‌ నెల కోటాను నేడు జారీ చేస్తారు. లక్కీ డిప్‌లో రిజిస్టర్ చేసుకున్న వారిలో లాటరీ ద్వారా టిక్కెట్లను కేటాయిస్తారు. ఇప్పటికే నగదు చెల్లించిన వారికి లాటరీలో టిక్కెట్లు పొందే అవకాశం ఉంటుంది.

శ్రీవారి దర్శన టికెట్లు - ముఖ్య తేదీలు:

జ‌న‌వ‌రి 21న ఆర్జిత సేవా టికెట్లు : కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లతో పాటు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల ఆర్ధిత సేవా టికెట్లను జ‌న‌వ‌రి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

జ‌న‌వ‌రి 21న వర్చువల్ సేవల కోటా : వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఏప్రిల్‌ నెల కోటాను జ‌న‌వ‌రి 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

జ‌న‌వ‌రి 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు: ఏప్రిల్‌ నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జ‌న‌వ‌రి 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా: శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఏప్రిల్‌ నెల ఆన్ లైన్ కోటాను జ‌న‌వ‌రి 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా: వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను జ‌న‌వ‌రి 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

జ‌న‌వ‌రి 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు: ఏప్రిల్‌ నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జ‌న‌వ‌రి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది.

తిరుమల, తిరుపతిలో ఏప్రిల్‌ నెల గదుల కోటాను జ‌న‌వ‌రి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఈ టికెట్లన్నీ తిరుమల శ్రీవారి అధికారిక వెబ్‌సైట్‌ https://ttdevasthanams.ap.gov.in ద్వారా లభిస్తాయి.

Whats_app_banner