Rjy Double Murders: మైనర్ బాలికతో ప్రేమ వ్యవహారం సాగించిన యువకుడు ఆమె మరొకరితో చాటింగ్ చేస్తోందనే అనుమానంతో దారుణంగా హత్య చేసిన ఘటన రాజమహేంద్ర వరంలో జరిగింది. రెండ్రోజులుగా బాలికతో గొడవ పడుతున్న యువకుడు ఆదివారం ఇద్దరిని కత్తితో పొడిచి చంపేశాడు.
రాజమహేంద్రవరంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన జంట హత్యలు కలకలం రేపాయి. ఏలూరు పట్టణంలోని ఏఎస్ఆర్ స్టేడియం ప్రాంతానికి చెందిన మహ్మద్ సల్మా (38), ఆమె కుమార్తె మహ్మద్ సానియా ఎలియాస్ సానాలు (16) మూడు నెలలుగా రాజమహేంద్రవరంలోని హుకుంపేటలో నివాసం ఉంటున్నారు. ఏలూరు జాంపేట ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ మజీద్‌కు సల్మా రెండో భార్య కాగా మజీద్ మూడేళ్ల క్రితం మృతిచెం దాడు.
మజీద్ మొదటి భార్యకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారు జాంపేటలో నివసిస్తుండగా సల్మా, సానియా రాజమండ్రిలో ఉంటున్నారు. సానియా ఈవెంట్లలో యాంకరింగ్ చేస్తుంటుంది. సల్మా, సానియాలతో పాటు మజీద్ మొదటి భార్య చిన్న కుమారుడు ఉమర్ ఉంటున్నాడు.
కొద్ది నెలల క్రితం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈవెంట్‌కు వెళ్లిన సమయంలో ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకు చెందిన పల్లి శివకుమార్ లైట్ బాయ్‌గా అక్కడకు వచ్చాడు. ఆ సమయంలో మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాడు.
సల్మా వేరే వారితో చాటింగ్ చేస్తోందని అనుమానిస్తున్న శివకుమార్ వారం రోజుల క్రితం హైదరాబాద్ నుంచి సానియా ఇంటికి వచ్చాడు. సానియా ఫోన్లో చాటింగ్ చేయడంపై ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి ఇద్దరూ గొడవ పడుతుంటే మొదటి భార్య కుమారులైన మహ్మద్ ఆలీ, ఉమర్‌లు శివకుమార్‌తో గొడవ చేయొద్దని సర్దిచెప్పి వెళ్లిపోయారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఇంటికి వచ్చిన ఉమర్ ఇంటికి తాళం వేసి ఉండటంతో కిటికీలో నుంచి చూడగా సల్మా, సానియా రక్తపు మడుగులో కనిపించారు.
వెంటనే డయల్100 నంబరుకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాధ్, తన సిబ్బందితో తాళాలు పగులగొట్టి లోపల మృతదేహాలను పరిశీలించారు. సల్మా, సానియాల మెడమీద బలమైన కత్తిపోటు గాయాలుండడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.కూరలు కోసే కత్తితో వారిని హతమార్చినట్టు గుర్తించారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, శాంతిభద్రతల ఏఎస్పీ ఏవీ సుబ్బరాజు, డీఎస్పీలు బి. విద్య, శ్రీకాంత్ పరిశీలించారు.
సల్మా సోదరుడు ఉమర్‌ను ఎస్పీ వివరాలడిగి తెలుసుకున్నారు. సానియా బంధువులు మహ్మద్ ఆలీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హత్యలకు పాల్పడిన నిందితుడు శివకుమార్‌ను ఆదివారం మధ్యాహ్నం కొవ్వూరు ప్రాంతంలో రూరల్ ఎస్సై శ్రీహరి పట్టుకున్నారు. నిందితుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
సంబంధిత కథనం