ఏలూరు జిల్లా తీవ్ర విషాదం, చెరువులో మునిగి ముగ్గురు మృతి-tragic drowning in andhra pradesh three die in pond mishap in eluru district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏలూరు జిల్లా తీవ్ర విషాదం, చెరువులో మునిగి ముగ్గురు మృతి

ఏలూరు జిల్లా తీవ్ర విషాదం, చెరువులో మునిగి ముగ్గురు మృతి

ఏపీలోని ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భీమడోలు మండలం కోమటిగుంట చెరువులో మునిగి ముగ్గురు యువకులు మృతి చెందారు.

ఏపీలో తీవ్ర విషాదం, చెరువులో మునిగి ముగ్గురు మృతి ( )

ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా భీమడోలు మండలంలో బుధవారం మధ్యాహ్నం కోమటిగుంట చెరువులో మునిగి ముగ్గురు మృతి చెందారు. భీమడోలు మండలంలోని పెదలింగంపాడులో ఓ వేడుకకు హాజరైన నలుగురు యువకులు తిరుగు ప్రయాణంలో కాలకృత్యాల కోసం కోమటిగుంట చెరువు వద్ద ఆగారు.

ప్రమాదవశాత్తూ చెరువులో పడి ముగ్గురు మరణించారు. మృతులు పెదవేగి మండలం వేగివాడ గ్రామానికి చెందిన అజయ్‌ (28), అభిలాష్‌ (16), సాగర్‌ (16)గా పోలీసులు గుర్తించారు.

వైఎస్ఆర్ కడప జిల్లాలో

వైఎస్ఆర్ కడప జిల్లాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. బ్రహ్మంగారిమఠం మండలం మల్లేపల్లెలో చెరువులో దిగిన ఐదుగురు చిన్నారులు నీటిలో మునిగి మృతి చెందారు.చెరువులో మునిగిన చిన్నారులను తరుణ్, చరణ్, పార్దు , హర్ష, దీక్షిత్‌గా గుర్తించారు. సమాచారం అందుకొన్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా.. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు.

వేసవి సెలవుల్లో ఆనందంగా గడుపేందుకు బంధువుల ఇళ్లకు వచ్చిన చిన్నారులు ఒకేసారి ప్రమాదానికి గురయ్యారు. ఆడుకుంటూ ఊరి చెరువు వైపు వెళ్లిన చిన్నారులు అందులో దిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

వేసవి సెలవులకు వచ్చి

ఈ ఘటన కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లెలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం బోధనం గ్రామానికి చెందిన సుబ్బయ్య కుమారులు చరణ్(15), పార్దు (12) వేసవి సెలవులకు అమ్మమ్మ ఊరైన బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లె గ్రామా నికి వచ్చారు.

జమ్మలమడుగు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన రామకృష్ణ కుమారుడు హర్ష (12) మల్లేపల్లెలోని తన మేనత్త ఇంటికి వచ్చాడు. కాశీ నాయన మండలం మల్లేరు కొట్టాలు గ్రామానికి చెందిన నారాయణ కుమా రుడు తరుణ్ యాదవ్ (10) మల్లేపల్లెలోని పెదనాన్న ఇంటికి వచ్చాడు. వీరితో పాటు మల్లేపల్లె గ్రామానికి చెందిన తరుణ్ యాదవ్ కుమారుడు దీక్షిత్ (12) కలశాడు.

ఐదుగురు చిన్నారులు మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆడుకుంటూ రోడ్డుపైకి వెళ్లారు. సాయంత్రం 5 గంటలు దాటుతున్నా చిన్నారుల అచూకీ లేకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు, వారి తల్లిదండ్రులు ఊళ్లో గాలించారు.

గ్రామ శివార్లలోని చెరువు ఒడ్డుపై

గ్రామ శివార్లలో ఉన్న చెరువు ఒడ్డుపై పిల్లల బట్టలు కనిపించడంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు చెరువులో గాలింపు చర్యలు చేప ట్టారు. మంగళవారం రాత్రి ఏడుగంటల నుంచి మోటార్ల సాయంతో చెరువులో నీటిని తోడారు.

రాత్రి 11 గంటలకు పిల్లల మృతదేహాలను గుర్తించారు. మరో ఇద్దరి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ప్రమాదంలో కర్నూలు జిల్లాకు చెందిన అన్నదమ్ములు మృతి చెందడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం