Singarayakonda Tragedy: ప్రకాశం జిల్లాలో విషాదం.. సముద్ర స్నానాలకు వెళ్లి నలుగురు దుర్మరణం
Singarayakonda Tragedy: పండుగ సెలవుల్లో సరదాగా గడిపేందుకు సముద్ర స్నానాలకు వచ్చిన కుటుంబాన్ని సముద్రపు అలలు మింగేశాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని పాకాల సముద్ర తీరంలో జరిగిన ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, చిన్నారులు ఉన్నారు.
Singarayakonda Tragedy: పండుగ సెలవుల్లో ఉల్లాసంగా గడిపేందుకు సముద్ర స్నానం కోసం వచ్చిన కుటుంబానికి విషాదం మిగిలింది. మూడ్రోజులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న కుటుంబ సభ్యులు, బంధువులు సముద్ర స్నానాలకు వచ్చారు. మహిళలు విడిగా సముద్రంలోకి వెళ్లి రాకాసి అలల తీవ్రతకు మునిగిపోయారు. కుటుంబంలో మహిళలు విడిగా సముద్రంలో స్నానం చేస్తున్న సమయంలో భారీ అలలు ముంచెత్తడంతో నలుగురు గల్లంతయ్యారు.

అదే ప్రాంతంలో ఉన్న స్థానిక మత్స్యకారులు, సముద్రస్నానాలకు వెళ్లిన ఇతర ప్రాంతాల యువకులు అప్రమత్తమై లో ఒకరిని కాపాడగా, ముగ్గురు మృతిచెందారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో గురువారం మధ్యాహ్నం జరిగింది. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం తిమ్మపాలెం గ్రామపంచాయతీలోని శివన్నపాలెంకు చెందిన 20 మంది సమీప బంధువులు సముద్ర స్నానానికి గురువారం ఉదయం పాకల బీచ్‌కు వచ్చారు.
గురువారం సముద్రంలో స్నానానికి దిగిన సమయంలో అలల ఉధృతి తీవ్రంగా ఉంది. సముద్రంలో దిగిన చోట గుంతలు ఉండటంతో మహిళలు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఒక్కసారి ముంచెత్తిన అలలతో ఐదుగురు కొట్టుకుపోయారు. మిగిలిన వారు కేకలు వేయడంతో మెరైన్ సిబ్బంది అప్రమత్తమై వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అప్పటికే నోసిన మాధవ(26), నోసిన జెస్సికా(16), కొల్లగుంటకు చెందిన కొండాబత్తిన యామిని(19) మృతిచెందారు. మాధవ భార్య నవ్యను మెరైన్ సిబ్బంది కాపాడారు.
ఈ ఘటనతో పాకల బీచ్‌లో విషాదం నెలకొంది. మృతి చెందిన వారి బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇదే బీచ్‌లో స్నానానికి దిగిన సింగరాయకొండకు చెందిన తమ్మిశెట్టి పవన్ కుమార్ (22) కూడా అలల తాకిడికి గల్లంతయ్యాడు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ప్రకాశం ఎస్పీ ఏఆర్ దామోదర్ ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన యువకుడి కోసం గాలించాలని సిబ్బందిని ఆదేశించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించారు.
మగవారు లేకుండానే ఒంటరిగా వెళ్లి…
సంక్రాంతి పండుగ అనంతరం తమ బంధువులు, స్నేహితులతో కలిసి రెండు బృందాలు సముద్ర స్నానానికి వచ్చారు. వీరిలో ఆరుగురు గల్లంత య్యారు. నలుగురు మృతి చెందారు. పొన్నలూరు మండలం బిమ్ముపాలెం గ్రామం శివన్నపాలేనికి చెందిన నోసిన మాధవ (24), అతని భార్య నవ్య (21), పిన్ని నోసిన సువర్ణరాజి చెల్లెలు నోసి జెస్సిక (13), మరదలు కందుకూరు మండలం కొళ్లకుంట గ్రామానికి చెందిన కొండాబత్తిన యామిని(14), మరో 10 మంది బంధువులతో కలిసి ఆటోలో పాకల బీచ్‌కు వచ్చారు.
బీచ్ వద్ద మగవారు మూత్ర విసర్జన కోసం వెళ్లిన సమయంలో మహిళలు ముందే సముద్రంలోకి దిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సముద్రంలోకి వారు దిగిన ప్రాంతంలో చిన్నపాటి గుంతలు ఉండటం, అది తెలియక ముందుకు వెళుతుండగా ఒక్కసారిగా వచ్చిన అలలు ఉద్భతంగా వచ్చి ముంచెత్తాయి. మాధవ, నవ్య, జెస్సిక, యామిని, సువర్ణరాణి నము ద్రంలో కొట్టుకుపోయారు .
సముద్రపు అలలపై తేలుతున్న నవ్య, సువర్ణరాణిలను గుర్తించిన స్థానిక మత్స్యకారులు రక్షించారు. కొద్దిసేపటి తర్వాత మాధవ, జెస్సిక, యామిని మృతదేహాలు అలలపై కనిపించాయి. పోలీసులు వాటిని బయటకు తీసుకొచ్చి కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇదే సమయంలో సింగరాయకొండ శ్రీరాంనగర్ ప్రాంతానికి చెందిన తమ్మిరెట్టి పవన్ (22) కూడా తన స్నేహితులతో కలిసి సముద్ర స్నేహితులతో కలిసి వచ్చిన యువకుడు స్నానం చేసేందుకు పాకల బీచ్‌కు వచ్చాడు. అలల ఉధృతితో సముద్రంలో కొట్టుకుపోయాడు. అతడి కోసం గాలింపు చేపట్టారు.