ఏపీలోని అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎస్ఎస్ ఫార్మా కంపెనీలో విష వాయువులు లీక్ అయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందినట్లు తెలిసింది. మరికొందరు అస్వస్థతకు గురైయ్యారు.మృతదేహాలను కేజీహెచ్ మార్చురీకి తరలించారు.
పరవాడ ఫార్మా ప్రమాద ఘటనపై కార్మిక,కర్మాగారాలు శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. జరిగిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులుతో ఫోన్లో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్నారు.