AP Police Exam: నేడే ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్.. నిమిషం దాటినా నో ఎంట్రీ -today ap police constable preliminary exam 2022 check details are here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Today Ap Police Constable Preliminary Exam 2022 Check Details Are Here

AP Police Exam: నేడే ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్.. నిమిషం దాటినా నో ఎంట్రీ

HT Telugu Desk HT Telugu
Jan 22, 2023 07:30 AM IST

AP Police Constable Exam 2023:ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఆదివారం(జనవరి 22) జరిగే పరీక్ష కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షకు నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది.

నేడు ప్రిలిమ్స్ ఎగ్జామ్
నేడు ప్రిలిమ్స్ ఎగ్జామ్

AP Police Constable Exam 2023 Updates: ఇవాళ ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఇందుకోసం సర్వం సిద్ధమైంది. నేటి పరీక్షకు సమయపాలనను కచ్చితంగా పాటించాలని పోలీసు నియామక మండలి నిర్ణయించింది. నిర్ణీత సమయానికి కంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ ఉద్యోగాలకు మొత్తం 5.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పరీక్ష నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 997 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో అభ్యర్థులు కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

-అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచి పరీక్షకేంద్రంలోకి అనుమతిస్తారు.

-ఉదయం 10 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకేంద్రంలోకి అనుమతించరు.

-మొబైల్‌ ఫోన్‌/సెల్యూలార్‌ ఫోన్, ట్యాబ్‌/ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, బ్లూటూత్‌ పరికరాలు/రికార్డింగ్‌ పరికరాలు, కాలిక్యులేటర్, లాగ్‌ టేబుళ్లు, వాలెట్, పర్సు, నోట్స్, చార్టులు, పేపర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరీక్షకేంద్రంలోకి అనుమతించరు.

-ఆయా వస్తువులను భద్రపరిచేందుకు పరీక్షకేంద్రం వద్ద ఎలాంటి ఏర్పాట్లు ఉండవు.

-అభ్యర్థులు ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, ఓటరు కార్డు, రేషన్‌ కార్డు వంటి ఏదైనా ఒక ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తీసుకురావాలి.

-హాల్‌టికెట్ తప్పనిసరి. బ్లూ/బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌ తీసుకురావాలి.

-అభ్యర్థులు ముందుగానే తమ పరీక్షకేంద్రాన్ని సందర్శించి నిర్ధారించుకోవాలి. తేడా వస్తే చివర్లో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

580 సివిల్‌ పోలీస్‌ కానిస్టేబుల్ పోస్టులతో పాటు 2520 ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల నియామకాల కోసం గత ఏడాది నవంబర్ 28న నోటీఫికేషన్ విడుదలైంది. మొత్తం 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఈ ఏడాది జనవరి 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్ని స్వీకరించారు. కానిస్బేబుల్‌ నియామకాల్లో భాగంగా ప్రాథమిక రాత పరీక్షను జనవరి 22వ తేదీన ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ భాషల్లో పరీక్షను రాసేందుకు అనుమతిస్తారు.

కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 3,64,184 మంది అభ్యర్థులు తెలుగులో పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. 1,39,075 మంది ఇంగ్లీష్‌లో పరీక్ష రాయనున్నారు. 227మంది అభ్యర్థులు ఉర్దూలో పరీక్షను రాసేందుకు ఎంచుకున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మొత్తం 5,03,486మంది కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సగటున ఒక్కో ఉద్యోగానికి ప్రాథమిక స్థాయిలో 82.5 మంది పోటీ పడుతున్నారు. పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో 3,95,415మంది పురుషులు, 1,08,071 మంది మహిళలు ఉన్నారు. రిజర్వేషన్ క్యాటగిరీల వారీగా దరఖాస్తు చేసిన వారిలో ఓసీ అభ్యర్థులు 53,778, బీసీ అభ్యర్థులు 2,74,567మంది , ఎస్సీ అభ్యర్థులు 1,31,875మంది, ఎస్టీలు 43,266మంది ఉన్నారు.

IPL_Entry_Point