LIVE UPDATES
Andhra Pradesh News Live September 5, 2024: Railway Updates : ప్రయాణికులకు అలర్ట్... ఏపీలో 44 రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు - వివరాలివే
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 05 Sep 202405:03 PM IST
Andhra Pradesh News Live: Railway Updates : ప్రయాణికులకు అలర్ట్... ఏపీలో 44 రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు - వివరాలివే
- ఏపీలో మరోసారి భారీగా రైళ్లు రద్దయ్యాయి. విజయవాడ మీదుగా నడిచే 44 రైళ్లను తాజాగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ 6, 7, 8, 9 తేదీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉండవని పేర్కొన్నారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు.
Thu, 05 Sep 202403:39 PM IST
Andhra Pradesh News Live: Tirumala : ఆ ఒక్కరోజు ఘాట్ రోడ్లలో బైక్‌లకు అనుమతి లేదు - టీటీడీ ప్రకటన
- శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 8న నిర్వహించబోయే గరుడ సేవ రోజు పలు ఆంక్షలను విధించింది. ఘాట్ రోడ్‌లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించింది.
Thu, 05 Sep 202401:20 PM IST
Andhra Pradesh News Live: West Godavari District : అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త..! ఆపై ఆత్మహత్యాయత్నం
- పశ్చిమగోదావరి జిల్లాలో ఘోరం జరిగింది. అనుమానంతో భార్యను భర్త హత్య చేశాడు. ఆపై అతను కూడా సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Thu, 05 Sep 202411:52 AM IST
Andhra Pradesh News Live: YCP Lella Appi Reddy : టీడీపీ ఆఫీసుపై దాడి కేసు - వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్
- టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో మంగళగిరి పోలీసులు దూకుడు పెంచారు. ఉదయం మాజీ ఎంపీ సురేశ్ ను అదుపులోకి తీసుకోగా... తాజాగా వైసీపీ ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్ చేశారు.
Thu, 05 Sep 202411:51 AM IST
Andhra Pradesh News Live: Vijayawada : చంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం.. భద్రతా సిబ్బంది అప్రమత్తమై..
- Vijayawada : ఏపీ సీఎం చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తూ రైల్వే ట్రాక్‌పై నిల్చున్నారు. ఒక్కసారిగా ట్రైన్ రావడంతో.. సెక్యూరిటీ అలెర్ట్ అయ్యి.. ట్రాక్ అవతలి పక్కకు తీసుకెళ్లారు. దీంతో ప్రమాదం తప్పింది.
Thu, 05 Sep 202410:54 AM IST
Andhra Pradesh News Live: Vijayawada Tragedy : ఎంత విషాదం.. నలుగురిని కాపాడి వరదల్లో కొట్టుకుపోయిన వ్యక్తి.. భార్య 8 నెలల గర్భవతి
- Vijayawada Tragedy : బెజవాడ నగరంలో బీభత్సం సృష్టించిన వరదలు.. ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా పలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తాజాగా ఓ విషాద ఘటన విజయవాడ వాసుల్ని కంట తడి పెట్టిస్తోంది.
Thu, 05 Sep 202410:07 AM IST
Andhra Pradesh News Live: Railway Information : గుడ్ న్యూస్.. పండుగ సీజన్‌లో 10 ప్రత్యేక రైళ్లు.. రెండు రైళ్లు పునరుద్ధరణ
- Railway Information : ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దసరా, దీపావళి, ఛత్ పండుగ సీజన్‌లో అదనపు రద్దీని తగ్గించడానికి.. సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి 10 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించింది. వాటి వివరాలు ఈ కథనంలో..
Thu, 05 Sep 202409:59 AM IST
Andhra Pradesh News Live: ANGRAU Recruitment 2024 : టీచింగ్ అసిస్టెంట్, టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ - కేవలం ఇంటర్వ్యూనే..!
- ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా టీచింగ్ అసిస్టెంట్, టీచింగ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 13వ తేదీన ఇంటర్వ్యూలకు హాజరుకావాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
Thu, 05 Sep 202409:30 AM IST
Andhra Pradesh News Live: Nandigam Suresh Arrest : నా భర్తకు ఏదన్నా అయితే చంద్రబాబుదే బాధ్యత: బేబిలత
- Nandigam Suresh Arrest : వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సురేష్‌ను హైదరాబాద్‌లో అరెస్టు చేసి ఏపీకి తరలించారు. సురేష్ అరెస్టుపై ఆయన భార్య బేబిలత స్పందించారు. తన భర్తకు ఏదయినా జరిగితే.. చంద్రబాబుదే బాధ్యతని వ్యాఖ్యానించారు.
Thu, 05 Sep 202408:38 AM IST
Andhra Pradesh News Live: MLA Koneti Adimulam : ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ సీరియస్ - పార్టీ నుంచి సస్పెండ్, ఆదేశాలు జారీ
- సత్యేవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆదేశాలను జారీ చేశారు.
Thu, 05 Sep 202408:31 AM IST
Andhra Pradesh News Live: AP MBBS Web Options: ఏపీలో ఎంబిబిఎస్ వెబ్ ఆప్షన్లు ప్రారంభం, 8వ తేదీ వరకు ఆప్షన్ల నమోదు గడువు
- AP MBBS Web Options: ఆంధ్రప్రదేశ్ ఎంబిబిఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో చేరాలనుకునే విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేయడానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 8వ తేదీ వరకు విద్యార్థులు తమ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.
Thu, 05 Sep 202408:25 AM IST
Andhra Pradesh News Live: Chittoor crime : చిత్తూరు జిల్లాలో ఘోరం.. ముగ్గురిని బలి తీసుకున్న వివాహేతర సంబంధం
- Chittoor crime : చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. వివాహేతర సంబంధం ముగ్గురిని బలి తీసుకుంది. కుమారుడి తీరుతో మనస్తాపం చెందిన తల్లి ఆత్మహత్య చేసుకోగా.. ఆ విషయం తెలిసి కుమారుడు, ప్రియురాలితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.
Thu, 05 Sep 202408:11 AM IST
Andhra Pradesh News Live: Mla Adimulam: సత్యవేడు ఎమ్మెల్యేపై టీడీపీ నాయకురాలి లైంగిక వేధింపుల ఆరోపణలు
- Mla Adimulam: తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనపై అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది. ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేసి మహిళల్ని ఎమ్మెల్యే నుంచి కాపాడాలని ఆరోపించింది.
Thu, 05 Sep 202407:51 AM IST
Andhra Pradesh News Live: Prakasam Barrage : రంగంలోకి కన్నయ్యనాయుడు.. ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు మరమ్మతులు
- Prakasam Barrage : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కృష్ణా నది ఉప్పొంగింది. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతంగా ప్రవహించింది. ఈ నేపథ్యంలో.. పడవలు బలంగా ఢీకొని బ్యారేజీ 6వ గేటు కౌంటర్ వెయిట్ పాడయ్యింది. తాజాగా దీనికి మరమ్మతులు చేస్తున్నారు.
Thu, 05 Sep 202406:56 AM IST
Andhra Pradesh News Live: TDP MLA Video : ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. లైంగిక కార్యకలాపాల వీడియోతో దొరికిపోయిన ఎమ్మెల్యే
- TDP MLA Video : ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి.. ఎమ్మెల్యేగా గెలిచిన కోనేటి ఆదిమూలం ఓ వీడియోతో దొరికిపోయాడు. తనను బెదిరించి లైంగికంగా వాడుకున్నారని బాధితురాలు ఆరోపించింది. చెల్లి, చెల్లి అంటూనే దారుణానికి తెగబడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. టీడీపీ చీఫ్ చంద్రబాబుకు లేఖ రాసింది.
Thu, 05 Sep 202406:55 AM IST
Andhra Pradesh News Live: Kolleru Flood: విజయవాడలో వరద తగ్గినా కొల్లేరు కోలుకోవడం కష్టమే,కొందరి స్వార్థానికి మూల్యం చెల్లిస్తున్న లక్షలాది ప్రజలు
- Kolleru Flood: గత ఐదు రోజులుగా వరద ముంపులో ఉన్న విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. నగరాన్ని ముంచెత్తిన వరద ప్రవాహం క్రమంగా శాంతిస్తోంది. అయితే బుడమేరు వరద నీరు వేగంగా కొల్లేరును ముంచెత్తబోతోంది. ఇప్పటికే గుడివాడ డివిజన్ పరిధిలో పంట పొలాలను బుడమేరు ప్రవాహం ముంచెత్తుతోంది.
Thu, 05 Sep 202406:13 AM IST
Andhra Pradesh News Live: Attack on Chandrababu House : అజ్ఞాతంలోకి జోగి రమేష్.. హైదరాబాద్‌లో గాలిస్తున్న ఏపీ పోలీసులు!
- Attack on Chandrababu House : ఏపీ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తాజాగా మాజీమంత్రి జోగి రమేష్ కోసం వెతుకున్నట్టు సమాచారం. ఆయనకు ఏపీ ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.
Thu, 05 Sep 202404:59 AM IST
Andhra Pradesh News Live: Flood Donations: వరద విరాళాలకు పన్ను రాయితీ, విజయవాడలో భారీగా ప్రాణ నష్టం, 40కు చేరిన మృతుల సంఖ్య
- Flood Donations: విజయవాడ నగరాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. ప్రాణనష్టం కూడా భారీగానే ఉంది. ప్రాథమిక అంచనాల ప్రకారం 40మంది చనిపోగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. మరోవైపు వరద సహాయక చర్యలకు విరాళాలు అందించే వారికి పన్ను రాయితీ లభిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.
Thu, 05 Sep 202404:41 AM IST
Andhra Pradesh News Live: Vijayawada Rains : మళ్లీ వర్షం.. విజయవాడ వాసుల్లో టెన్షన్.. బుడమేరకు వరద పెరిగే అవకాశం!
- Vijayawada Rains : భారీ వర్షాలతో తల్లడిల్లిపోయిన విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరద నీరు తగ్గి ప్రజలు బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వర్షాలు మళ్లీ స్టార్ట్ అయ్యాయి. అటు బుడమేరుకు వరదలు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Thu, 05 Sep 202403:32 AM IST
Andhra Pradesh News Live: Amit shah: ఏపీలో వరదల నష్టం అంచనాకు నిపుణుల బృందాన్ని పంపుతున్నట్టు ప్రకటించిన అమిత్ షా
- Amit shah: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్‌లో స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వరద పరిస్థితిని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందన్నారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు.
Thu, 05 Sep 202402:54 AM IST
Andhra Pradesh News Live: Flood Insurance: పదిరోజుల్లో వాహనాలకు బీమా చెల్లించేలా ఏపీ సర్కారు ప్రయత్నాలు, ఇన్సూరెన్స్ కంపెనీలతో చంద్రబాబు చర్చలు
- Flood Insurance: విజయవాడ నగరాన్ని ముంచెత్తిన బుడమేరు వరదలతో వేల సంఖ్యలో వాహనాలు నీట మునిగాయి. వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లడంతో బాధితుల్ని ఆదుకోడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ చూపారు. ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమై ప్రజల్ని త్వరగా ఆదుకోవాలని సూచించారు.
Thu, 05 Sep 202401:28 AM IST
Andhra Pradesh News Live: Nandigam Suresh: హైదరాబాద్‌లో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్.. మంగళగిరి తరలింపు
- Nandigam Suresh: బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు నందిగం సురేష్‌ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి ఘటనల్లో నమోదైన కేసుల్లో పలువురు వైసీపీ నాయకులు అరెస్ట్ ముప్పును ఎదుర్కొంటున్నారు. విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను కూడా అరెస్ట్ చేశారు.
Thu, 05 Sep 202412:25 AM IST
Andhra Pradesh News Live: AP Heavy Rains: వరదలతో విలవిల, మళ్లీ భారీ వర్షాలు.. ఆందోళనలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల ప్రజలు
- AP Heavy Rains: ఓ వైపు కృష్ణా వరదలు మరోవైపు బుడమేరు ఉగ్రరూపంతో విలవిలలాడుతున్న ప్రజలను భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి.బుధవారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో నగరం తడిచి ముద్దైంది.వరద గండ్లను పూడ్చడానికి శ్రమిస్తున్న అధికారులకు భారీ వర్షాలు ఆటంకంగా మారాయి. వర్షంలోనే పనులు జరుగుతున్నాయి.