LIVE UPDATES
Andhra Pradesh News Live September 4, 2024: AP School Holidays : రేపు కూడా ఈ జిల్లాలోని స్కూళ్లకు సెలవు - విద్యాశాఖ ప్రకటన
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 04 Sep 202402:33 PM IST
Andhra Pradesh News Live: AP School Holidays : రేపు కూడా ఈ జిల్లాలోని స్కూళ్లకు సెలవు - విద్యాశాఖ ప్రకటన
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు(గురువారం) కూడా ఎన్టీఆర్ జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. దీంతో వరుసగా ఐదో రోజు కూడా స్కూళ్లు మూతపడనున్నాయి.
Wed, 04 Sep 202401:06 PM IST
Andhra Pradesh News Live: AP Employees Donation : వరద బాధితులకు ఏపీ ఉద్యోగుల భారీ విరాళం - రూ. 120 కోట్లు ప్రకటన
- వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీ ఎన్జీవో జేఏసీ భారీ విరాళం ప్రకటించింది. సెప్టెంబర్ నెల జీతంలో ఒక రోజు బేసిక్ పే ద్వారా రూ.120 కోట్లు సీఎం సహాయనిధికి విరాళం ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సంఘ నేతలు… తమ అంగీకార పత్రాన్ని సీఎం చంద్రబాబుకు అందజేశారు.
Wed, 04 Sep 202412:50 PM IST
Andhra Pradesh News Live: Vijayawada Floods : బుడమేరులో మళ్లీ పెరుగుతున్న వరద..! ఆందోళనలో బెజవాడ వాసులు
- విజయవాడ నగరాన్ని మరోసారి బుడమేరు భయపెడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో బుడమేరులోకి వరద ఉధృతి కొసాగుతోంది. ఈ క్రమంలోనే మూడు చోట్ల గండి పడింది. ఇప్పటికే మొదటి గండిని పూడ్చగా… మరో 2 గండ్లు పూడ్చేలా పనులు జరుగుతున్నాయి. మంత్రి లోకేశ్ ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.
Wed, 04 Sep 202411:14 AM IST
Andhra Pradesh News Live: AP Pensions : పెన్షన్ బదిలీకి విడుదలైన ఆప్షన్ - అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు..!
- రాష్ట్రంలో పెన్షన్‌దారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు పెన్షన్‌ను వేరొక ప్రాంతానికి బదిలీ చేసుకునేందుకు అనుకూలంగా ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Wed, 04 Sep 202407:54 AM IST
Andhra Pradesh News Live: Budameru Victims: వరద బాధితుల్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు, సాయాన్ని ఇలా అందించ వచ్చు…
- Budameru Victims: వరదలతో సర్వం కోల్పోయిన ప్రజల్ని ఆదుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నాలుగు రోజులుగా వరదముంపులో చిక్కుకుని,సర్వం కోల్పోయిన వారికి సహాయ చర్యలు అందించేందుకు ప్రజలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.దాతలు విరాళాలను అందించేందుకు బ్యాంకు ఖాతాలను ప్రకటించారు.
Wed, 04 Sep 202407:18 AM IST
Andhra Pradesh News Live: CM Chandrababu: వరద మృతులకు రూ.5లక్షల పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు, ఊపందుకున్న సహాయ చర్యలు
- CM Chandrababu: బుడమేరు వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. వరద సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వరద తీవ్రత తగ్గడంతో సహాయ చర్యల్లో వేగం పెంచాలని, ఇంటింటికి వెళ్లి సాయం అందించాలన్నారు.
Wed, 04 Sep 202406:25 AM IST
Andhra Pradesh News Live: Ysrcp Bail Petitions: వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన ఏపీ హైకోర్టు.. రెండు వారాల ఊరట కోరిన నేతలు
- Ysrcp Bail Petitions: చంద్రబాబునివాసంపై దాడి ఘటనతో పాటు, టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడి ఘటనల్లో వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ నేతలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది.
Wed, 04 Sep 202404:59 AM IST
Andhra Pradesh News Live: IAS Over Action: వరద ప్రభావిత ప్రాంతంలో ఐఏఎస్ అధికారి అతి ప్రవర్తన, తిక్క కుదిర్చిన ఎస్సై..
- IAS Over Action: ఒంటి మీద బట్టలు నలగకుండా వరద సహాయ చర్యల్ని పర్యవేక్షిద్దామనుకున్న ఐఏఎస్ అధికారి అతి ప్రవర్తనకు..ఓ సాధారణ ఎస్సై రోగం కుదిర్చిన ఘటన బుధవారం ఉదయం విజయవాడలో జరిగింది. ఐఏఎస్ అధికార దర్పంతో పోలీసులపై రంకెలేసిన అధికారి చివరకు తోక ముడిచి కాలి నడకనే వెళ్లాల్సి వచ్చింది.
Wed, 04 Sep 202404:30 AM IST
Andhra Pradesh News Live: Visakha CRZ Violations: భీమిలీ సముద్ర తీరంలో విజయసాయి రెడ్డి కుమార్తె ఆక్రమణల తొలగింపు
- Visakha CRZ Violations: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె భీమిలి సముద్ర తీరంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను గ్రేటర్ విశాఖ మునిసిపల్ అధికారులు తొలగిస్తున్నారు. ఉదయాన్నే జేసీబీలతో అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు తొలగించారు.
Wed, 04 Sep 202403:57 AM IST
Andhra Pradesh News Live: విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు లారీలు ఢీకొని ముగ్గరు మృతి
- విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘోర రోడ్డు ప్రమాద ఘటన మంగళవారం విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం-పెందుర్తి రోడ్డులో ఆనందపురం బ్రిడ్జిపై జరిగింది.
Wed, 04 Sep 202401:39 AM IST
Andhra Pradesh News Live: RTGS And SDMA: వ్యవస్థలు విఫలమైన వేళ.. బెజవాడను విపత్తు ముంచెత్తింది.. ఆర్టీజీఎస్, ఎస్‌డిఎంఏల వైఫల్యం..
- RTGS And SDMA: దేశంలో మరెక్కడా లేని రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి పంజాను ప్రభుత్వం ఎందుకు పసిగట్టలేకపోయింది. ఆర్టీజిఎస్, ఎస్‌డిఎంఏలు భారీ వర్షాలు, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో తలెత్తే ముప్పు ఎందుకు పసిగట్టలేకపోయాయి అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Wed, 04 Sep 202412:47 AM IST
Andhra Pradesh News Live: Budameru Modernization:బుడమేరు ఆధునీకీకరణకు అడ్డు పడిందెవరు..నిర్లక్ష్యం చేసిందెవరు?
- Budameru Modernization: విజయవాడ నగరంపై బుడమేరు విరచుకుపడిన వేళ వరద రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. బుడమేరును నిర్లక్ష్యానికి కారణం మీరంటే మీరని నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.బుడమేరు విరుచుకుపడటానికి అసలు కారణం మాత్రం ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణం.