Andhra Pradesh News Live September 3, 2024: Dy CM Pawan Kalyan : వరద బాధితులకు రూ.కోటి విరాళం, పరామర్శకు అందుకే రాలేదు- పవన్ కల్యాణ్-today andhra pradesh news latest updates september 3 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live September 3, 2024: Dy Cm Pawan Kalyan : వరద బాధితులకు రూ.కోటి విరాళం, పరామర్శకు అందుకే రాలేదు- పవన్ కల్యాణ్

Dy CM Pawan Kalyan : వరద బాధితులకు రూ.కోటి విరాళం, పరామర్శకు అందుకే రాలేదు- పవన్ కల్యాణ్(N Chandrababu Naidu x)

Andhra Pradesh News Live September 3, 2024: Dy CM Pawan Kalyan : వరద బాధితులకు రూ.కోటి విరాళం, పరామర్శకు అందుకే రాలేదు- పవన్ కల్యాణ్

04:38 PM ISTSep 03, 2024 10:08 PM HT Telugu Desk
  • Share on Facebook
04:38 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 03 Sep 202404:38 PM IST

Andhra Pradesh News Live: Dy CM Pawan Kalyan : వరద బాధితులకు రూ.కోటి విరాళం, పరామర్శకు అందుకే రాలేదు- పవన్ కల్యాణ్

  • Dy CM Pawan Kalyan : గత ప్రభుత్వం ప్రాజెక్టులను గాలికి వదిలేసింది, అందుకే వరద పరిస్థితులు నెలకొన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తే వరద సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే రాలేదన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202401:52 PM IST

Andhra Pradesh News Live: AP Schools Holiday : భారీ వర్షాల ఎఫెక్ట్, రేపు ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు

  • AP Schools Holiday : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రేపు ఎన్టీఆర్ జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో విద్యాశాఖాధికారి ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠాశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202401:40 PM IST

Andhra Pradesh News Live: AP TG Rains : తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

  • AP TG Rains : తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. కోస్తా మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. అల్పపీడనం, ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202411:39 AM IST

Andhra Pradesh News Live: Tiruchanur Pavitrotsavam : సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు, పలు సేవలు రద్దు

  • Tiruchanur Pavitrotsavam : తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు మూడ్రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మూడ్రోజులు కల్యాణోత్సవరం, బ్రేక్ దర్శనాలు, ఊంజల్ సేవ రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202410:46 AM IST

Andhra Pradesh News Live: Floods : వరదల సమయంలో, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • Floods : తెలుగు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఇళ్లు నీట మునిగి ప్రజల పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. మరికొందరు ఇళ్లపై చేరి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వరద సమయంలో, ఆ తర్వాత పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202409:27 AM IST

Andhra Pradesh News Live: AP Police : వరదలపై వదంతులు.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు ఏపీ సర్కార్ సీరియస్ వార్నింగ్!

  • AP Police : ఓవైపు వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. కొందరు ఫేక్ న్యూస్ ప్రచారం చేసే పనిలో పడ్డారు. ఈ కారణంగా ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గ్రూపుల అడ్మిన్‌లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202409:25 AM IST

Andhra Pradesh News Live: CM Chandrababu : చిట్టచివరి వ్యక్తి వరకూ ఆహారం అందాలి, అధికారుల నిర్లక్ష్యం సహించేది లేదు -సీఎం చంద్రబాబు

  • CM Chandrababu : విజయవాడ వరద సహాయ చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సీఎం చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహారం అందడంలేదని ఫిర్యాదు వస్తున్నాయన్నారు. చిట్టచివరి వ్యక్తి వరకూ ఆహారం అందాలని ఆదేశించారు. ఇటీవల కొన్ని సంఘటనలు అనుమానాస్పదంగా ఉన్నాయని చంద్రబాబు అన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202408:41 AM IST

Andhra Pradesh News Live: AP Rains : శభాష్ సబ్ కలెక్టర్.. అధికారి అంటే భవానీ శంకర్‌లా ఉండాలి!

  • AP Rains : ఏపీలోని పలు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. ముఖ్యంగా విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు జలమయం అయ్యాయి. నూజివీడు ఏరియాలో భారీ వర్షం కురవగా.. వరదలు పోటెత్తాయి. నూజివీడు సబ్ కలెక్టర్ భవానీ శంకర్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి మందిని కాపాడారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202408:41 AM IST

Andhra Pradesh News Live: Trains Cancelled : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, మరో 28 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

  • Trains Cancelled : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు పలు చోట్ల రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. రైల్వే అధికారులు ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. దీంతో ఏపీ, తెలంగాణ మీదుగా నడిచే మరో 28 రైళ్లను తాజాగా రద్దు చేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202407:55 AM IST

Andhra Pradesh News Live: AP Floods : భారీ వర్షాలు.. వరదలతో 19 మంది మృతి.. 73 చెరువులకు గండి

  • AP Floods : భారీ వ‌ర‌ద‌లు, వ‌ర్షాల‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన‌లేని న‌ష్టాన్ని చ‌విచూసింది. ఇందులో ప్రాణ‌, ఆర్థిక న‌ష్టాలు భారీ స్థాయిలో ఉన్నాయి. 19 మంది మృతి చెందారు. ఇద్ద‌రు గ‌ల్లంత‌య్యారు. వారి ఆచూకీ తెలియ‌లేదు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202407:03 AM IST

Andhra Pradesh News Live: Vijayawada Floods : సందెట్లో సడేమియా.. విజయవాడ వ్యాపారులు, ప్రైవేటు బోట్ నిర్వాహకుల చేతివాటం

  • Vijayawada Floods : ఓవైపు భారీ వరదలు విజయవాడ నగరాన్ని ముంచెత్తుతున్నాయి. మరోవైపు వరద బాధితులు ఆహారం కోసం అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వ్యాపారులు, ప్రైవేట్ బోట్ నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం పంపిన ఆహార పధార్థాలను సేకరించి అమ్ముతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202405:47 AM IST

Andhra Pradesh News Live: Krishna River Floods : విజయవాడ వాసులకు బిగ్ రిలీఫ్.. నెమ్మదిగా శాంతిస్తున్న కృష్ణమ్మ

  • Krishna River Floods : విజయవాడ నగరం వరదలతో వణికిపోతోంది. ఈ సమయంలో కాస్త రిలీఫ్ ఇచ్చే విషయం చెప్పారు అధికారులు. విజయవాడ పరిసరాల్లో కృష్ణా నది వరదలు క్రమంగా తగ్గుతున్నాయని చెప్పారు. సాయంత్రం వరకు ఇంకా తగ్గే అవకాశం ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202405:30 AM IST

Andhra Pradesh News Live: వ‌ర‌ద‌ల ఎఫెక్ట్‌...ఉపాధ్యాయ దినోత్సవం వాయిదా… అవార్డుల ప్రదానోత్సవం కూడా

  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో విజ‌య‌వాడ‌, గుంటూరుతో స‌హా ప‌లు ప్రాంతాలు స‌త‌మ‌త‌వుతున్నాయి. కొన్ని ప్రాంతాల‌కు రాక‌పోక‌లు కూడా నిలిచిపోయాయి. ఈ నేప‌థ్యంలో సెప్టెంబ‌ర్ 5న జ‌ర‌గాల్సిన ఉపాధ్యాయ దినోత్స‌వాన్ని వాయిదా వేస్తున్న‌ట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202404:54 AM IST

Andhra Pradesh News Live: ఐదో త‌ర‌గ‌తి విద్యార్థినిపై ప్రిన్సిప‌ల్ భ‌ర్త లైంగిక దాడి.. ప్రిన్సిపాల్ వీడియోలు తీసేవారని ఆరోపించిన విద్యార్థినులు

  • Sexual abuse on minor girl: అన్న‌మ‌య్య జిల్లాలో ఘోర సంఘట‌న చోటు చేసుకుంది. ఐదో త‌ర‌గ‌తి విద్యార్థినిపై ప్రిన్సిప‌ల్ భ‌ర్త లైగింక దాడికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ప్రిన్సిప‌ల్‌, ఆమె భ‌ర్త‌పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో కేసులు న‌మోదు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202404:31 AM IST

Andhra Pradesh News Live: ఏపీలో 19 మంది మృతి, 73 చెరువుల‌కు గండి.. 1,808 కిలో మీట‌ర్ల‌ రోడ్లు ధ్వ‌ంసం

  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు, వరదలు ఎన‌లేని న‌ష్టాన్ని మిగిల్చాయి. ఇప్పటివరకు 19 మంది మృతి చెందారు. ఇద్ద‌రు గ‌ల్లంత‌య్యారు. మరోవైపు 73 చెరువులు గండిపడ్డాయి. 1,808 కి.మీ. మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. భారీగా పంటనష్టం వాటిల్లింది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202403:55 AM IST

Andhra Pradesh News Live: Vijayawada floods : వరద ముంపులో చిక్కుకున్న వారికోసం హెలికాప్టర్లు.. ఆహారం కోసం అల్లాడుతున్న ప్రజలు

  • Vijayawada floods : విజయవాడ సింగ్ నగర్‌లో వరద బాధితులు కష్టాలు పడుతున్నారు. తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి నిత్యావసరాలు, మంచి నీరు తీసుకువెళ్లేందుకు తిప్పలు పడుతున్నారు. నాలుగు అడుగుల లోతు నీటిలో ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202402:17 AM IST

Andhra Pradesh News Live: విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఐఏఎఫ్ సహాయక చర్యలు

  • విజయవాడ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సోమవారం సహాయక చర్యలు చేపట్టింది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Sep 202402:10 AM IST

Andhra Pradesh News Live: Andhra Pradesh rains : 'నా కెరీర్​లో ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్'- సీఎం చంద్రబాబు

  • Andhra Pradesh rains live updates : ఆంధ్రప్రదేశ్​ వరద ముప్పు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు.. తన కెరీర్​లో ఇదే అతిపెద్ద విపత్తు అని పేర్కొన్నారు. తాజా పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరనున్నట్టు తెలిపారు.

పూర్తి స్టోరీ చదవండి