Andhra Pradesh News Live September 22, 2024: CM Chandrababu On Laddu Row : తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సిట్ విచారణ, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 22 Sep 202404:50 PM IST
- CM Chandrababu On Laddu Row : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐజీ, ఆపైస్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నివేదికను బట్టి, బాధ్యులని కఠినంగా శిక్షిస్తామన్నారు. వైసీపీ టీటీడీ బోర్డుని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని విమర్శించారు
Sun, 22 Sep 202401:07 PM IST
- TDP Mla Damacharla On Balineni : ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. బాలినేని ఏ పార్టీలోకి వెళ్లినా కేసుల్లో నుంచి తప్పించుకోలేరన్నారు. బాలినేనిని పవన్ కల్యాణ్ కూడా కాపాడలేరన్నారు. బాలినేని గత ఐదేళ్లలో చేసిన అక్రమాలు బయటకు తీస్తామన్నారు.
Sun, 22 Sep 202411:47 AM IST
Tirumala Laddu Row : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. లడ్డూ తయారీ ఉపయోగించిన నెయ్యి కల్తీ అయ్యిందని ఆరోపణలు వస్తున్నాయి. టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న ఏఆర్ డెయిరీ సంస్థ ఉద్యోగి ఈ ఆరోపణలను ఖండించింది. నెయ్యి కంటే ఫిష్ ఆయిల్ చాలా ఖరీదని, కల్తీ జరిగితే వాసనతో గుర్తించవచ్చన్నారు.
Sun, 22 Sep 202411:24 AM IST
- Polavaram : అది దట్టమైన అడవి. ఆ ఆడవిలో గలగల పారే సెలయేర్లు. ఆ సెలయేర్ల మధ్యలో మహిమ గల అమ్మవారు.. ఆ అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తారు భక్తులు. అవును ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో ఉన్న గుబ్బల మంగమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు.
Sun, 22 Sep 202411:22 AM IST
- Undi Mla RRR Issue : ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు మరో వివాదంలో చిక్కుకున్నారు. తన నియోజకవర్గంలోని ఏలూరుపాడులో ఆలయం వద్ద కట్టిన అంబేడ్కర్ ఫ్లెక్సీని ఎమ్మెల్యే రఘురామ చించివేశారు. దీంతో అంబేడ్కర్ ను అవమానించారని దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Sun, 22 Sep 202411:06 AM IST
- AP Heavy Rains : రేపు పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ఆదివారం సాయంత్రం నుంచి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొంది. రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
Sun, 22 Sep 202410:29 AM IST
- YS Jagan Letter To PM Modi : తిరుమల లడ్డూ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ...ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. లడ్డూ వ్యవహారాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. ఏదైనా పొరపాటు జరిగితే విచారణ చేయించి వాస్తవాలను బయటపెట్టాలన్నారు.
Sun, 22 Sep 202409:16 AM IST
- Konaseema Crime : కోనసీమ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొడుకు గల్ఫ్ లో ఉపాధి వెళ్లగా...కోడలిపై కన్నేసిన మామ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. మామ లైంగిక వేధింపులు తట్టుకోలేక కోడలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sun, 22 Sep 202408:50 AM IST
- Happy Daughters Day 2024 : ఆడపిల్ల అంటే మహాలక్ష్మి అని భావిస్తారు. డాటర్స్ డే సందర్భంగా తల్లిదండ్రులు ఇలాంటి పెట్టుబడి గిఫ్ట్ లను అందిస్తే వారికి జీవితాంతం ఆర్థిక స్వతంత్ర్యం లభిస్తుంది. ఆడపిల్లలకు ఎంతగానో ఉపయోగపడే ఆరు పెట్టుబడి స్కీమ్స్ గురించి తెలుసుకుందాం.
Sun, 22 Sep 202407:19 AM IST
- Tadepalle : ఏపీలో తిరుమల లడ్డూ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఇష్యూపై ఇప్పటికే టీడీపీ, వైసీపీ మధ్య పొలిటికల్ వార్ జరుగుతుండగా.. తాజాగా హిందు సంఘాలు ఎంటర్ అయ్యాయి. మాజీ సీఎం జగన్ ఇంటి దగ్గర కొందరు హిందువులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Sun, 22 Sep 202406:02 AM IST
- తిరుమల లడ్డూ లో జంతువు కొవ్వు కలపడం అనేది నీచమైన చర్యని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతి హిందువు, ధర్మాన్ని పాటించే ప్రతీ వ్యక్తి ఖండించి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సందర్భంగా మాట్లాడిన ఆయన… హిందూ మతానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Sun, 22 Sep 202404:41 AM IST
- Simhachalam Ghee : తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల ప్రసాదాల తయారీపై సర్కారు దృష్టి సారించింది. సింహాచలం ఆలయంలో నెయ్యిని తనిఖీ చేసిన అధికారులు, నాణ్యతలో దారుణంగా తేడా ఉండటం గమనించి సీజ్ చేశారు.
Sun, 22 Sep 202403:25 AM IST
- శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం పరిధిలో విషాదం చోటు చేసుకుంది. కందిరీగలు చేసిన దాడిలో ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికంగా విషాదఛాయాలు అలుముకున్నాయి.
Sun, 22 Sep 202403:11 AM IST
- కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఓ వైద్యుడిపై దురుసుగా ప్రవర్తించటమే కాకుండా… బూతులతో రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటనను ఏపి ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
Sun, 22 Sep 202401:54 AM IST
- అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుక్కరాయ సముద్రం రేకులకుంట సమీపంలో కారును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.