LIVE UPDATES
Andhra Pradesh News Live September 19, 2024: Tirupati Laddu Controversy : తిరుమల లడ్డూ వివాదం - తెరపైకి ల్యాబ్ రిపోర్ట్..! నిర్ధారణ జరిగిందన్న సీఎం చంద్రబాబు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 19 Sep 202404:48 PM IST
Andhra Pradesh News Live: Tirupati Laddu Controversy : తిరుమల లడ్డూ వివాదం - తెరపైకి ల్యాబ్ రిపోర్ట్..! నిర్ధారణ జరిగిందన్న సీఎం చంద్రబాబు
- తిరుమల శ్రీవారి లడ్డూపై వివాదం నెలకొంది. లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వులు ఉన్నట్లు సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఇది మరింత ముదిరింది. తాజాగా ఓ ల్యాబ్ రిపోర్ట్ ను చూపిస్తూ టీటీడీ నేతలు పలు విషయాలను ప్రస్తావిస్తున్నారు.
Thu, 19 Sep 202402:59 PM IST
Andhra Pradesh News Live: Balineni : ‘జనసేనలో చేరుతాను.. అటువైపు నుంచి రాంగ్ గా మాట్లాడితే అన్ని బయటపెడతా’ - బాలినేని కీలక వ్యాఖ్యలు
- వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన అధినేత పవన్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన… మంచిరోజు చూసుకొని జనసేనలో చేరుతానని ప్రకటించారు. వైసీపీ నేతలు తనపై రాంగ్ గా మాట్లాడితే అన్ని విషయాలను బయటపెడతానని కామెంట్స్ చేశారు.
Thu, 19 Sep 202401:53 PM IST
Andhra Pradesh News Live: TTD Jobs 2024 : టీటీడీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ - అక్టోబర్ 1న ఇంటర్వ్యూలు
- టీటీడీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఎనిమిది ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అక్టోబర్ 1న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ ఉద్యోగులకు హిందూ మతం వారు మాత్రమే అర్హులని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
Thu, 19 Sep 202401:23 PM IST
Andhra Pradesh News Live: AP Dasara Holidays 2024 : ఏపీలో ఈసారి 10 రోజులపాటు దసరా సెలవులు - ఎప్పట్నుంచంటే..!
- ఏపీలో దసరా సెలవులు రాబోతున్నాయి. అక్టోబర్ 4వ తేదీ నుంచి విద్యాసంస్థలకు హాలీ డేస్ ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 13వ తేదీవ తేదీతో ఈ సెలవులు ముగుస్తాయి. అంటే ఈసారి మొత్తం 10 రోజులు సెలవులు రానున్నాయి. ఇక తెలంగాణలో చూస్తే 13 రోజులు సెలవులు ప్రకటించారు.
Thu, 19 Sep 202412:39 PM IST
Andhra Pradesh News Live: AP Rain Alert : ఏపీలోని 17 జిల్లాలకు వర్షసూచన.. ఈ ప్రాంతాలు ప్రజలు అలర్ట్‌గా ఉండాలి!
- AP Rain Alert : ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. శుక్రవారం 17 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Thu, 19 Sep 202411:58 AM IST
Andhra Pradesh News Live: AP Job Notification : ఏపీ గురుకులాల్లో ఐఐటీ, నీట్ కోచింగ్ కోసం అధ్యాపకుల భర్తీకి నోటిఫికేషన్
- AP Job Notification : ఏపీ గురుకులాల్లో ఐఐటీ, నీట్ కోచింగ్ కోసం అధ్యాపకుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు దాఖలకు సెప్టెంబర్ 20వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ 24న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Thu, 19 Sep 202411:42 AM IST
Andhra Pradesh News Live: Samineni Udayabhanu : పవన్‌తో అరగంట పాటు చర్చ.. 22న జనసేనలో చేరనున్న సామినేని
- Samineni Udayabhanu : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. వైసీపీని వీడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏళ్ల తరబడి జగన్ వెంట నడిచిన నేతలు కూడా వైసీపీకి గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా.. జగన్ నమ్మిన బంట్లు బాలినేని, సామినేని పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ ఇద్దరు జనసేన చేరడానికి రెడీ అయ్యారు.
Thu, 19 Sep 202411:08 AM IST
Andhra Pradesh News Live: Tirumala : వెంకటేశ్వర స్వామి పాదాలచెంత ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా: వైవీ సుబ్బారెడ్డి
- Tirumala : ఏపీలో నిత్యం ఏదో ఒక అంశంపై రాజకీయ దుమారం చేలరేగుతోంది. మొన్నటి దాకా బుడమేరు వరదలపై పరస్పరం విమర్శలు చేసుకున్న టీడీపీ, వైసీపీ.. ఇప్పుడు తిరుమల లడ్డూ వివాదంపై పడ్డాయి. చంద్రబాబు తిరుమల లడ్డూ గురించి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతున్నారు.
Thu, 19 Sep 202410:12 AM IST
Andhra Pradesh News Live: Trains Information : 17 రూట్లలో రైళ్ల దారి మళ్లింపు, మరో 3 రైళ్లు రీషెడ్యూల్
- ప్రయాణికులకు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా 17 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. మరో 3 రైళ్లను రీ షెడ్యూల్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయా రైళ్ల వివరాలను వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ వివరించారు.
Thu, 19 Sep 202409:00 AM IST
Andhra Pradesh News Live: YV Subbareddy: నెయ్యి కల్తీ ఆరోపణలపై సీఎం ప్రమాణం చేయకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నఎంపీ సుబ్బారెడ్డి
- YV Subbareddy: జంతువుల కొవ్వు వినియోగం ఆరోపణలపై వైసీపీ న్యాయపోరాటానికి సిద్ధమైంది. వైసీపీ అధికారంలో ఉండగా టీటీడీ లడ్డూ ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారనే ఆరోపణలపై ప్రమాణం చేసి సాక్ష్యాలతో నిరూపించాలని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.
Thu, 19 Sep 202408:23 AM IST
Andhra Pradesh News Live: AP TET 2024 Updates : ఏపీ టెట్ అభ్యర్థులకు మరో అలర్ట్ - వెబ్ సైట్ లో 'మాక్ టెస్ట్' ఆప్షన్ వచ్చేసింది, ఇలా రాసుకోండి
- AP TET Exams 2024 Updates : ఏపీ టెట్ - 2024కు దరఖాస్తు చేశారా..? అయితే మీరు ఉచితంగా మాక్ టెస్ట్ లు రాసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ అవకాశాన్ని కల్పించింది. ఈ పరీక్షలను ఉచితంగా ఎలా రాయాలో ఈ కథనంలో చూడండి…
Thu, 19 Sep 202407:50 AM IST
Andhra Pradesh News Live: Samineni Udayabhanu Out: వైసీపీలో మరో వికెట్ ఔట్, జనసేనలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను
- Samineni Udayabhanu Out: వైఎస్సార్సీపీ నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సామినేని ఉదయభాను వైసీపీని వీడనున్నారు. జనసేనలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. బాలినేని బాటలోనే సామినేని కూడా జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.
Thu, 19 Sep 202406:36 AM IST
Andhra Pradesh News Live: AP ECET BPharacy Admissions: ఏపీ ఈసెట్ 2024 బీఫార్మసీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల
- AP ECET BPharacy Admissions: ఏపీ ఈసెట్ అడ్మిషన్లలో భాగంగా బీఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా మండలి ఆధ్వర్యంలో బీఫార్మసీ ప్రవేశాలను చేపడతారు. 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.
Thu, 19 Sep 202404:47 AM IST
Andhra Pradesh News Live: AP EdCET Final Admissions: ఏపీ ఎడ్‌సెట్ 2024 తుది విడత అడ్మిషన్లకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్
- AP EdCET Final Admissions: ఏపీ ఎడ్ సెట్ 2024 తుది విడత అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఎడ్ సెట్ 2024 అడ్మిషన్లు పూర్తయ్యాయి. రెండో విడత అడ్మిషన్ల కోసం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి సెప్టెంబర్ 21 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
Thu, 19 Sep 202404:10 AM IST
Andhra Pradesh News Live: Balinene Issue: బాలినేని బాధేమిటి? అలకలు, బెదిరింపులు, కర్ర పెత్తనం మరో పార్టీలో సాధ్యమేనా?
- Balinene Issue: బాలినేని శ్రీనివాసరెడ్డి… తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు, వైఎస్సార్ బంధువు, మంత్రిగా.. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు వైసీపీకి రాజీనామా చేశారు. బాలినేని వ్యవహారం వైసీపీలో కలకలం రేపినా, పార్టీ మారితే పూర్వ వైభవం సాధ్యమేనా అనే సందేహాలు ఉన్నాయి.
Thu, 19 Sep 202403:59 AM IST
Andhra Pradesh News Live: Visakhapatnam : విశాఖలో విషాదం.. బస్సు కింద పడి నర్సరీ విద్యార్థి మృతి
- Visakhapatnam : విశాఖపట్నం జిల్లాలో విషాదం జరిగింది. రోజూ బడికెళ్లే బస్సే అభం శుభం తెలియని బాలుడి ప్రాణం తీసింది. స్కూల్ బస్సు కింద పడి నర్సరీ చదువుతున్న ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు.
Thu, 19 Sep 202403:26 AM IST
Andhra Pradesh News Live: Online Fraud: నంద్యాల జిల్లాలో విషాదం, ఆన్‌లైన్ మోసానికి ప్రభుత్వఉపాధ్యాయుడి బలి, సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య
- Online Fraud: నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆన్‌లైన్ మోసానికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలి అయ్యాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మి మోసపోయారు. సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Thu, 19 Sep 202402:36 AM IST
Andhra Pradesh News Live: TTD Laddu Prasadam: శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారన్న చంద్రబాబు, నిరూపించాలన్న వైవీ సుబ్బారెడ్డి
- TTD Laddu Prasadam: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీపై ముఖ్యమంత్రి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ వంద రోజుల పాలనపై నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు టీటీడీలో జరిగిన వ్యవహారాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారని మండిపడ్డారు.
Thu, 19 Sep 202412:12 AM IST
Andhra Pradesh News Live: GO 85 Reversion: జీవో 85 సవరణకు ప్రభుత్వం అంగీకారం, ప్రభుత్వ సర్వీస్ వైద్యులతో చర్చలు సఫలం
- GO 85 Reversion: ఇన్ సర్వీస్ రిజర్వేషన్లను కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 85పై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వైద్యుల ఆందోళనతో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పీహెచ్సీ డాక్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు అవసరం మేరకు జీఓ 85 సవరణకు అంగీకరించింది.