Andhra Pradesh News Live October 27, 2024: Nellore Crime : నెల్లూరు జిల్లాలో ఘోరం, అశ్లీల చిత్రాలు తీసి వేధించిన యువకుడు- బాలిక ఆత్మహత్యాయత్నం!
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 27 Oct 202403:52 PM IST
Nellore Crime : నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో పదో తరగతి బాలిక వెంటపడి లోబర్చుకున్నాడో యువకుడు. ఆపై బాలిక అశ్లీల చిత్రాలు తీసి వేధించడం మొదలుపెట్టాడు. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది.
Sun, 27 Oct 202403:29 PM IST
AP IAS Postings : డీవోపీటీ ఆదేశాలతో తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన ఐఏఎస్ అధికారులకు సీఎస్ నీరభ్ కుమార్ పోస్టింగ్ లు కేటాయించారు. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వీసీఎండీగా ఆమ్రపాలిని నియమించారు. ఆమెకు ఏపీ టూరిజం అథారిటీ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
Sun, 27 Oct 202412:57 PM IST
APSRTC Special Buses : కార్తీక మాసం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ రాజమండ్రి నంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ప్రసిద్ధ శైవక్షేత్రాలైన పంచారామాలకు ప్రత్యేక సర్వీసులు, ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకుకొచ్చింది. శబరిమలకు కూడా ప్రత్యేక సర్వీసులు, ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చింది.
Sun, 27 Oct 202412:32 PM IST
RRB NTPC Recruitment 2024 : ఆర్ఆర్బీ ఎన్టీపీసీ-2024 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల రిజిస్ట్రేషన్ అక్టోబర్ 27తో ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు ఆర్ఆర్బీ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకుని, అక్టోబర్ 28, 29 తేదీల్లో ఆన్ లైన్ లో ఫీజు చెల్లించవచ్చు. 11,558 పోస్టులను ఈ నోటిఫికేషన్ లో భర్తీ చేయనున్నారు.
Sun, 27 Oct 202411:25 AM IST
YS Sharmila Counter To Vijayasai Reddy : వైఎస్ఆర్ ఆస్తుల విషయంలో వైఎస్ జగన్, షర్మిల మధ్య వివాదం కొనసాగుతోంది. వైఎస్ జగన్ తరఫున వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. ఇక వైసీపీ నేతలకు షర్మిల దీటుగా సమాధానం ఇస్తున్నారు. తాజాగా విజయసాయి రెడ్డికి షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Sun, 27 Oct 202411:02 AM IST
Vizianagaram Road Accident : విజయనగరంలో హృదయవిదారక సంఘటన జరిగింది. తల్లి కళ్ల ముందే ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సాయం చేయాలని ఎంతగా ప్రాధేయపడిన ఒక్కరూ సాయంచేసేందుకు ముందుకు రాలేదు.
Sun, 27 Oct 202411:02 AM IST
- Tiurmala : టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 31వ తేదీన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనుంది. ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. 30వ తేదీన సిఫార్సు లేఖలు స్వీకరణ రద్దు చేసినట్టు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
Sun, 27 Oct 202409:45 AM IST
- Vizianagaram : విజయనగరం జిల్లాలో చీటీల పేరుతో భార్యాభర్తల భారీ మోసానికి పాల్పడ్డారు. ఏకంగా రూ.4 కోట్లకు బురిడీ కొట్టారు. ప్రజలను మోసం చేసిన భార్యాభర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు.
Sun, 27 Oct 202409:26 AM IST
AP TET Final Key 2024 : మరికాసేపట్లో ఏపీ టెట్ ఫైనల్ కీ విడుదల కానుంది. అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకు అభ్యర్థులు టెట్ పరీక్షలు రాశారు. ఈ పరీక్షల ప్రాథమిక 'కీ' లు, రెస్పాన్స్ షీట్లను విద్యాశాఖ విడుదల చేసింది. టెట్ తుది కీని అధికారిక వెబ్ సైట్ https://aptet.apcfss.in/ లో చెక్ చేసుకోవచ్చు.
Sun, 27 Oct 202408:43 AM IST
- Eluru : ఏలూరు జిల్లాలో ఆయన పరిచయం అక్కర్లేని నేత. 2019 నుంచి 2024 వరకు ఓ వెలుగు వెలిగారు. కానీ 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ వెంటనే వైసీపీకి రాంరాం చెప్పారు. ఇప్పుడు టీడీపీలో చేరడానికి ట్రై చేస్తున్నారు. అయితే టీడీపీ హౌస్ ఫుల్ బోర్డు పెట్టేసింది. ఆయన్ను చేర్చుకోవద్దని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.
Sun, 27 Oct 202408:39 AM IST
APSRTC Recruitment : ఏపీఎస్ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఆర్టీసీలోని 18 కేటగిరీల్లో 7545 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. త్వరలో ఆర్టీసీ పోస్టుల భర్తీపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రానుంది.
Sun, 27 Oct 202406:15 AM IST
- వైఎస్ ఫ్యామిలీ ఆస్తుల వివాదంపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు కన్నీళ్లకు విలువలేదని.. ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. జగన్ ప్రత్యర్థుల కుట్రలో షర్మిల పావుగా మాట్లాడారని ఆరోపించారు. దొంగ సంతకాలతో షేర్లు ట్రాన్స్ ఫర్ చేసుకున్నారని విమర్శించారు.
Sun, 27 Oct 202406:00 AM IST
- AP APAAR Cards : నూతన విద్యా విధానంలో భాగంగా.. ప్రతీ విద్యార్థికి జీవితకాల గుర్తింపు సంఖ్యతో కార్డు జారీ చేయాలని కేంద్రం ఆదేశించింది. విద్యార్థుల అకడమిక్ పురోగతిని ట్రాక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని భావించింది. కానీ.. వివిధ కారణాలతో ఆపార్ కార్డుల జారీకి అడ్డంకులు ఏర్పడుతున్నాయి.
Sun, 27 Oct 202405:09 AM IST
- AP Free Gas Cylinder : ఏపీ ప్రభుత్వం దీపం పథకం కింద మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అక్టోబర్ 31న ప్రారంభించనున్నారు. అయితే.. దీనికి సంబంధించి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. రాయితీ ఎలా, ఎప్పుడు ఇస్తారని లబ్ధిదారులు చర్చించుకుంటున్నారు.
Sun, 27 Oct 202404:22 AM IST
- Ayyappa devotees : విమానయాన శాఖ అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇరుముడి విషయంలో ఏ ఇబ్బంది లేకుండా విమానాల్లో ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది. జనవరి 20 వరకు నిబంధనలను సడలించింది. భద్రతా సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఇటు కడప నుంచి హైదరాబాద్‌కు సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
Sun, 27 Oct 202401:25 AM IST
- నెల్లూరు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఓ యువతిపై ఒకే ఇంట్లో నలుగురు ఒకరికి తెలియకుండా ఒకరు అత్యాచారం చేశారు. తీరా విషయం బయటికి రావటంతో బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు… నలుగురిని అరెస్ట్ చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.