Andhra Pradesh News Live October 26, 2024: Ministers Committee : ధరల నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్లపై మంత్రుల కమిటీ అధ్యయనం, ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-today andhra pradesh news latest updates october 26 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live October 26, 2024: Ministers Committee : ధరల నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్లపై మంత్రుల కమిటీ అధ్యయనం, ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

Ministers Committee : ధరల నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్లపై మంత్రుల కమిటీ అధ్యయనం, ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

Andhra Pradesh News Live October 26, 2024: Ministers Committee : ధరల నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్లపై మంత్రుల కమిటీ అధ్యయనం, ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

04:32 PM ISTOct 26, 2024 10:02 PM HT Telugu Desk
  • Share on Facebook
04:32 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 26 Oct 202404:32 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Ministers Committee : ధరల నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్లపై మంత్రుల కమిటీ అధ్యయనం, ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

  • Ministers Committee On Price Control : నిత్యావసరాలు, కూరగాయల ధరల నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్లపై తగిన సిఫార్సులు చేయాలని ఏపీ ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఉత్పత్తి, డిమాండ్, సప్లై, ఎగుమతి, దిగుమతులను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202401:42 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Temples Tour : పుణ్య క్షేత్రాల‌కు ప్రత్యేక స‌ర్వీసులు, కృష్ణా జిల్లాలో 200 ఆర్టీసీ స్పెష‌ల్‌ బ‌స్సులు

  • AP Temples Tour : రాష్ట్రంలో పుణ్యక్షేత్రాల‌కు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తెచ్చింది. కృష్ణా జిల్లాలోనే ఏకంగా 200 బ‌స్సులు ఆర్టీసీ పుణ్యక్షేత్రాల ద‌ర్శనాల‌కు కోసం వేసింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202411:51 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Mudra Loan : కేంద్రం గుడ్‌న్యూస్‌.. ముద్ర లోన్ ప‌రిమితి రూ.20 ల‌క్ష‌ల‌కు పెంపు.. ఇలా అప్లై చేయండి

  • Mudra Loan : కేంద్ర ప్ర‌భుత్వం వ్యాపార ఆలోచ‌న ఉన్న‌వారికి గుడ్‌న్యూస్ చెప్పింది. ముద్ర లోన్ ప‌రిమితిని రూ.10 ల‌క్ష‌ల నుంచి రూ.20 ల‌క్ష‌ల‌కు పెంచింది. దీంతో వ్యాపారం చేయాల‌నుకునే వారికి కాస్తా ఊర‌ట ల‌భించింది. https://www.mudra.org.in/ లింక్ ద్వారా ముద్ర లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202411:42 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Anantapur Road Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం-లారీని ఢీకొట్టిన కారు, ఆరుగురి మృతి

  • Anantapur Road Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ రోడ్డు వద్ద అదుపుతప్పిన కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202411:21 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Jagan vs Sharmila : ప్రమాణం చేస్తున్నా.. నాకు జగన్ అన్న అంటే ప్రాణం : షర్మిల

  • Jagan vs Sharmila : వైఎస్ జగన్ గురించి ఆయన సోదరి షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు జగన్ అంటే ప్రాణం అని స్పష్టం చేశారు. సుబ్బారెడ్డి తన గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. రేపు విజయసాయిరెడ్డి కూడా మాట్లాడతారని షర్మిల వ్యాఖ్యానించారు. వైసీపీ వాళ్లకు తానేం తక్కువ చేశానని ప్రశ్నించారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202410:36 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Palnadu : పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ భూముల్లో అధికారుల సర్వే

  • Palnadu : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు కదిలారు. జగన్ కంపెనీ సరస్వతి పవర్ భూముల్లో సర్వే నిర్వహించారు. శుక్రవారం పవన్ కళ్యాణ్ ఆదేశించడంతో.. అధికారులు శనివారం సర్వే చేపట్టారు. సరస్వతి భూములపై పవన్ కళ్యాణ్ అధికారులను సమగ్ర నివేదిక కోరారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202410:12 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Visakha Crime : ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారయత్నం, బాధితురాలి కుటుంబంతో రూ.20 వేలకు గ్రామపెద్దల బేరం

  • Visakha Crime : విశాఖ జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసి...ఊరి పెద్దలతో రాజీకి ప్రయత్నించాడో యువకుడు. బాధితురాలి తల్లితో రూ.20 వేలు బేరానికి దిగాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో రూ.40 వేలు ఇస్తామని బేరాలు ఆడారు. బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202409:53 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP New Ration Cards : కొత్త రేష‌న్ కార్డుల‌కు ఆప్షన్ విడుద‌ల‌, ఇలా అప్లై చేసుకోవ‌చ్చు

  • AP New Ration Cards : కొత్త రేష‌న్ కార్డుల గురించి ఎదురుచూసేవారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త రేష‌న్ కార్డుల‌కు ఆప్షన్ విడుద‌ల చేసింది. ఇంకా ఆల‌స్యం ఎందుకు రేష‌న్ కార్డు లేనివాళ్లు అప్లై చేసుకోండి.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202408:34 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tdp Membership 2024 :టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం, రూ.100 చెల్లిస్తే రూ.5 లక్షల ప్రమాదబీమా-రిజిస్ట్రేషన్ ఇలా

  • Tdp Membership 2024 : తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. వాట్సాప్, టెలిగ్రామ్, ఆన్ లైన్ లో టీడీపీ మెంబర్ షిప్ పొందవచ్చు. అలాగే రెన్యువల్ చేసుకోవచ్చు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202408:03 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: PM E-Drive Scheme : పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్- ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు కేంద్రం సబ్సిడీ, ఎలా పొందాలంటే?

  • PM E-Drive Scheme : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్ ను అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ అందిస్తుంది. ఈ పథకం అమలుకు కేంద్రం రూ.10,900 కోట్ల నిధులు కేటాయించింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202407:55 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Nominated Post 2024 : రెండో దఫా నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై చంద్రబాబు ఫోకస్.. ఈసారి డబుల్ ధమాకా!

  • AP Nominated Post 2024 : ఏపీలో మరోసారి నామినేటెడ్ పోస్టులపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఒక లిస్టును ప్రకటించిన చంద్రబాబు.. రెండో దఫా నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. త్వరలోనే రెండో లిస్టును చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది. దీని కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202407:33 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TET Results 2024 : రేపు ఏపీ టెట్ ఫైనల్ కీలు విడుదల - నవంబర్ 2న ఫలితాలు

  • AP TET Results 2024 : ఏపీ టెట్ ఫలితాల విడుదలకు కసరత్తు జరుగుతోంది. రేపు అన్ని పరీక్షల ఫైనల్ కీలు అందుబాటులోకి రానున్నాయి. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో https://aptet.apcfss.in/  నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 2న ఫలితాలు రానున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202406:50 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: NICL Recruitment 2024 : ఎన్ఐసీఎల్‌లో అసిస్టెంట్ ఉద్యోగాలు - ఏపీ, తెలంగాణ‌లో ఖాళీలు ఎన్నంటే?

  • నేష‌న‌ల్ ఇన్సురెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐసీఎల్‌)లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అసిస్టెంట్స్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 21, తెలంగాణ‌లో 12 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు ఆఖ‌రు తేదీ న‌వంబ‌ర్ 11గా నిర్ణ‌యించారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202406:28 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Teachers Promotion 2024 : ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్.. 9 సంవత్సరాల తర్వాత వీరికి ప్రమోషన్లు!

  • AP Teachers Promotion 2024 : వారికి పదోన్నతులు కల్పించి దాదాపు దశాబ్దం అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రమోషన్ల ఊసే లేదు. అడిగినా పట్టించుకునే వారే లేరు. దీంతో ఆ టీచర్లు నిరాశ చెందారు. అయితే.. తాజాగా వారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రమోషన్లు ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202405:47 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Chandrababu : ఆ తండ్రి ఆవేదన చూసి చలించిపోయాను.. భావోద్వేగానికి గురైన చంద్రబాబు

  • Chandrababu : ఇటీవల విజయవాడను వరదలు ముంచెత్తాయి. ఎటు చూసినా నీరే ఉంది. కానీ.. తాగడానికి మాత్రం చుక్క లేదు. ఈ దీన స్థితి గురించి చంద్రబాబు వివరించారు. ఆహా షోలో తన బావమరిది బాలకృష్ట ప్రశ్నకు సమాధానం చెబుతూ.. చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202404:19 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: HYD to Vizag : శంషాబాద్ టు విశాఖపట్నం.. 4 గంటల్లోపే ప్రయాణం.. గంటకు 220 కి.మీ స్పీడ్‌తో ట్రైన్!

  • HYD to Vizag : హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అటు నుంచి కూడా భారీగా హైదరాబాద్‌కు వస్తుంటారు. కానీ ప్రయాణ సమయం ఎక్కువగా ఉంటోంది. అందుకే ఈ రూట్‌లో వందేభారత్‌ను తీసుకొచ్చారు. మరింత సమయం తగ్గించడానికి తాజాగా అడుగులు పడుతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202402:37 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Trains Informations : ఏపీ మీదుగా 2 ప్ర‌త్యేక రైళ్లు - ఈ రూట్లలో పలు సర్వీసులు రద్దు

  • ప్రయాణికులకు రైల్వేశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ మీదుగా రెండు ప్ర‌త్యేక రైళ్లను నడపనుంది. ఈ రెండు రైళ్లు పలు స్టేషన్లలో ఆగనున్నాయి. ఇక దానా తుఫాను కారణంగా 15 రైళ్ల రద్దయ్యాయి. మరోవైపు కిరండూల్-విశాఖపట్నం (08552) రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ అందుబాటులోకి రానుంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 26 Oct 202401:14 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP SSC Exams 2025 : ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలివే

  • ఏపీ పదో తరగతి విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లించేందుకు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 28వ తేదీ నుంచి ఫీజుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. నవంబరు 11వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ తేదీ దాటికే ఆలస్య రుసుం చెల్లించాలి.
పూర్తి స్టోరీ చదవండి