LIVE UPDATES
Andhra Pradesh News Live October 25, 2024: Pawan Kalyan : జగన్ కంపెనీపై పవన్ కళ్యాణ్ ఫోకస్.. నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం!
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 25 Oct 202405:08 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Pawan Kalyan : జగన్ కంపెనీపై పవన్ కళ్యాణ్ ఫోకస్.. నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం!
- Pawan Kalyan : ఓవైపు ఆస్తి పంపకాల విషయంలో జగన్ వర్సెస్ షర్మిల ఫైట్ నడుస్తోంది. దీనిపై పొలిటికల్ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూములపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Fri, 25 Oct 202404:39 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Education : ఒకేసారి 21 మంది విద్యా శాఖ అధికారులు బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- AP Education : రాష్ట్రంలో భారీగా విద్యా శాఖ అధికారులు బదిలీ అయ్యారు. 21 మంది జిల్లా విద్యా అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఉపాధ్యాయ బదిలీలు ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Fri, 25 Oct 202403:24 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Jagan vs Sharmila Episode : భారతి సిమెంట్‌కు షర్మిల సిమెంట్ అని పేరు ఎందుకు పెట్టలేదు : పేర్ని నాని
- Jagan vs Sharmila Episode : జగన్, షర్మిల ఆస్తి పంపకాల వ్యవహారంపై పొలిటికల్ పంచ్‌లు పేలుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతలు ఈ ఇష్యూపై ఘాటుగా స్పందిస్తున్నారు. టీడీపీ జగన్‌ను టార్గెట్ చేస్తుంటే.. వైసీపీ నేతలు షర్మిలను టార్గెట్ చేస్తూ పంచ్‌లు పేలుస్తున్నారు. తాజాగా పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు.
Fri, 25 Oct 202401:57 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Visakhapatnam : ఆంధ్రా ఆసుపత్రిలో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు
- Visakhapatnam : గుండె సంబంధిత సమస్యలతో బాధపడే చిన్నారులకు విశాఖ ఆంధ్రా హాస్పిటల్ అండగా నిలుస్తోంది. ఉచితంగా గుండె ఆపరేషన్లు చేస్తోంది. యూకే నుంచి వచ్చిన వైద్య బృందం ఆపరేషన్లు చేస్తోంది. ఈనెల 26వ తేదీతో ఈ శిబిరం ముగుస్తుందని.. ఆంధ్రా ఆసుపత్రి వైద్యులు చెప్పారు.
Fri, 25 Oct 202412:39 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Rayalaseema Love Story : తెల్లవారితే పెళ్లి.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. సీన్ కట్ చేస్తే..
- Rayalaseema Love Story : అది కల్యాణ మండపం. తెల్లవారితే ఓ యువతి పెళ్లి. వివాహానికి కుటుంబ పెద్దలు అంతా సిద్ధం చేశారు. మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా.. వధువు పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. అర్ధరాత్రి ఓ యుకుడితో కలిసి బైక్‌పై పారిపోయింది. దీంతో యువతి తండ్రి గుండెలవిసేలా విలపించారు.
Fri, 25 Oct 202411:19 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: APSRTC Special Buses : పరమ శివుడికి భక్తులకు గుడ్‌న్యూస్.. పంచారామాలకు 350 ప్రత్యేక బస్సులు
- APSRTC Special Buses : కార్తికమాసం నవంబర్ 2 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ మాసంలో పరమ శివుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. కార్తిక సోమవారం నాడు శైవక్షేత్రాలను దర్శిస్తే పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్టి దృష్ట్యా ఆర్టీసీ బస్సులు నడిపేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
Fri, 25 Oct 202410:47 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Flood Relief Protest: అందని వరద సాయం, ఆగని నిరసనలు.. సిఎంఓనే మభ్య పెడుతున్న ఐఏఎస్‌లు, బాధితుల ఆందోళన
- Flood Relief Protest: విజయవాడలో బుడమేరు వదర పరిహారం అందక బాధితుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ వేలాదిమందికి పరిహారం అందకపోవడంతో నిత్యం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు అందరికి పరిహారం చెల్లించేసినట్టు కొందరు ఐఏఎస్ అధికారులు సిఎంఓను మభ్యపెట్టడమే సమస్యకు కారణంగా కనిపిస్తోంది.
Fri, 25 Oct 202410:45 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TG Union Bank Jobs : ఏపీ, తెలంగాణలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి
- AP TG Union Bank Jobs : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఆంధ్రప్రదేశ్‌లో 200, తెలంగాణలో 200 పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు దాఖలు చేసేందుకు ఆఖరు తేదీ నవంబర్ 13గా నిర్ణయించాయి.
Fri, 25 Oct 202409:57 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: TTD Alert: తిరుమల కాలి నడకన వచ్చే భక్తులకు టీటీడీ అలర్ట్..నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచన
- TTD Alert: తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి కాలి నడకన వచ్చే భక్తులకు టీటీడీ పలు సూచనలు చేసింది. ఇటీవల కాలి నడకన కొండపైకి వస్తున్న భక్తులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతుండటంతో భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పలు సూచనలు చేసింది. వృద్ధులు, బీపీ,షుగర్,ఉబ్బసం, మూర్చ ఉన్న వారికి జాగ్రత్తలు సూచించింది.
Fri, 25 Oct 202409:37 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Sharmila Open letter: వైఎస్సార్ అభిమానులకు బహిరంగ లేఖ, ఆస్తి వివాదాలపై క్లారిటీ ఇచ్చిన షర్మిల
- Sharmila Open letter: వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆయన సోదరి షర్మిలకు మధ్య తలెత్తిన ఆస్తి విభేదాలు కొనసాగుతున్నాయి. గత మూడ్రోజులు ఇరు పక్షాలు పోటాపోటీగా లేఖలు విడుదల చేస్తున్నారు. షేర్ల బదిలీపై ఎన్సీఎల్‌టీలో ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైంది. తాజాగా షర్మిల ఆస్తి వ్యవహారాలపై వివరణ ఇచ్చారు.
Fri, 25 Oct 202409:17 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Liquor Sales 2024 : ఎనీ టైమ్ లీక్కర్ కిక్కు.. తెలుగు తమ్ముళ్లకు కాసుల వర్షం!
- AP Liquor Sales 2024 : ఏపీలో నూతన మద్యం విధానం తెలుగు తమ్ముళ్లకు కాసుల పంట పండిస్తోంది. అదనపు ఆదాయం కోసం బెల్టు షాపులను విచ్చలవిడిగా ఏర్పాటు చేయిస్తున్నారు. ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ అమ్మిస్తూ.. జేబులు నింపుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నించేవారు లేక.. బరితెగిస్తున్నారు.
Fri, 25 Oct 202407:34 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: GVMC Water Supply : గ్రేటర్ విశాఖ వాసులకు అలర్ట్... ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
- గ్రేటర్ విశాఖ వాసులకు అధికారులు అలర్ట్ ఇచ్చారు. రేపు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను బంద్ చేయనున్నట్టు వెల్లడించారు. వాటర్ బోర్డు పనుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ మేరకు ఆయా ప్రాంతాల వివరాలను పేర్కొంది.
Fri, 25 Oct 202407:32 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Free Gas Cylinders: అక్టోబర్31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి ఏర్పాట్లు, 29 నుంచి బుకింగ్, విధివిధానాలు ఖరారు
- AP Free Gas Cylinders: ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత రేషన్ కార్డుల పంపిణీకి విధివిధానాల ఖరారు చేశారు. వైట్ రేషన్ కార్డుతో పాటు గ్యాస్ కనెక్షన్, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత సిలిండర్ అందించాలని నిర్ణయించినట్టు మంత్రి నాదెండ్ల తెలిపారు.
Fri, 25 Oct 202406:32 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Kadapa District : ప్రేమ పేరుతో మోసం..! మైనర్ బాలికను గర్భవతిని చేసిన యువకుడు, పోక్సో కేసు నమోదు
- కడప జిల్లాలో బాలికపై కన్నేసిన ఓ యువకుడు ప్రేమ పేరుతో మోసం చేశాడు. ఏకంగా గర్భవతిని చేశాడు. వివాహం చేసుకోవాలని కోరగా… మోహం చాటేశాడు. విషయం కుటుంబ సభ్యుల దృష్టికి చేరటంతో… ముదివేడు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై పోక్సో కింద కేసు నమోదు చేశారు.
Fri, 25 Oct 202405:55 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Palnadu Diarrhea: పల్నాడులో డయేరియా మరణాలు, గ్రామాల్లో తాగునీటి సమస్యతో రోగాలు
- Palnadu Diarrhea: ఏపీలో విజయనగరం జిల్లా గుర్లలో కలుషిత నీటిని తాగి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే పల్నాడులో అదే తరహాలో ప్రాణాలు కోల్పోయారు. దాచేపల్లి పట్టణంలో కలుషిత నీరు, అపరిశుభ్రత వాతావరణంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Fri, 25 Oct 202404:48 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Advocate Suicide: అనంతపురంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం లేదని యువ అడ్వకేట్ ఆత్మహత్య...
- Advocate Suicide: అనంతపురంలో విషాదఘటన చోటు చేసుకుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమైన మహిళా న్యాయవాది ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న రుక్సానా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
Fri, 25 Oct 202404:13 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Fasal Bima Yojana: ఏపీ రైతులకు అలర్ట్.. పంటల బీమా ప్రీమియం చెల్లించాలి..
- AP Fasal Bima Yojana: ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ కీలక అప్డేట్ ఇచ్చింది. అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంతో పంటలకు బీమా పరిహారాన్ని అందుకోవాలంటే రైతులు తప్పనిసరిగా బీమా ప్రీమియం చెల్లించాలని ఏపీ వ్యవసాయ శాఖ ప్రకటించింది.
Fri, 25 Oct 202403:15 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: APCOB Recruitment 2024 : ఏపీ కోఆపరేటివ్ బ్యాంకులో అప్రెంటీస్ ఖాళీలు
- ఏపీ కోఆపరేటివ్ బ్యాంకులో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి ప్రకటన జారీ అయింది. మొత్తం 25 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్ లైన్ లో అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది.
Fri, 25 Oct 202401:11 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TG Weather Updates : తీరం దాటిన 'దానా' తీవ్ర తుపాన్ - ఉత్తరాంధ్రకు హెచ్చరికలు
- Cyclone Dana : "దానా"తీవ్రతుపాన్ తీరం దాటింది. రాత్రి1.30 నుంచి తెల్లవారుజామున 3. 30 గంటల మధ్యతీరం దాటినట్లు వాతావరణశాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర, దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.