Andhra Pradesh News Live October 20, 2024: AP Tourism Temple Tour Package : ఏపీ టూరిజం సరికొత్త ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ, ఒకే రోజులో 6 ప్రముఖ ఆలయాల సందర్శన
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 20 Oct 202404:55 PM IST
AP Tourism Temple Tour Package : అక్టోబర్ 26 నుంచి ఏపీ టూరిజం టెంపుల్ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ టూర్ ప్యాకేజీలో ఒక రోజులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 6 ఆధ్యాత్మిక ఆలయాలను కవర్ చేయవచ్చు.
Sun, 20 Oct 202401:30 PM IST
Police On Kadapa Petrol Attack : కడప జిల్లా బద్వేల్ లో ఇంటర్ విద్యార్థిని పెట్రోల్ దాడి ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ దాడికి పాల్పడిన నిందితుడు విఘ్నేష్ అరెస్టు చేశామని ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. వీరిద్దరికి ఐదేళ్ల పరిచయం ఉందన్నారు. పెళ్లి ప్రస్తావన తేవడంతోనే పథకం ప్రకారమే దాడి చేశాడని ఎస్పీ తెలిపారు.
Sun, 20 Oct 202412:26 PM IST
Train Timings : దక్షిణ మధ్య రైల్వే మూడు రైళ్ల సమయాల్లో మార్పు చేసింది. లింగంపల్లి-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-గూడురు సింహాపురి ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయ వేళలను మార్పు చేసినట్లు తెలిపింది.
Sun, 20 Oct 202411:47 AM IST
AP Rain Alert : రానున్న 24 గంటల్లో ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ అల్పపీడనం అక్టోబర్ 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఆవర్తనం ప్రభావంతో రేపు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.
Sun, 20 Oct 202411:45 AM IST
- Rushikonda Palace : విశాఖపట్నం సమీపంలోని రుషికొండపై గత ప్రభుత్వం అద్భుతమైన భవనాలను నిర్మించింది. ఎన్నికల కోడ్ వచ్చే వరకు అక్కడ పనులు జరిగాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం మారింది. దీంతో అప్పటినుంచి అక్కడ పెండిగ్ పనులు జరగడం లేదు. కానీ.. కరెంట్ బిల్లు మాత్రం లక్షల్లో వస్తోంది.
Sun, 20 Oct 202411:03 AM IST
Kadapa Petrol Attack : కడప జిల్లా బద్వేల్ లో ఉన్మాది దాడిలో తీవ్రగాయాలైన ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. దాడి అనంతరం పోలీసులు యువతి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. చివరిసారిగా ఆమె మాట్లాడిన మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
Sun, 20 Oct 202410:56 AM IST
- Andhra Pradesh : మరో కీలక పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తాజాగా.. మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ పథకం అమలు గురించి కీలక ప్రకటన చేశారు. దీపావళి నుంచి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని వివరించారు. దీనికి సంబంధించి విధివిధానాలను ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
Sun, 20 Oct 202410:35 AM IST
PM Kisan FPO Scheme : రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటికే పీఎం కిసాన్ వంటి పథకాల రైతులకు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజా మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద రైతులకు ఏకంగా రూ.15 లక్షలు సాయం చేయనుంది.
Sun, 20 Oct 202410:01 AM IST
- Kadapa Petrol Attack Case : కడప జిల్లా బద్వేలు సమీపంలో పెట్రోల్ దాడికి గురైన విద్యార్థిని మృతిచెందింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటు ఇప్పటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Sun, 20 Oct 202409:31 AM IST
IGNOU TEE Registration Extended : ఇగ్నో డిసెంబర్ లో నిర్వహించే టర్మ్ ఎండ్ ఎగ్జామ్ గడువును పొడిగించింది. ఆలస్య రుసుము లేకుండా అక్టోబర్ 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. రూ.1100 ఆలస్య రుసుముతో అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు అవకాశం ఇచ్చింది.
Sun, 20 Oct 202408:50 AM IST
YS Jagan : ఏపీలో మహిళలు, బాలికలకు రక్షణ కరవైంది, ఇదేమి రాజ్యం? అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. బద్వేలు ఘటన అత్యంత హేయమన్నారు. సీఎం చంద్రబాబు వైసీపీపై కక్షతో దిశ వంటి మంచి కార్యక్రమాన్ని నిలిపివేశారని విమర్శించారు.
Sun, 20 Oct 202408:48 AM IST
- Vijayawada Police : బెజవాడ వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కలిగించేలా చర్యలు ప్రారంభం అయ్యాయి. తాజాగా.. విజయవాడ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. ప్రధాన కూడళ్లలో డ్రోన్లు వినియోగిస్తూ.. ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. వాహనాల రద్దీని అంచనా వేస్తూ.. డైవర్షన్ చేస్తున్నారు.
Sun, 20 Oct 202408:22 AM IST
Guntur Woman Brain Dead : గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. శనివారం సాయంత్రం ఓ యువతిని రౌడీ షీటర్ కారులో తీసుకెళ్లాడు. తెల్లారేసరికి యువతి బ్రెయిన్ డెడ్ అయ్యి ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రత్యక్షం అయ్యింది.
Sun, 20 Oct 202407:29 AM IST
- Raiway Lands Issue: విజయవాడలో దశాబ్దాలుగా సాగుతున్న రైల్వే స్థలాల ఆక్రమణలు అడ్డు అదుపు లేకుండా సాగుతున్నాయి. గత మూడు నాలుగు దశాబ్దాలుగాు నగరంలో ఖాళీ స్థలం కనిపిస్తే జెండాలు పాతడం, కాలనీలకు కాలనీలు పుట్టుకొస్తున్నా అధికారులు చోద్యం చూశారు. నేడు దానికి మూల్యం చెల్లిస్తున్నారు.
Sun, 20 Oct 202407:29 AM IST
- AP Tourism : అరకు అందాలను ఆస్వాదించడానికి టూరిస్టులు తరలివస్తున్నారు. ఈ సీజన్‌లో మంచు, పచ్చదనం, సూర్యోదయాన్ని చూడటానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో.. స్థానికంగా వ్యాపారం చేసేవారు అందినకాడికి దండుకుంటున్నారు. గదుల అద్దెలు మొదలు.. అన్నింటి రేట్లు పెంచేసి అక్రమంగా సంపాదిస్తున్నారు.
Sun, 20 Oct 202407:28 AM IST
- తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 31వ తేదీన ‘దీపావళి ఆస్థానాన్ని’ నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. దీపావళి ఆస్థానం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.
Sun, 20 Oct 202405:52 AM IST
- Tirumala Darshan Tickets : శ్రీవారి దర్శనం.. మహాభాగ్యంగా భావిస్తారు భక్తులు. లక్షలాది మంది శ్రీవారిని దర్శించుకొని అధ్యాత్మికానందం పొందుతారు. భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఎంతో సాయం చేస్తారు. కానీ.. ఏపీలో ఓ ఎమ్మెల్సీ మాత్రం.. శ్రీవారి దర్శనం పేరుతో వ్యాపారం చేశారు.
Sun, 20 Oct 202405:41 AM IST
- AP LAWCET Counselling 2024: ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ - 2024కు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. షెడ్యూల్ లో పలు మార్పులు చేసినట్లు తెలిపారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ గడువు అక్టోబర్ 23వ తేదీ వరకు పొడిగించారు. నవంబర్ 2వ తేదీన తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.
Sun, 20 Oct 202405:15 AM IST
- AP jawan died : మావోయిస్టుల మందుపాతరకు ఏపీకి చెందిన జవాన్ బలయ్యాడు. మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబులు పేలి.. బ్రహ్మంగారిమఠం మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన జవాన్‌గా చనిపోయాడు. దీంతో పాపిరెడ్డిపల్లె గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Sun, 20 Oct 202404:40 AM IST
- AP TET Key Results 2024 : ఏపీ టెట్ అభ్యర్థులకు మరో అప్డేట్ వచ్చేసింది. అక్టోబర్ 3 నుంచి 18వ తేదీ వరకు జరిగిన అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలు, ప్రిలిమినరీ 'కీ' లు అందుబాటులోకి వచ్చాయి. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో https://aptet.apcfss.in/ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Sun, 20 Oct 202404:15 AM IST
- AP spiritual journey : ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టింది. భక్తుల సందర్శనార్ధం ప్రతి శనివారం ఎనిమిది ఆధ్యాత్మిక ప్రదేశాల యాత్రను ఈనెల 26 నుంచి ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన విశేషాలు, వివరాలను వెల్లడించింది.
Sun, 20 Oct 202403:30 AM IST
- ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి మళ్లీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం, సాగర్ నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తారు. 1.18 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Sun, 20 Oct 202403:13 AM IST
- ఏఎన్‌యూలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ అయింది. ఏపీ పీజీ సెట్-2024లో ర్యాంకులు పొందిన వారు ఈ ప్రవేశాలకు అర్హులవుతారని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 21న ఉదయం 9.30 నుంచి 11.30వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు.
Sun, 20 Oct 202402:03 AM IST
- కడప జిల్లాలోని బద్వేల్‌లో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ప్రేమపేరుతో విద్యార్థినిపై విఘ్నేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Sun, 20 Oct 202411:46 PM IST
- కృష్ణా జిల్లాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో పరిధిలో 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.