Andhra Pradesh News Live November 6, 2024: America Vice President : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆంధ్ర అల్లుడు, భర్త విజయంలో ఉషా చిలుకూరి కీలక పాత్ర-today andhra pradesh news latest updates november 6 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live November 6, 2024: America Vice President : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆంధ్ర అల్లుడు, భర్త విజయంలో ఉషా చిలుకూరి కీలక పాత్ర

America Vice President : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆంధ్ర అల్లుడు, భర్త విజయంలో ఉషా చిలుకూరి కీలక పాత్ర

Andhra Pradesh News Live November 6, 2024: America Vice President : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆంధ్ర అల్లుడు, భర్త విజయంలో ఉషా చిలుకూరి కీలక పాత్ర

04:25 PM ISTNov 06, 2024 09:55 PM HT Telugu Desk
  • Share on Facebook
04:25 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 06 Nov 202404:25 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: America Vice President : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆంధ్ర అల్లుడు, భర్త విజయంలో ఉషా చిలుకూరి కీలక పాత్ర

  • America Vice President : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ విజయం సాధించింది. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికలయ్యారు. ఆయన తన వైస్ ప్రెసిడెంట్ గా ఆంధ్ర అల్లుడు జేడీ వాన్స్ ను ఎన్నుకున్న విషయం తెలిసిందే. జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి తల్లిదండ్రులు ఏపీకి చెందిన వారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 06 Nov 202402:17 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Nellore Crime : రీల్స్ నేర్పిస్తానని బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి, పోక్సో కేసు న‌మోదు

  • Nellore Crime : నెల్లూరు జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. రీల్స్ చేయడం నేర్పిస్తానని బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. బాలిక ప్రవర్తనలో మార్పుతో తల్లి ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 06 Nov 202412:29 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Regional Rural Banks Merge : దేశంలో 15 గ్రామీణ బ్యాంకుల విలీనం- తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్యాంకులు ఇక కనిపించవ్

  • Regional Rural Banks Merge : ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విలీనానికి కేంద్రం మరో అడుగు ముందుకేసింది. నవంబర్ 20లోగా గ్రామీణ బ్యాంకుల స్పాన్సర్ బ్యాంకుల నుంచి విలీనంపై అభిప్రాయాలు సేకరించనుంది. దేశంలోని 43 గ్రామీణ బ్యాంకులను 23గా విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 06 Nov 202412:11 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Birth Certificate in AP : బ‌ర్త్ స‌ర్టిఫికేట్ లేదా..? అయితే ఇలా పొందండి

  • Birth Certificate in Andhrapradesh : బర్త్ సర్టిఫికెట్ లేదని ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు చాలా సింపుల్ గా ఈ ధ్రువపత్రాన్ని పొందవచ్చు. దరఖాస్తు రాసి ఎంపీడీవో లేదా తహసీల్దార్ తో సంతకం చేయించాలి. ఈ అప్లికేషన్ ను సచివాలయంలో అందజేస్తే సర్టిఫికెట్ ను పొందవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…
పూర్తి స్టోరీ చదవండి

Wed, 06 Nov 202411:15 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Maddelacheruvu Suri Murder Case : మద్దెలచెర్వు సూరి హత్య కేసు - 12 ఏళ్ల తర్వాత జైలు నుంచి భాజైలు నుంచి భానుకిరణ్‌ విడుదల

  • Maddelacheruvu Suri Murder Case Updates : ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంచ‌ల‌నం సృష్టించిన మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్ర‌ధాన నిందితుడైన భాను కిరణ్ విడుదలయ్యాడు. 12 ఏళ్ల పాటు జైలులో ఉన్న భాను కిరణ్ కి బెయిల్ రావటంతో… బుధవారం జైలు నుంచి బయటికి వచ్చారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 06 Nov 202410:44 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Cabinet Decisions : ఫీజు రీయంబర్స్మెంట్ పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, నేరుగా కాలేజీల ఖాతాల్లోనే- కేబినెట్ నిర్ణయాలివే

  • AP Cabinet Key Decisions : ఏపీని ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్ గా మార్చేందుకు డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. డ్రోన్ లపై పరిశోధనలు చేసే విద్యాసంస్థలకు రూ.20 లక్షల ప్రోత్సహకాలు అందించనున్నారు. విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ ఇకపై నేరుగా కాలేజీల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 06 Nov 202410:39 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vizianagaram MLC Election 2024 : విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికలు - వైసీపీ అభ్యర్థి ఖరారు, లెక్కలివే..!

  • విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వెంకట చిన అప్పల నాయుడు పేరు ఖరారైంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం ప్రకటించారు. బుధవారం పార్టీ నాయకులతో సమావేశమైన జగన్… సమాలోచనలు చేసి నిర్ణయం తీసుకున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 06 Nov 202409:59 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Visakha Special Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, విశాఖ-దానాపూర్ మధ్య రెండు స్పెషల్ ట్రైన్స్, నాలుగు రైళ్లు రీషెడ్యూల్

  • Visakha Special Trains : ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో విశాఖ-దానాపూర్-విశాఖ మధ్య ఈస్ట్ కోస్ట్ రైల్వే రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది. మరో నాలుగు రైళ్లను రీషెడ్యూల్ చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 06 Nov 202409:43 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Eluru Bikes Recovery : స్కూటీని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్న మహిళ, కష్టపడ్డ సొమ్ము తిరిగొచ్చింది- వీడియో వైరల్

  • Eluru Bikes Recovery : ఇన్నాళ్లు ఎంతో అప్యాయంగా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకున్న స్కూటీ చోరీకి గురైంది. తలసేమియాతో బాధపడే బిడ్డను ఆ స్కూటీ మీదే ఆసుపత్రికి తీసుకెళ్లేది ఆ మహిళ. పోలీసులు ఆ స్కూటీని రికవరీ చేసి ఇవ్వడంతో ఆమెకు కన్నీళ్లు ఆగలేదు. ఈ ఘటనలో ఏలూరు జిల్లాలో జరిగింది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 06 Nov 202408:54 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Pawan Kalyan : పిఠాపురంలో 12 ఎకరాల భూమి కొన్న పవన్ కల్యాణ్- త్వరలో ఇల్లు, క్యాంపు కార్యాలయం నిర్మాణం

  • Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పిఠాపురంలో మరో 12 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఈ భూమిలో త్వరలో ఇల్లు, క్యాంపు కార్యాలయం నిర్మించనున్నారు. పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటానని పవన్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 06 Nov 202408:29 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Airport Recruitment 2024 : విశాఖ, విజ‌య‌వాడ‌ ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు - కేవ‌లం ఇంట‌ర్వ్యూనే..!

  • విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం విమానాశ్రయాల్లో పలు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు విడుదలయ్యాయి.కేవ‌లం ఇంట‌ర్వ్యూల ఆధారంగానే వీటిని భర్తీ చేయనున్నారు. న‌వంబ‌ర్ 11, 12 తేదీల్లో ఇంట‌ర్వ్యూలు ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 06 Nov 202407:32 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Cabinet On CRDA: సిఆర్‌డిఏ పరిధిని పునరుద్ధరిస్తూ క్యాబినెట్‌ నిర్ణయం, పిఠాపురం అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు

  • AP Cabinet On CRDA: వైసీపీ హయంలో కుదించిన సిఆర్‌డిఏ పరిధిని తిరిగి యథాతథ స్థితికి మారుస్తూ ఏపీ క్యాబినెట్‌ అమోద ముద్ర వేసింది. పిఠాపురంలో కొత్త అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు క్యాబినెట్ అమోదం తెలిపింది. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 06 Nov 202407:08 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Electricity Charges: ఏపీలో ముంచుకొస్తున్న విద్యుత్ ఛార్జీల భారం.. విపక్షాల ఆందోళన, 2022 నుంచి సర్దుబాటు ఛార్జీల వసూలు

  • Electricity Charges: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల పిడుగు పడబోతుంది. ఇప్పటికే రూ.6వేల కోట్ల రుపాయల ట్రూ అప్ ఛార్జీల వసూలుకు అమోదం లభించగా మరో రూ.11వేల కోట్ల వసూలుకు ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. వెరసి రూ.17వేల కోట్ల భారాన్ని నెలవారీ బిల్లుల్లో ప్రజలు చెల్లించాల్సి ఉంటుంది. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 06 Nov 202404:59 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌‌గా ప్రమాణం చేసిన బీఆర్‌ నాయుడు, 54వ ఛైర్మన్‌గా బాధ్యతలు

  • TTD Chairman: టీటీడీ నూతన ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ప్రమాణం చేశారు. ఏపీ ప్రభుత్వం బొల్లినేని రాజగోపాల నాయుడును టీటీడీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఉదయం 7.15గంటలకు  రంగనాయకుల మండపంలో బోర్డు ఛైర్మన్‌, సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 06 Nov 202404:18 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఈనెల 8, 9 తేదీల్లో పలు సేవలు రద్దు..!

  • TTD Pushpayaga Mahotsavam 2024: శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. నవంబరు 9న పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనున్నట్లు తెలిపింది.  పుష్పయాగం సందర్భంగా.. 9వ తేదీన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జితసేవలు ర‌ద్ద‌య్యాయి. తోమాల‌, అర్చ‌న సేవ‌లు ఏకాంతంగా నిర్వ‌హిస్తారని ప్రకటించింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 06 Nov 202403:57 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Konaseema Crime: కోనసీమ జిల్లాలో ఘోరం, ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. బాలికపై అత్యాచారం

  • Konaseema Crime: బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. బాలిక‌ను ప్రేమించి, పెళ్లి చేస‌కుంటాన‌ని న‌మ్మించి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు యువ‌కుడు. బాలిక త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు యువ‌కుడిపై పోక్సో చ‌ట్టం కింద కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 06 Nov 202411:37 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Mega DSC 2024 Update: ఏపీ మెగా డిఎస్సీ 2024 నోటిఫికేషన్ వాయిదా..రిజర్వేషన్ల అమలుపై సందిగ్ధం

  • AP Mega DSC 2024 Update: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ జాప్యం కానుంది.ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 6వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉంది. అనూహ్య పరిణామాల నేపథ్యంలో  ఇది ఆలస్యం కానుంది. 
పూర్తి స్టోరీ చదవండి