Andhra Pradesh News Live November 4, 2024: Amaravati Tenders : అమరావతిపై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం-సీఆర్డీఏ పాత టెండర్లు రద్దు, కొత్త వాటికి లైన్ క్లియర్
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 04 Nov 202405:27 PM IST
Amaravati Tenders : ఏపీ రాజధాని అమరావతిపై ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. గత టీడీపీ హయాంలో ఇచ్చిన పాత టెండర్లను సీఆర్డీఏ రద్దు చేసింది. త్వరలో కొత్త టెండర్లను పిలిచేందుకు తీర్మానం చేసింది.
Mon, 04 Nov 202404:02 PM IST
Karthika Masam Special Buses : కార్తీక మాసం సందర్భంగా అనంతపురం జిల్లా నుంచి శైవ క్షేత్రాలకు 300 బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. త్రిలింగ దర్శనం, అరుణాచలంతో పాటు ఇతర పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు.
Mon, 04 Nov 202402:00 PM IST
East Godavari e-Court Jobs : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ-కోర్టుల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు దాఖలు చేయడానికి నవంబర్ 8 ఆఖరు తేదీగా నిర్ణయించారు.
Mon, 04 Nov 202401:15 PM IST
AP Teachers Mlc Elections : తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నిక షెడ్యూల్ ను ఈసీ ప్రకటించింది. ఈ నెల 11న ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 5 పోలింగ్ నిర్వహిస్తారు.
Mon, 04 Nov 202412:11 PM IST
- AP Govt Good News : ఏపీ సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త క్రీడా పాలసీకి చంద్రబాబు ఆమోదం తెలిపారు. అటు వివిధ స్థాయిల్లో విజయం సాధించిన క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సహకాన్ని భారీగా పెంచారు. అదే సమయంలో.. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాపైనా కీలక నిర్ణయం తీసుకున్నారు.
Mon, 04 Nov 202411:13 AM IST
APSRTC Sabarimala Tour Package : శబరిమల వెళ్లే భక్తులు కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. తాజాగా నెల్లూరు డిపో నుంచి శబరిమల వెళ్లే భక్తులు ప్రత్యేక ప్యాకేజీలను ఆర్టీసీ అందుబాటులో ఉంచింది. బస్సు మొత్తం బుక్ చేసుకునే భక్తులకు రాయితీ ప్రకటించింది.
Mon, 04 Nov 202410:44 AM IST
- APSRTC : ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్‌నకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడుల్లో వివిధ ట్రేడ్‌లకు సంబంధించి అప్రెంటీస్‌షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. నవంబర్ 20లోగా దరఖాస్తులు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది.
Mon, 04 Nov 202410:00 AM IST
- Pawan Kalyan : ఏపీ డిప్యూడీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచార ఘటనలపై హోంమంత్రి బాధ్యత వహించాలని సూచించారు. తాను హోంశాఖ తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని పవన్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలని పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు.
Mon, 04 Nov 202409:49 AM IST
AP Electricity Charges Hike : ఏపీ ప్రజలపై విద్యుత్ భారం పడనుంది. విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు డిస్కమ్ లు ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపాయి. ఈ ప్రతిపాదనలను ఈఆర్సీ బహిర్గతం చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈ నెల 19లోపు అభ్యంతరాలు తెలపాలని కోరింది.
Mon, 04 Nov 202409:32 AM IST
- Annavaram Tourism : అన్నవరం.. ఈ పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది పంపా నది తీరం. పచ్చని పొలాలు, ప్రకృతి సోయగాలు. అలాంటి చోటును పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. త్వరలోనే అన్నవరంలో ఏరియల్ కేబుల్ కార్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Mon, 04 Nov 202408:15 AM IST
- AP Drone Pilot : సొంత ఊర్లోనే ఉంటూ మంచి జీతం పొందే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ అవకాశం వచ్చినా.. చదువు, శిక్షణ వంటివి అవసరం. కానీ.. పదో తరగతి చదువు, 5 రోజుల శిక్షణతో.. మంచి జీతం పొందే అవకాశం వచ్చింది. దీంతో నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చు.
Mon, 04 Nov 202406:18 AM IST
- AP TET 2024 Results: ఆంధ్రప్రదేశ్ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయడానికి అర్హత కలిగిన అభ్యర్థుల కోసం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 టెట్ పరీక్షల్లో మొత్తం 1,87,256మంది ఉత్తీర్ణులయ్యారు.
Mon, 04 Nov 202404:56 AM IST
- Vijayawada Job Mela: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పలు ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాల కోసం నియామకాలు చేపడతాయి. రూ.12వేల నుంచి రూ.35వేల వరకు వేతనాలు లభించే ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
Mon, 04 Nov 202404:25 AM IST
- AP Tourism : ఏపీ పర్యాటక రంగంలో మరో అద్భుతం జరగబోతోంది. ఇందుకు బెజవాడ వేదిక కానుంది. విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ప్రయోగానికి అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 9న పున్నమిఘాట్‌లో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించనున్నారు. త్వరలో రెగ్యులర్ సర్వీస్ నడిపేలా చర్యలు తీసుకుంటున్నారు.
Mon, 04 Nov 202404:19 AM IST
- Cyber bullying: ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా వేదికగా ముసుగు ముఖాలతో చెలరేగిపోతున్న సైబర్ బుల్లియింగ్‌కు అడ్డు కట్ట వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా కొన్నేళ్లుగా సాగుతున్న వ్యవహారం శృతి మించుతోంది. సైబర్ దూషణకు అడ్డు కట్ట వేసేందుకు కీలక ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Mon, 04 Nov 202403:50 AM IST
- Karthika Masam : కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైనది. హరి (విష్ణువు), హరుడు (శివుడు)కి అతి ప్రీతి పాత్రమైన మాసంలో ఉపవాస దీక్షలు, నిష్టతో పూజలు, ఆలయాల దర్శనాలు చేస్తే కైలాసాన్ని చేరుకుంటారని భక్తులు విశ్వసిస్తారు. దేవతాస్నానం చేస్తే యాగఫలం సిద్ధిస్తుందని నమ్మకం.
Mon, 04 Nov 202402:57 AM IST
- Prakasam Crime: ప్రకాశం జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థినిపై ట్యూషన్ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. నెల రోజులుగా విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ట్యూషన్ మాస్టర్‌పై విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు.
Mon, 04 Nov 202402:46 AM IST
- Nellore ZP Meeting: నెల్లూరు జడ్పీ సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అవమానం జరిగింది. అధికారులు ఉద్దేశపూర్వకంగా అవమానించారంటూ ఎంపీ సభ నుంచి నిష్క్రమించడంతో ఎంపీ అనుచరులు మండిపడ్డారు. మంత్రి ఆనం రాంనారాయణ ఎంపీని బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఫలించలేదు.
Mon, 04 Nov 202402:02 AM IST
- AP Pensions Update: ఏపీలో సామాజిక పెన్షన్ల చెల్లింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షనర్లు పలు కారణాలతో వరుసగా రెండు నెలలు పెన్షన్ తీసుకోలేకపోయినా మూడో నెలలో బకాయిలతో కలిపి మొత్తం చెల్లిస్తారు. ఈ నిర్ణయం ప్రభుత్వ పెన్షన్లపై ఆధారపడిన వారికి ఊరట కల్పిస్తోంది.
Mon, 04 Nov 202401:34 AM IST
- Tirupati Accident: ఆటవిడుపు కోసం అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన తిరుపతి శిల్పారామంలో జరిగింది. ప్లే జోన్‌లో ఉన్న శిల్పారామంలో క్రాస్ వీల్ బకెట్ ఊడిపడటంతో అందులో కూర్చున్న యువతులు కిందపడిపోయారు. ఈ ఘటనలో ఓ యువతి ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
Mon, 04 Nov 202412:49 AM IST
- Tatiparru Tragedy: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. విగ్రహావిష్కరణ ఏర్పాట్లు చేస్తుండగా ఫ్లెక్సీలకు విద్యుత్ తీగలు తగలడంతో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని తాటిపర్రులో ఈ ఘటన చోటు చేసుకుంది.
Mon, 04 Nov 202412:18 AM IST
- AP TET 2024 Results: ఏపీలో టెట్ 2024 ఫలితాలను మంత్రి నారా లోకేశ్ నేడు విడుదల చేయనున్నారు.అక్టోబర్ నెల 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 3,68,661 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇటీవల టెట్ ఫైనల్ కీని కూడా విద్యాశాఖ విడుదల చేసింది.