Andhra Pradesh News Live November 3, 2024: AP TS Weather Report : తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు-పెరుగుతున్న చలి
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 03 Nov 202403:04 PM IST
AP TS Weather Report : తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రేపు(సోమవారం) తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయని, చలి తీవ్ర పెరుగుతోందని పేర్కొంది.
Sun, 03 Nov 202401:52 PM IST
Godavari Pushkaralu 2027 : 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే గోదావరి పుష్కరాల తేదీల ఖరారయ్యాయి. 2027 జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు మొదలుపెట్టింది.
Sun, 03 Nov 202401:09 PM IST
AP Steel Plant Investment : ఏపీలో భారీ పెట్టుబడికి ఉక్కు దిగ్గజాలు ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ ముందుకొచ్చాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడితో 17.8 మిలియన్ టన్నుల సామర్థ్యంతో భారీ స్టీల్ ప్లాంట్ నిర్మించనున్నాయి.
Sun, 03 Nov 202412:15 PM IST
- Pancharamalu : భక్తులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని గన్నవరం నుండి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. పంచారామాలకు ప్రత్యేక సర్వీసులు, ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకుకొచ్చారు. పంచరామాలను కార్తీకమాసంలో ఒకే రోజు దర్శించే విధంగా ప్రణాళిక చేశారు.
Sun, 03 Nov 202412:09 PM IST
APCRDA Jobs : ఏపీ సీఆర్డీఏలో భారీగా వేతనంతో పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. మొత్తం ఏడు రకాల విభాగాల్లో 19 పోస్టులు భర్తీ చేస్తుంది. నవంబర్ 13 దరఖాస్తు దాఖలు చేయడానికి చివరి తేదీగా నిర్ణయించారు.
Sun, 03 Nov 202411:52 AM IST
AP Housing Approval : నగరాల్లో ఇల్లు నిర్మించుకునే వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 100 గజాల లోపు స్థలంలో ఇల్లు నిర్మించుకునే వారికి ప్లాన్ అప్రూవల్ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. 300 గజాల్లోపు ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు సులభతరం చేస్తామన్నారు.
Sun, 03 Nov 202410:43 AM IST
- AP Free Gas Cylinder : ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభం అయ్యింది. అక్టోబర్ 31 నుంచి బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే.. చాలామంది రాయితీ పొందే విధానం తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పథకానికి తాము అర్హులమా కాదా.. అనే అనుమానాలతో సతమతం అవుతున్నారు.
Sun, 03 Nov 202410:08 AM IST
PM Svanidhi Scheme : పీఎం స్వనిధి పథకం ద్వారా వీధి వ్యాపారులకు కేంద్రం ప్రభుత్వం రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు రుణాలు ఇస్తుంది. రుణాలను సకాలంలో చెల్లిస్తే వడ్డీపై 7 శాతం సబ్సిడీ ఇస్తారు. అలాగే డిజిటల్ లావాదేవీలపై రూ.1200 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తారు.
Sun, 03 Nov 202408:46 AM IST
AP New Ration Card Details : కొత్త రేషన్ కార్డులపై ఏపీ సర్కార్ అప్డేట్ ఇచ్చింది. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు చేస్తుంది. అలాగే పాత కార్డుల స్థానంలో కొత్త డిజైన్ తో కార్డులు జారీ చేయనున్నారు. వినియోగంలో లేని కార్డులను తొలగించి కొత్త కార్డులు జారీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది.
Sun, 03 Nov 202407:52 AM IST
- AP election 2027 : దేశంలో జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయనే చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ కూడా జమిలీ ఎన్నికలపై ఇటీవల కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ ముఖ్యనేత విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Sun, 03 Nov 202407:38 AM IST
- AP LAWCET Counselling 2024 Updates : ఏపీ లాసెట్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించారు. https://lawcet-sche.aptonline.in/ వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ అర్డర్ కాపీలను పొందవచ్చని అధికారులు తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు నవంబర్ 4వ నుంచి రిపోర్ట్ చేయాలి.
Sun, 03 Nov 202407:24 AM IST
- Konaseema Crime : కోనసీమ జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై యువకుడు అత్యాచారం చేశాడు. అటుగా వెళ్తున్న స్థానికులు బాలిక కేకలకు అక్కడికి వెళ్లారు. దీంతో బాలికను అత్యాచారం చేసిన నిందితుడు పరారయ్యాడు. అటు శ్రీకాకుళం జిల్లాలో యువకుడిపై పోక్సో కేసు నమోదైంది.
Sun, 03 Nov 202406:28 AM IST
- APSRTC Sabarimala Special : శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. డిపోల వారీగా మంచి ప్యాకేజీలు ప్రకటిస్తోంది. తాజాగా.. నెల్లూరు జిల్లా అధికారులు శబరిమల స్పెషల్ ప్యాకేజీలు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం సంప్రదించాల్సిన నంబర్లను వెల్లడించారు.
Sun, 03 Nov 202405:42 AM IST
- AP TET Results : ఏపీ టెట్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేయనున్నారు. టెట్ రాసిన అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. టెట్ రిజల్ట్ తర్వాత.. డీఎస్సీ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Sun, 03 Nov 202405:09 AM IST
- Sabarimala Yatra : అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మండల -మకరవిలక్కు యాత్రకి వచ్చే భక్తులకు ఉచిత బీమా సౌకర్యం కల్పించింది. శబరిమలకు కేరళ, తమిళనాడు నుంచే కాకుండా ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తుల భక్తులు తరలివెళ్తారు. వారికి ఈ సౌకర్యం కల్పించారు.
Sun, 03 Nov 202404:23 AM IST
- Tirumala Tirupati Devasthanams Updates : తిరుమలలో భక్తుల రద్దీ భారీగీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శానికి 18 గంటలకుపైగా సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు.
Sun, 03 Nov 202404:10 AM IST
- AP Government : ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు పెట్టే వారికి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏడీజీపీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించింది. ఉద్యోగులపై ఆరోపణలు, ఫిర్యాదులు చేసేవారి వివరాలు బహిర్గతం చేయొద్దని ఉత్తర్వు జారీ చేసింది.
Sun, 03 Nov 202401:52 AM IST
- AP Assembly Budget Sessions 2024 : ఈ నెల 11 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్థిక పద్దుతో పాటు పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేసింది.
Sun, 03 Nov 202401:19 AM IST
- జమ్మూ కశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి లోయలో దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఇద్దరు బీటెక్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లాకు చెందిన ఆనందరెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన కావ్యారెడ్డిని మృతులుగా గుర్తించారు. మృతదేహాలు శనివారం స్వస్థలాలకు చేరుకున్నాయి.