LIVE UPDATES
Andhra Pradesh News Live November 21, 2024: AP Tourism : పీపీపీ మోడల్‌లో టూరిజం అభివృద్ధి.. పెట్టుబడిదారులకు రాయితీలు.. ప్రైవేటు వ్యక్తులకు అవకాశాలు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 21 Nov 202404:15 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Tourism : పీపీపీ మోడల్‌లో టూరిజం అభివృద్ధి.. పెట్టుబడిదారులకు రాయితీలు.. ప్రైవేటు వ్యక్తులకు అవకాశాలు
- AP Tourism : ఏపీ ప్రభుత్వం టూరిజంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పర్యాటకులను ఆకర్షించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా పీపీపీ విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా ఏపీ టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Thu, 21 Nov 202401:51 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Posani Krishna Murali : ఇక జీవితంలో రాజకీయాలపై మాట్లాడను.. పోసాని కృష్ణమురళి కీలక నిర్ణయం
- Posani Krishna Murali : పోసాని కృష్ణ మురళి కీలక నిర్ణయం తీసుకున్నారు. చచ్చిపోయేదాకా రాజకీయాలు గురించి మాట్లాడనని వెల్లడించారు. ఇకనుంచి రాజకీయాలకు దూరంగా ఉంటానన్న పోసాని.. జీవితంలో రాజకీయాలపై మాట్లాడబోనని స్పష్టం చేశారు. పోసాని నిర్ణయం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.
Thu, 21 Nov 202401:50 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Welfare Pensions: పెన్షనర్లకు శుభవార్త.. రెండు నెలలు వరుసగా పెన్షన్ తీసుకోకున్నా మూడో నెలలో మొత్తం చెల్లిస్తారు
- Welfare Pensions: ఏపీలో సామాజిక పెన్షన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వివిధ కారణాలతో వరుసగా రెండు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో బకాయిలతో కలిపి పెన్షన్ చెల్లిస్తారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అనుబంధ విభాగాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.
Thu, 21 Nov 202401:10 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: TTD Masterplan: టీటీడీ అప్టేట్…తిరుమలలో గెస్ట్‌హౌస్‌లకు సొంతపేర్లు ఉండకూడదు..
- TTD Masterplan: తిరుమలలో ప్రైవేట్ వ్యక్తులు నిర్మించిన గెస్ట్‌హౌస్‌లపై ఈవో శ్యామల రావు కీలక వ్యాఖ్యలు చేశారు. - 2019లో తిరుమల అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించినా, అది జరగలేదని, 2019లో రూపొందించిన మాస్టర్ ప్లాన్ గురించి ఎవరికి తెలియదని, ప్రణాళిక ప్రకారం తిరుమల అభివృద్ధి జరగలేదన్నారు.
Thu, 21 Nov 202412:39 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Garbage Tax: ఏపీలో చెత్తపన్ను వసూళ్ల నుంచి విముక్తి, సవరణ బిల్లుకు అసెంబ్లీ అమోదం
- AP Garbage Tax: ఆంధ్రప్రదేశ్‌లో చెత్త పన్ను వసూళ్లకు అసెంబ్లీ మంగళం పాడింది. గత కొన్నేళ్లగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైన చెత్త పన్ను వసూళ్లను రద్దు చేయాలనే సవరణ బిల్లుకు అసెంబ్లీ అమోదం తెలిపింది. ఏపీలో వైసీపీ పాలనలో ప్రతి ఇల్లు, అపార్ట్‌మెంట్, దుకాణాల నుంచి చెత్తసేకరణకు పన్నులు వసూలు చేశారు.
Thu, 21 Nov 202411:58 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Assembly : ఎవరైనా భూమిని ఆక్రమిస్తే ఇక బయట తిరగలేరు.. చంద్రబాబు మాస్ వార్నింగ్
- AP Assembly : ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. గంజాయి, భూ ఆక్రమణలు, ఫ్యాక్షన్, రౌడీయిజం, శాంతిభద్రతల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా భూమిని ఆక్రమిస్తే ఇక బయట తిరగలేరని చంద్రబాబు స్పష్టం చేశారు.
Thu, 21 Nov 202411:00 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Rains : ఏపీ ప్రజలకు అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు
- AP Rains : ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అధికారుల హెచ్చరికలతో.. అన్నదాతల్లో ఆందోళన మొదలైంది.
Thu, 21 Nov 202409:23 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Fee Reimbursement Go77: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, జీవో 77 రద్దుకు ఏపీ సర్కారు సన్నాహాలు
- Fee Reimbursement Go77: ఆంధ్రప్రదేశ్ యువతకు సర్కారు త్వరలో తీపి కబురు చెప్పనుంది. నాలుగేళ్ల క్రితం ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ కాలేజీల్లో చదువులకు ఫీజు రియంబర్స్‌మెంట్ రద్దు ఉత్తర్వులను ఉపసంహరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. యువగళం యాత్రలో లోకేష్‌ఇచ్చిన హామీ మేరకు జీవో 77కు మార్పులు చేయనున్నారు.
Thu, 21 Nov 202408:27 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Kurnool Highcourt Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఏపీ అసెంబ్లీ అమోదం.. సీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న బాబ
- Kurnool Highcourt Bench: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు.ఈ మేరకు శాసనసభలో తీర్మానం చేశారు. కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం తెలిపారు.
Thu, 21 Nov 202406:53 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Sri Vani Tickets quota: రేణిగుంట విమానాశ్రయంలో మరిన్నిశ్రీవాణి టికెట్లు పెంపు, ఫిబ్రవరి కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు..
- Sri Vani Tickets quota: టీటీడీ బోర్డు నిర్ణయంత రేణిగుంట విమానాశ్రయంలో జారీ చేసే శ్రీవాణి దర్శనం టిక్కెట్ల సంఖ్యను 100నుంచి 200కు పెంచారు. ఎయిర్ పోర్ట్ కరెంట్ బుకింగ్‌లో శ్రీవాణి టిక్కెట్లను భక్తులు బుక్ చేసుకోవచ్చు. బోర్డింగ్ పాస్ ఉన్న భక్తులకు మాత్రమే వీటిని జారీ చేస్తారు.
Thu, 21 Nov 202405:20 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Generic Medicines: ఏపీలో 15 రోజుల్లోనే జనరిక్ మెడిసిన్ స్టోర్లకు అనుమతులు, మండలానికో జనరిక్ స్టోర్ ఏర్పాటు…
- Generic Medicines: ఆంధ్రప్రదేశ్‌లో జనరిక్ మందుల దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తు చేసిన 15రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తామని, మందుల విక్రయాల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, జనరిక్ స్టోర్ల ఏర్పాటుకు యువత ముందుకు రావాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.
Thu, 21 Nov 202405:16 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Crime News : వివాహేతర సంబంధం..! భర్తను హత్య చేసిన భార్య -యావజ్జీవ కారాగార శిక్ష విధించిన కోర్టు
- అక్క కొడుకుతో భార్య వివాహేతర సంబంధం నడిపింది. ఈ విషయంలో భర్తకు తెలియడంతో మాస్టర్ ప్లాన్ వేసింది. భర్తను హత్య చేసింది. ఇందుకు మరో ఇద్దరు సహకరించారు. ఈ కేసులో విశాఖ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. భార్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
Thu, 21 Nov 202405:03 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Madakasira Kalyani: మడకశిరలో రూ.1430కోట్లతో కళ్యాణి స్ట్రాటిజిక్ సిస్టమ్స్ ఏర్పాటు
- Madakasira Kalyani: రాయలసీమలోని వెనుకబడిన ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిరకు భారీ పెట్టుబడి రానుంది. రూ.1430కోట్లతో కొత్త పరిశ్రమను ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త పరిశ్రమతో దాదాపు 565 ఉద్యోగాలు లభించనున్నాయి.
Thu, 21 Nov 202404:40 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Fee Reimbursement: ఇక కాలేజీ ఖాతాలకే నేరుగా ఫీ రియింబర్స్‌మెంట్.. మాట నిలబెట్టుకున్న లోకేష్
- AP Fee Reimbursement: ఏపీలో ఉన్నత విద్యను అందిస్తున్న కాలేజీల కష్టాలు తీరనున్నాయి. ఐదేళ్లుగా విద్యార్థుల ఫీజు రియింబర్స్‌మెంట్‌లో ఎదురవుతున్న ఇక్కట్లకు ప్రభుత్వం ముగింపు పలికింది. ఇకపై కాలేజీ ఖాతాలకే నేరుగా విద్యార్ధుల ఫీజు రియింబర్స్‌మెంట్ జమ కానుంది. ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరి చేశారు.
Thu, 21 Nov 202404:16 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: NTA CMAT 2025: సీ మ్యాట్ 2025 నోటిఫికేషన్ విడుదల.. డిసెంబర్ 13 వరకు దరఖాస్తుల స్వీకరణ
- NTA CMAT 2025: దేశంలోని ప్రతిష్టాత్మక మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలో ప్రవేశాల కోసంమ్యాట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.నవంబర్ 14 నుంచి డిసెంబర్ 13వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. సీమ్యాట్ 2025 స్కోర్ ద్వారా దేశంలో ఐఐఎంలతో పాటు ప్రతిష్టాత్మక మేనేజ్‌మెంట్ విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
Thu, 21 Nov 202403:28 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala Tickets : శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు ఫిబ్రవరి కోటా ఆర్జిత సేవా టికెట్లు విడుదల, ఇదిగో లింక్
- శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి- 2025 కోటా టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇవాళ శ్రీవారి కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఆన్ లైన్ లో భక్తులు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
Thu, 21 Nov 202403:26 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP SSC Exams: పది పరీక్షలపై విద్యాశాఖ కీలక నిర్ణయం, మీడియం ఎంపిక చేసుకునే అవకాశం..ఫీజు చెల్లింపుకు గడువు పొడిగింపు..
- AP SSC Exams: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ తీపి కబురు చెప్పింది. 2025 మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏ భాషలో పరీక్షలు రాయాలనే ఆప్షన్ ఇవ్వనుంది.ఇంగ్లీష్ మీడియం బోధనతో కొందరు వాటికి అలవాటు పడలేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ ఆప్షన్ తీసుకొచ్చారు.
Thu, 21 Nov 202403:08 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: IMD Rain ALERT : బంగాళాఖాతంలో అల్పపీడనం.. 25 నాటికి వాయుగుండం..! దక్షిణ కోస్తా, సీమ జిల్లాలకు భారీ వర్ష సూచన
- AP Telangana Weather News : దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో ఇవాళ ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది క్రమంగా అల్పపీడనం, వాయుగుండంగా మారుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీలో నవంబర్ 26 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….
Thu, 21 Nov 202402:06 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Police Recruitment 2024 : ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలు - దరఖాస్తుల గడువు పొడిగింపు, డిసెంబర్‌లో దేహదారుఢ్య పరీక్షలు
- AP Police Recruitment 2024 : కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఫిజికల్ టెస్టుల కోసం దరఖాస్తు చేసుకునే గడువును నవంబర్ 28 వరకు పొడిగించింది. డిసెంబర్ చివరి వారంలో ఈ పరీక్షలు జరగనున్నాయి.
Thu, 21 Nov 202411:51 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Gurukulam Jobs 2024 : గురుకులాల్లో కాంట్రాక్ట్ టీచింగ్ ఉద్యోగాలు - కేవలం డెమో, ఇంటర్వ్యూతోనే భర్తీ!
- అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని గురుకులాల్లో టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో రిక్రూట్ చేయనున్నారు. డెమో, ఇంటర్వ్యూతోనే భర్తీ చేస్తారు. నవంబర్ 21వ తేదీన ఇంటర్వ్యూలు ఉంటాయి.