Andhra Pradesh News Live November 20, 2024: TTD Calendars 2025 : టీటీడీ క్యాలెండర్లు వచ్చేశాయ్ - ఎక్కడ తీసుకోవాలంటే…
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 20 Nov 202404:40 PM IST
- TTD Calendars 2025 : ఈ ఏడాదికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది.ఇవాళ్టి(నవంబర్ 20) నుంచి పలు చోట్ల క్యాలెండర్లు అందుబాటులోకి వచ్చాయి. ధరల వివరాలను కూడా టీటీడీ పేర్కొంది.
Wed, 20 Nov 202404:14 PM IST
- కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం విషయంలో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని వైఎస్ షర్మిల విమర్శించారు. 10 ఏళ్లు ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రతిపక్ష హోదా కావాలని అడగటం సిగ్గుచేటన్నారు.
Wed, 20 Nov 202402:29 PM IST
- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్ విభాగం ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Wed, 20 Nov 202412:41 PM IST
- Volunteers Issue: ఆంధ్రప్రదేశ్‌లో 2023 నుంచి వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఈ ఏడాది బడ్జెట్‌లో వాలంటీర్ల జీతాలకు రూ.277కోట్ల కేటాయింపులు ఎందుకు చేశారని జగన్ ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లకు అన్ని హెడ్‌ల కింద అనుమతులున్నాయన్నారు.
Wed, 20 Nov 202411:58 AM IST
- AP Cheap Liquor: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రైవేట్ మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్న చౌక మద్యంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ సంచలన ఆరోపణలు చేశారు. కేరళలో రూ.25కు విక్రయించే మద్యాన్ని ఏపీలో రూ.99కు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామన్నారని గుర్తు చేశారు.
Wed, 20 Nov 202411:44 AM IST
- అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ వైర్లు తెగిపడి బైక్‌పై ప్రయాణిస్తున్న తండ్రి, కొడుకులు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Wed, 20 Nov 202410:29 AM IST
- Ys Jagan On Budget: సూపర్ సిక్స్ హామీలు ఎక్కడంటే బొంకుల బాబు బొంకులాడుతున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎద్దేవా చేశారు. ఆర్థిక పరిస్థితి అప్పులపై చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని, కాగ్ రిపోర్టులు, బడ్జెట్ లెక్కల ఆధారంగా చంద్రబాబు అబద్దాలు బయటపడ్డాయని, హామీలు అమలు చేయలేక బొంకుతున్నారన్నారు.
Wed, 20 Nov 202410:10 AM IST
- AP Ration Dealers : ఏపీలో రేషన్ డీలర్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు దాఖలకు నవంబర్ 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. చీరాల, రేపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 192 రేషన్ డీలర్లను నియామించనున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…
Wed, 20 Nov 202409:35 AM IST
- CBN Vs Jagan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి దశకు చేరుకున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాలుగు నెలల తర్వాత 2024-25లో చివరి నాలుగు నెలల కాలానికి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎనిమిది రోజుల బడ్జెట్ సమావేశాల్లో ఎవరి వ్యూహం నెగ్గిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
Wed, 20 Nov 202408:34 AM IST
- Indrakeeladri GhatRoad: కొండ చరియలు విరిగిపడకుండా మరమ్మతులు నిర్వహించడానికి బెజవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డును మూసివేశారు. మూడు రోజుల పాటు దుర్గగుడి ఘాట్ రోడ్డును మూసివేశారు. మరమ్మతుల తర్వాత ఘాట్ రోడ్డుపై వాహనాలను అనుమతిస్తారు.
Wed, 20 Nov 202407:28 AM IST
Guntur Crime : గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి యత్నించాడు. అయితే ఈ బాలిక తెలివిగా వీడియో రికార్డు చేసింది. ఆ వీడియోను తల్లిదండ్రులకు చూపించింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా...వృద్ధుడిపై పోక్సో కేసు నమోదైంది.
Wed, 20 Nov 202407:09 AM IST
- Minister On Volunteers: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడం, వేతనాల పెంపుపై శాసనమండలిలో మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు. వైసీపీ తరపున బొత్స అడిగిన ప్రశ్నకు డోలా స్పష్టత ఇచ్చారు. వ్యవస్థలో లేని వాలంటీర్లకు జీతాల పెంపు ప్రస్తావనే రాదన్నారు.
Wed, 20 Nov 202407:08 AM IST
RGV Bail Petition : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి హైకోర్టు తలుపుతట్టారు. ఒంగోలులో నమోదైన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.
Wed, 20 Nov 202406:25 AM IST
East Godavari Viral Video : అమ్మాయికి మెసేజ్ చేశాడని ఓ యువకుడిపై మరో ముగ్గురు దాడి చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. యువకుడి...ముగ్గురు పాశవికంగా దాడి చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Wed, 20 Nov 202405:37 AM IST
NVS Admissions 2025 : జనహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11 తరగతుల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. తాజాగా వీటి దరఖాస్తుల చివరి తేదీ మరోసారి పొడిగించారు. విద్యార్థులు నవంబర్ 26వ తేదీ వరకు ఉచితంగా దరఖాస్తులు సమర్పించవచ్చు. 2025 ఫిబ్రవరి 8న పరీక్ష నిర్వహిస్తారు.
Wed, 20 Nov 202405:01 AM IST
- Specialist Officers: సెంట్రల్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 253 పోస్టులను తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సీనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ 4లో చీఫ్ మేనేజర్లను తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.
Wed, 20 Nov 202404:22 AM IST
- TTD Arjita Seva: టీటీడీ ఆర్జిత సేవ ఫిబ్రవరి నెల కోటా నవంబర్ 21 గురువారం విడుదల చేయనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అందించే పలు రకాల ఆర్జిత సేవలను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అంగప్రదక్షిణం టిక్కెట్ల కోటాను 23న, ప్రత్యేక ప్రవేశం టిక్కెట్లను 24న విడుదల చేస్తారు.
Wed, 20 Nov 202403:35 AM IST
AP Weavers : చేనేత కార్మికుల ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి సవిత తెలిపారు. నూలు కొనుగోలుకు సబ్సిడీ, 5 శాతం జీఎస్టీ రియింబర్స్ మెంట్ కు చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
Wed, 20 Nov 202412:50 AM IST
US Student Visa Demand : యూఎస్ స్టూడెంట్ వీసాలకు రోజు రోజుకు డిమాండ్ భారీ పెరుగుతోంది. ఇందుకు 2023-24లో యూఎస్ వర్సిటీల్లో చేరిన భారతీయ విద్యార్థుల లెక్కలే ఉదాహరణ. అమెరికాలో చదువుల్లో విద్యార్థుల సంఖ్యలో భారత్ చైనాను దాటి అగ్రస్థానంలో నిలిచింది. వీరిలో 56 శాతం తెలుగు విద్యార్థులు ఉన్నారు.
Wed, 20 Nov 202412:10 AM IST
AP Telangana Weather : ఏపీ, తెలంగాణలో ఇవాళ వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షసూచన చేయలేదు కానీ చలితీవ్రత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది.