Andhra Pradesh News Live November 17, 2024: AP Kishori Vikasam Scheme : ఏపీలో కిశోరి బాలిక వికాసం ప్రోగ్రాం పునఃప్రారంభం, కలెక్లర్లకు సచివాలయ శాఖ ఆదేశాలు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 17 Nov 202404:48 PM IST
AP Kishori Vikasam Scheme : ఆంధ్రప్రదేశ్‌లో మిషన్ వాత్సల్య పథకం కింద కిశోరి బాలిక వికాసం ప్రోగ్రాం పునఃప్రారంభం అయ్యింది. ఈ మేరకు అన్ని కలెక్లర్లకు రాష్ట్ర సచివాలయాల శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఈ కార్యక్రమం అమలుకు సంబంధించి తగిన చర్యలు చేపట్టాలని పేర్కొంది.
Sun, 17 Nov 202404:29 PM IST
AP Paddy Procurement WhatsApp : ధాన్యం కొనుగోలకు ఏపీ ప్రభుత్వం టెక్నాలజీని వినియోగిస్తుంది. వాట్సాప్ లో Hi అని పెడితే ధాన్యం కొనుగోలో స్లాట్ ను బుక్ చేస్తుంది. ఈ తేదీల్లో రైతుల వద్ద ధాన్యం సులభంగా కొనుగోలు చేస్తున్నారు. వాట్సాప్ ద్వారా ధాన్యం కొనుగోలు స్లాట్ చాలా సులభంగా బుక్ చేసుకోవచ్చు.
Sun, 17 Nov 202402:41 PM IST
Boy Fell Down In Sambar : కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సెల్ ఫోన్ లో గేమ్ ఆడుతూ...సాంబార్ గిన్నెపై కూర్చొన్న బాలుడు, ప్రమాదవశాత్తు వేడి సాంబార్ లో పడిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స బాలుడు మృతి చెందాడు.
Sun, 17 Nov 202411:41 AM IST
- AP Budget : ఏపీ బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సెటైర్లు వేశారు. అప్పులు, లెక్కల విషయంలో కూటమి ప్రభుత్వం బాగా నటిస్తోందన్నారు. డిస్కంల నష్టాలు పెంచింది చంద్రబాబేనని స్పష్టం చేశారు. ఐదు నెలల కూటమి పాలనలో ఆదాయం 9 శాంత తగ్గిందని లెక్కలు చెప్పారు.
Sun, 17 Nov 202411:00 AM IST
Anantapur News : అనంతపురం జిల్లాలో విషాదం నెలకొంది. తెల్లారితే నిశ్చితార్థం జరగాల్సిన యువతి, గోరింటాకు కోసం వెళ్లి తిరిగిరాని లోకానికి చేరుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని వెంకటరెడ్డిపల్లి గ్రామానికి సమీపంలో శనివారం చోటు చేసుకుంది.
Sun, 17 Nov 202410:45 AM IST
AP Schools : ఏపీలో ఇకపై రెండు రకాల ప్రాథమిక పాఠశాలలు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే విధంగా స్కూళ్ల టైమింగ్స్ మార్పుపై కూడా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Sun, 17 Nov 202410:13 AM IST
Waltair DRM Arrest : విశాఖలోని వాల్తేరు డీఆర్ఎమ్ ను సీబీఐ అరెస్టు చేసింది. ఓ టెండర్ విషయంలో డీఆర్ఎమ్ రూ.10 లక్షల లంచం తీసుకోగా...సీబీఐకి పట్టుకుంది. ఈ కేసులో ముంబయి, విశాఖలోని డీఆర్ఎమ్ ఇళ్లలో సీబీఐ అధికారుల సోదాలు చేసి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
Sun, 17 Nov 202408:55 AM IST
- AP Liquor Shops : ఏపీలో నూతన మద్యం పాలసీ అందుబాటులోకి వచ్చింది. కానీ.. మందుబాబులను మోసం చేయడం మాత్రం ఆగడం లేదు. చాలాచోట్ల ఎమ్మార్వీ ధరల కంటే ఎక్కువకు మద్యం విక్రయిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Sun, 17 Nov 202408:52 AM IST
Aadhaar DOB Update : ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్పునకు మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శుల సర్టిఫికెట్లతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు ఇచ్చే సర్టిఫికెట్ పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Sun, 17 Nov 202406:10 AM IST
- ఆధార్ కార్డులో మార్పుల కోసం హాస్టల్ నుంచి తీసుకొచ్చి బాలికపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పొక్సో కేసు నమోదు చేశారు.
Sun, 17 Nov 202403:47 AM IST
- Palnadu Crime : పల్నాడు జిల్లాలో విషాదం జరిగింది. పెన్నుల కోసం జరిగిన గొడవ ఓ విద్యార్థినిని బలి తీసుకుంది. తోటి స్నేహితులు దూషించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని.. కాలేజీ హాస్టల్ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.