Andhra Pradesh News Live November 16, 2024: AP Tidco Houses : టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన.. త్వరలో లబ్ధిదారులకు గుడ్‌న్యూస్
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 16 Nov 202411:50 AM IST
- AP Tidco Houses : టిడ్కో ఇళ్లకు సంబంధించి మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. వీలైనంత త్వరగా టిడ్కో ఇళ్లకు మౌళిక వసతులు పూర్తి చేస్తామని చెప్పారు. కాంట్రాక్టర్ల సమస్యలపై సీఈలతో కమిటీ వేస్తామని నారాయణ స్పష్టం చేశారు. గత పాలనలో టిడ్కో ఇళ్లను నాశనం చేశారని నారాయణ ఆరోపించారు.
Sat, 16 Nov 202411:00 AM IST
Postal Agents Recruitment : ఏపీలోని విజయవాడ పోస్టల్ డివిజన్ పరిధిలో పోస్టల్ బీమా ఏజెంట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 19న విజయవాడలో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.
Sat, 16 Nov 202410:41 AM IST
AP Teachers Transfers : ఏపీలో బదిలీలపై మళ్లీ కదలిక వచ్చింది. డీఈవో, ఆర్జేడీ ఆఫీసుల్లో మూడేళ్లకు మించి పనిచేస్తున్న ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే మంగళవారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
Sat, 16 Nov 202410:22 AM IST
CM Chandrababu : వైసీపీ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టి 53 రోజుల పాటు జైలులో నిర్బంధించారని సీఎం చంద్రబాబు అన్నారు. చేయని తప్పునకు తాను శిక్ష అనుభవించానన్నారు. సోషల్ మీడియాలో సొంత తల్లిని, చెల్లిని కూడా బూతులు తిట్టిస్తున్నారన్నారు.
Sat, 16 Nov 202410:05 AM IST
- APPSC Group 1 Mains : మొత్తం 81 పోస్టుల భర్తీకి మార్చి 17న ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. గ్రూప్-2 తరహాలో గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలన్న డిమాండ్ ఉంది.
Sat, 16 Nov 202407:07 AM IST
- Chandrababu Brother : ఏపీ చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
Sat, 16 Nov 202405:07 AM IST
- AP Teachers Transfers 2025 : ఏపీలో టీచర్ల బదిలీకి సంబంధించి మళ్లీ కదలిక మొదలైంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉపాధ్యాయ బదిలీలపై మంత్రి లోకేష్ ఇప్పటికే ఫోకస్ పెట్టారు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
Sat, 16 Nov 202404:41 AM IST
- వైసీపీలో కీలక నేతగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ పార్టీ అధినేత జగన్ మరోసారి కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా నియమించారు. ఈ మేరకు వైసీపీ అధినాయకత్వం ఆదేశాలను జారీ చేసింది. మొన్నటి వరకు అటు పార్టీలో, మరోవైపు ప్రభుత్వంలో సజ్జల కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
Sat, 16 Nov 202404:06 AM IST
- Vijayawada : ఉద్యోగం పేరుతో బాలికపై లైంగిక, శారీరక వేధింపులకు దిగారు. దీనిపై పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసింది. కానీ.. తమ పరిధి కాదంటూ పోలీసులు కేసు నమోదు చేసేందుకు తాత్సారం చేశారు. పోలీసులపై తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Sat, 16 Nov 202401:12 AM IST
- CM Chandrababu Delhi Tour Updates : రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునురుద్ధరించాలని సీఎం చంద్రబాబు కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌ను కోరారు. అలాగే రాష్ట్ర జీఎస్‌టీలో ఒక శాతం సర్‌చార్జ్ పెంపునకు అనుమతి ఇవ్వాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.