Andhra Pradesh News Live November 13, 2024: AP Roads Development : ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్, జాతీయ రహదారుల విస్తరణకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 13 Nov 202412:06 PM IST
AP Roads Development : ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. పలు జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. రాజమండ్రి-అనకపాల్లి, రాయచోటి-కడప జాతీయ రహదారుల విస్తరణకు పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు.
Wed, 13 Nov 202411:17 AM IST
- Rains in Andhrapradesh : ఏపీకి ఐఎండీ కీలక అప్టేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని పేర్కొంది. రేపు(నవంబర్ 14) కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వరికోతల విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
Wed, 13 Nov 202411:10 AM IST
Maredumilli : కొండ కోనల్లో, ఘాట్ రోడ్ లో ప్రయాణాలు...ప్రకృతి అందాలు వీక్షిస్తూ నైట్ స్టే చేయాలనుకుంటున్నారా? అయితే మారేడుమిల్లి బెస్ట్ టూరిస్ట్ స్పాట్. రాజమండ్రి, కాకినాడ నుంచి రెండు రోజుల టూరిస్ట్ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి.
Wed, 13 Nov 202410:57 AM IST
- AIIMS Mangalagiri Recruitment 2024: మంగళగిరి ఎయిమ్స్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. మొత్తం ఐదు ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 8వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలను https://www.aiimsmangalagiri.edu.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
Wed, 13 Nov 202409:54 AM IST
Cyber Crime : అమాయకులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో మోసాలు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని ఓ వ్యక్తికి రూ.20 వేలు పంపి..పొరపాటు వచ్చాయని తిరిగి చెల్లించాలని కోరారు. రూ. 20 వేలు తిరిగి చెల్లించగానే అతడి ఖాతాలోని రూ.46 లక్షలు మాయం అయ్యాయి.
Wed, 13 Nov 202408:06 AM IST
- PancharamaluTour Package : భక్తులకు ఏపీ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ కార్తీక మాసంలోపంచారామాలను దర్శించుకునేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైటెక్ నాన్ ఏసీ బస్సు సర్వీస్‌లో పెద్దలకు రూ.1,400, పిల్లలకు రూ.1,120గా నిర్ణయించారు.
Wed, 13 Nov 202407:58 AM IST
Post Office Scheme : చిన్న మొత్తాల్లో పొదుపునకు పోస్టాఫీసుల్లో చక్కటి పథకం అందుబాటులో ఉంది. రోజులు రూ.100 ఆదా చేస్తే రూ.లక్షల్లో తిరిగి పొందవచ్చు. ఈ పథకమే పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకం. ఈ స్కీమ్ లో వార్షిక వడ్డీ 6.7 శాతం పొందవచ్చు. ఐదేళ్ల పాటు పొదుపు చేసుకోవచ్చు.
Wed, 13 Nov 202407:44 AM IST
- Sachivalaya Police: ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శులు,మహిళా పోలీసుల విధులపై అసెంబ్లీలో చర్చ జరిగింది.జాబ్ ఛార్ట్, సర్వీస్ రూల్స్ లేకపోవడాన్ని సభ్యులు అసెంబ్లీలో ప్రస్తావించడంతో మహిళా సంరక్షణ కార్యదర్శుల విధులపై స్పష్టత ఇస్తామని హోంమంత్రి ప్రకటించారు
Wed, 13 Nov 202407:27 AM IST
- Social Media Cases: ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని నిలవురించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై చీఫ్ జస్టిస్ బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఏమైనా చేయొచ్చని భావిస్తున్నారని, వీటిని ఉపేక్షించలేమని, పిల్‌కు విచారణార్హత లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.
Wed, 13 Nov 202406:55 AM IST
- AP Mega DSC Update: ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ నిర్వహణపై మంత్రి నారాలోకేష్ ఏపీ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. న్యాయపరమైన అంశాలు కొలిక్కి వచ్చిన తర్వాతే డిఎస్సీ నోటిఫికేషన్ వెలువరిస్తామన్నారు. వచ్చే ఏడాదికి ఉద్యోగాలు భర్తీ సహా డిఎస్సీ 98లో మిగిలిన ఖాళీలను పూర్తి చేస్తామన్నారు.
Wed, 13 Nov 202406:48 AM IST
- సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకి ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయనకు నోటీసులు అందజేశారు. విచారణకు హాజరుకావాలని కోరారు.
Wed, 13 Nov 202406:23 AM IST
- Visakha Metro Rail: విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు సంబంధించి సమగ్ర రవాణా ప్రణాళిక సిద్దం చేసినట్లు పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అసెంబ్లీలో స్పష్టం చేశారు.కేంద్రం నుంచి అనుమతి రాగానే మెట్రో ప్రాజెక్ట్‌లపై ముందుకెళ్తామన్నారు.
Wed, 13 Nov 202406:03 AM IST
- AP LAWCET Counseling 2024 Updates : ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ కు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 14వ తేదీ నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నవంబర్ 26వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.
Wed, 13 Nov 202405:49 AM IST
- TTD Kaisika Dwadasi Asthanam :తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించారు. మాడ వీధుల్లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి దర్శనమిచ్చారు. సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగింపు ఉత్సవం సాగింది. ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ఊరేగింపు వేడుక ఉంటుంది.
Wed, 13 Nov 202405:18 AM IST
- ఏపీలో కొత్త విమానాశ్రయాలకు కసరత్తు జరుగుతోంది. ఆరు కొత్త ఎయిర్ పోర్టుల ఏర్పాటు కోసం సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం సర్వే చేయనుంది. ఈ కొత్త ఎయిర్‌పోర్టులకు సంబందించిన ప్రతిపాదనలను ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు పంపింది.
Wed, 13 Nov 202404:54 AM IST
- Vijayawada Bankruptcy: విజయవాడలో దశాబ్దాల చరిత్ర ఉన్న కో ఆపరేటివ్ బ్యాంకు కుప్పకూలిపోయింది. రాజకీయ జోక్యంతో ఎడాపెడా రుణాలు మంజూరు చేసి వాటిని వసూలు చేసుకోలేక బకాయిలు పేరుకుపోవడంతో చివరకు ఆర్‌బిఐ లైసెన్స్ రద్దైంది. బ్యాంకులో డిపాజిట్లు చేసిన వారి పరిస్థితి దయనీయంగా మారింది.
Wed, 13 Nov 202403:58 AM IST
- APCRDA Recruitment 2024 : ఏపీసీఆర్డీఏలో పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మొత్తం 19 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఇవాళ్టితో (నవంబర్ 13) తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. https://crda.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
Wed, 13 Nov 202402:46 AM IST
- Trains Cancellation: రామగుండం - పెద్దపల్లి స్టేషన్ల మధ్య ఉన్న రాఘవాపూర్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. ఏపీ తెలంగాణలలో పలు రైళ్లును రద్దు చేయడంతో పాటు దారి మళ్ళిస్తున్నారు. చెన్నై - డిల్లీ మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ళు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Wed, 13 Nov 202402:16 AM IST
- CRDA Limits: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిని పూర్వపు స్థితికి చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా సిఆర్‌డిఏ పరిధి 8వేల చదరపు కిలోమీటర్లకు పెరిగింది.
Wed, 13 Nov 202401:10 AM IST
- AP Dy Speaker: రఘురామకృష్ణం రాజుకు కోరుకున్న పదవి దక్కింది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పేరును ఖరారు చేశారు. మరోవైపు శాసనసభ, మండలిలో విప్‌లను కూడా ఖరారు చేశారు. శాసనసభకు జీవీ ఆంజనేయులు, మండలికి అనురాధలను ఖరారు చేశారు.