Andhra Pradesh News Live November 10, 2024: Vijayawada : త్యాగం, రాజీలేని పోరాటం లెనిన్ జీవితంలో ముఖ్య భాగాలు- విజయవాడలో లెనిన్ శత వర్ధంతి సభలో నేతల కీలక వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 10 Nov 202404:43 PM IST
Vijayawada News : ఒక మెరుగైన సమాజాన్ని నిర్మించిన మొదటి వ్యక్తి లెనిన్ అని న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్ నేతలు అన్నారు. విజయవాడలో లెనిన్ శత వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు నేతల కీలక ప్రసంగం చేశారు.
Sun, 10 Nov 202402:58 PM IST
AP Rains : రైతులను కంగారు పెట్టే హెచ్చరికలు చేసింది వాతావరణ శాఖ. రానున్న 36 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ద్రోణి ప్రభావంతో ఈ నెల 12 నుంచి 14 వరకు ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Sun, 10 Nov 202402:15 PM IST
PM Vidyalakshmi : విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఉన్నత విద్యాసంస్థల్లో చేరే విద్యార్థులకు రూ.10 లక్షల వరకు ఆర్థిక సాయం చేసేందుకు పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా విద్యార్థులకు తక్కువ వడ్డీకి విద్యా రుణాలు అందించనున్నారు.
Sun, 10 Nov 202401:55 PM IST
Annavaram Giri Pradakshina : కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 15న అన్నవరంలో గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. రత్న, సత్యగిరుల చుట్టూ 8.4 కిలో మీటర్ల మేర ప్రదక్షిణ సాగనుంది. గతంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Sun, 10 Nov 202412:51 PM IST
- AP Crime : గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. మహిళతో అక్రమ సంబంధం ఓ యువకుడి ప్రాణం తీసింది. ఒక మహిళతో ఇద్దరికు వివాహేతర సంబంధం ఉంది. ఆ మహిళ ఒకరికి తెలియకుండా మరొకరితో సంబంధాన్ని నడింపింది. ఆ విషయం బయటపడి గొడవ జరిగింది. ఈ వివాదంలో ఓ యువకుడిని హత్య చేశారు.
Sun, 10 Nov 202411:18 AM IST
- Srikalahasti Temple : దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆలయానిది ఒక్కో ప్రత్యేకత. అలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న దేవాలయం మన రాష్ట్రంలోనే ఉంది. అదే స్వర్ణముఖి నదీతీరంలో శ్రీకాళహస్తి దేవాలయం. శ్రీకాళహస్తి గురించి 7 విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Sun, 10 Nov 202411:05 AM IST
Nellore Jobs : నెల్లూరు జిల్లాలో నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ప్రోగ్రామ్‌లో ఖాళీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు దాఖలు చేసేందుకు నవంబర్ 13న ఆఖరు తేదీ. ఆసక్తి గల వారు నిర్ణీత సమయంలో దరఖాస్తు దాఖలు చేసుకోవాలి.
Sun, 10 Nov 202410:41 AM IST
PM Internship Scheme 2024 : ప్రధాన మంత్రి ఇంటర్న్ షిప్ స్కీమ్ దరఖాస్తులు నేటితో ముగియనున్నాయి. అర్హులైన అభ్యర్థులు pminternship.mca.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 1.25 లక్షల ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించేందుకు కేంద్రం ఈ పథకాన్ని అమలుచేస్తుంది.
Sun, 10 Nov 202409:56 AM IST
IRCTC Visakha Andaman Tour : అద్భుతమైన అండమాన్ అందాలు ఆస్వాదిస్తారా? బీచ్ లలో వివరిస్తూ పగడపు దీవుల్లో ఎంజాయ్ చేస్తారా? అయితే మీ కోసమే ఐఆర్సీటీసీ విశాఖ నుంచి ఆరు రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. తదుపరి టూర్ డిసెంబర్ 5న ప్రారంభం అవుతుంది.
Sun, 10 Nov 202408:45 AM IST
Dy CM Pawan Kalyan : ఐఏఎస్ అధికారులను బెదిరిస్తే సుమోటోగా కేసులు పెడతామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అధికారులపై చిన్న గాటు పడినా చూస్తూ ఊరుకోమన్నారు. అలాగే షర్మిల కోరితే భద్రత కల్పిస్తామన్నారు. మహిళల భద్రత విషయంలో అందరూ ముందుకు రావాలన్నారు.
Sun, 10 Nov 202407:59 AM IST
- Ayyappa Swamy Irumudi : టెంకాయలో నెయ్యి నింపడం వెనుక విశేషం ఉంది. పాలను చిలికితే వెన్న వస్తుంది. వెన్నను కాచి నెయ్యి తయారుచేస్తారు. ఆ నెయ్యితో భగవంతుడికి అభిషేకం చేయడం విశిష్టం. ఇరుముడిలో భక్తులు తీసుకొచ్చిన నెయ్యితో అయ్యప్పకు అభిషేకం అంటే.. పరమాత్మలో జీవాత్మ ఐక్యం చెందడం.
Sun, 10 Nov 202406:43 AM IST
- APPSC Group 2 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష తేదీలను మార్చే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం 2025 జనవరి 5న మెయిన్స్ ఎగ్జామ్ జరగాలి. కానీ.. జనవరిలో కాకుండా ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Sun, 10 Nov 202404:35 AM IST
- ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి ప్రారంభం కానున్నాయి. ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. మరోవైపు కీలక బిల్లులకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక ప్రతిపక్ష వైసీపీ గైర్హాజరుతో ఏకపక్షంగా సమావేశాలు జరగనున్నాయి.
Sun, 10 Nov 202403:55 AM IST
- Visakhapatnam : విశాఖ కేజీహెచ్‌లో అరుదైన ఘటన జరిగింది. శిశువు పుట్టి 7 గంటలు అయినా ఊపిరి ఆడలేదు. దీంతో విధుల్లో ఉన్న డాక్టర్లు పరిశీలించి, ప్రాణం పోయిందని నిర్ధారించారు. లబోదిబోమంటూ మృతి చెందిన శిశువును తరలించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో శిశువలో కదలికలు వచ్చాయి.
Sun, 10 Nov 202401:59 AM IST
- YS Jagan Questions : కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలతో పాటు సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులను ఖండించారు. నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చేస్తూనే ఉన్నారని విమర్శించారు. వ్యవస్థీకృత నేరాల కింద అరెస్టు చేయాల్సింది చంద్రబాబును కాదా..? అని ప్రశ్నించారు.