Andhra Pradesh News Live January 8, 2025: AP Inter 1st Year Exams : ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు అవాస్తవం, బోర్డు క్లారిటీ
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 08 Jan 202506:10 PM IST
AP Inter 1st Year Exams : ఏపీలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ విషయంపై ఇంటర్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. పరీక్షలు రద్దు అవాస్తవ ప్రచారమని స్పష్టం చేసింది.
Wed, 08 Jan 202505:49 PM IST
- CM CBN Review: తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. తొక్కిసలాట నేపథ్యంలో గురువారం ఉదయం సీఎం తిరుపతి వెళ్లనున్నారు. బాధితులను పరామర్శించనున్నారు.
Wed, 08 Jan 202505:28 PM IST
- TTD Negligence: తిరుమలలొ కనీవిని ఎరుగని ఘోర ప్రమాదం జరిగింది. టీటీడీ అధికారుల మధ్య సమన్వయ లోపం, ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం ఆరుగురు భక్తుల ప్రాణాలను బలి తీసుకుంది. ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.తిరుపతిలో ఏర్పాటుచేసిన టోకెన్ల జారీలో ఈ తొక్కిసలాట జరిగింది.
Wed, 08 Jan 202505:14 PM IST
Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Wed, 08 Jan 202505:08 PM IST
- Ys Jagan Condolence: తిరుమలలో వైకుంఠ ఏకదశి టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితదులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
Wed, 08 Jan 202504:04 PM IST
తిరుపతిలో విషాద ఘటన చోటుచేసుకుంది. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో అపశ్రుతి చోటుచేసుకుంది. శ్రీనివాసం వద్ద తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందింది. మరికొందరు గాయపడ్డారు.
Wed, 08 Jan 202502:37 PM IST
CM Chandrababu : ఏపీలో రూ.2.08,545 కోట్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు రాష్ట్రం పట్ల ప్రధాని మోదీకి ఉన్న నిబద్ధత ఏంటో తెలుస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
Wed, 08 Jan 202501:57 PM IST
PM Modi : ఏపీలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. విశాఖ వేదికగా జరిగిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ...ఏపీ అభివృద్ధికి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నామన్నారు. దేశంలో 2 గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లు వస్తుంటే, వీటిలో ఒకటి విశాఖకు కేటాయించామన్నారు.
Wed, 08 Jan 202501:34 PM IST
Pawan Kalyan : ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్మినందుకు...ప్రధాని మోదీ సారథ్యంలో 2 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
Wed, 08 Jan 202511:38 AM IST
- కడప జిల్లాలో ఘోర ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్య, కుమార్తె గొంతు కోసి తండ్రి అతికిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Wed, 08 Jan 202511:30 AM IST
PM Modi Visakha Tour : ప్రధాని మోదీ విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.
Wed, 08 Jan 202511:13 AM IST
AP Civils Aspirant Died : ఏపీకి చెందిన సివిల్స్ అభ్యర్థి దిల్లీలో అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. తమ కుమారుడి మృతి ఆన్ లైన్ బెట్టింగ్ ముఠానే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Wed, 08 Jan 202510:18 AM IST
Garikapati Issue : ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై పెళ్లి, ఆస్తులపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. తాను గరికపాటి మొదటి భార్యగా అంటూ ఓ మహిళ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేసింది. ఈ వీడియోలో సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను గరికపాటి టీమ్ ఖండించింది.
Wed, 08 Jan 202509:21 AM IST
Tirumala : తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో టోకెన్ లేని భక్తులకు దర్శనాలు ఉండవని స్పష్టం చేశారు. టోకెన్లపై నిర్దేశించిన తేదీ, సమయానికి మాత్రమే దర్శనాలకు రావాలని భక్తులకు సూచించారు.
Wed, 08 Jan 202508:26 AM IST
- CBN In Kuppam: కుప్పం ప్రజల రుణం తీర్చుకునేందుకే స్వర్ణకుప్పం విజన్ -2029 డాక్యుమెంట్ రూపొందించినట్టు చంద్రబాబు ప్రకటించారు. పేదరిక నిర్మూలన, పరిశ్రమలు, ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణా కేంద్రాలు, అందరికీ విద్య వంటి 10 అంశాలకు విజన్ డాక్యుమెంటులో ప్రాధాన్యత ఇచ్చామన్నారు.
Wed, 08 Jan 202507:28 AM IST
- Maha Kumbh Mela 2025 Updates : ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళాకు తిరుమల నుంచి శ్రీవారి కల్యాణ రథం బయల్దేరింది. కల్యాణ రథానికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పూజలు చేశారు. పచ్చ జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనుంది.
Wed, 08 Jan 202506:56 AM IST
- AP Inter Exams: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యలో సమూల సంస్కరణలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యలో ఎన్‌సిఈఆర్‌టి సిలబస్ అమల్లోకి రావడంతో దానికి అనుగుణంగా ఇంటర్ విద్యలో కూడా మార్పులు చేపట్టడానికి సిద్ధమవుతోంది.
Wed, 08 Jan 202505:02 AM IST
- Konaseema Murder: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో స్నేహితుడిని ఒక వ్యక్తి హత్య చేశాడు. బ్లేడ్‌తో పీక కోసి బురదలో తొక్కేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Wed, 08 Jan 202504:01 AM IST
- APSCHE Warning: ఏపీలో విద్యార్థులను ఫీజుల కోసం ముప్పతిప్పలు పెడుతున్న కాలేజీలకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు.ఏదొక సాకుతో సర్టిఫికెట్లను జారీ చేయకపోతే కాలేజీల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.ఫీజు రియంబర్స్‌మెంట్ వర్తించే విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై స్పందించారు.
Wed, 08 Jan 202503:03 AM IST
- YISU Admissions: తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీలో పలు ఉపాధినిచ్చే కోర్సులకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. యువతకు ఉపాధి కల్పించేందుకు, పారిశ్రామిక భాగస్వామ్యంతో కోర్సుల నిర్వహణ కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీని నెలకొల్పారు. కొన్ని కోర్సులతో పాటు ఉద్యోగ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.
Wed, 08 Jan 202501:53 AM IST
- AP Ministers Issue: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే కొందరు మంత్రుల పనితీరు చర్చనీయాంశంగా మారింది. అవినీతి ఆరోపణలు, సొంత వ్యవహారాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనవసరమైన కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. కూటమితో సర్దుబాట్ల కంటే మంత్రులో వ్యవహారాలే బాబుకు తలనొప్పిగా మారాయి.
Wed, 08 Jan 202512:36 AM IST
- AP Arogyasri: బీమా కంపెనీలతో ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీపై కక్ష ఎందుకని నిలదీశారు. పేదల సంజీవనికి ఉరి వేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
Wed, 08 Jan 202512:17 AM IST
- PM Modi Tour: ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖలో పర్యటిస్తున్నారు.విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌తో పాటు పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.ప్రధాని పర్యటనలో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు.