Andhra Pradesh News Live January 7, 2025: Annamayya Crime : అన్నమయ్య జిల్లాలో ఘోరం, కన్న కూతుళ్లుపైనే తండ్రి అఘాయిత్యం-పోక్సో కేసు నమోదు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 07 Jan 202512:51 PM IST
Annamayya Crime : అన్నమయ్య జిల్లాలో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న బిడ్డలపైనే ఓ కిరాతక తండ్రి కన్నేశాడు. ఇద్దరు కూతుళ్లపై లైంగిక దాడి చేశాడు. విషయం భార్యకు తెలిసి పోలీసులను ఆశ్రయించింది. నిందితుడ్ని పోలీసులను అరెస్టు చేశారు.
Tue, 07 Jan 202511:50 AM IST
- Nandigam Suresh Bail : నందిగం సురేష్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. మరియమ్మ హత్య కేసులో బెయిల్ మంజూరు చేయడానికి సుప్రీం నిరాకరించింది. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది.
Tue, 07 Jan 202511:34 AM IST
Srikakulam Ration Dealer Jobs : శ్రీకాకుళం జిల్లాలో రేషన్ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 107 పోస్టులను భర్తీ చేయనున్నారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
Tue, 07 Jan 202510:29 AM IST
Tirumala Vaikunta Dwara Darshan : జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు ఏడు లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. పది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
Tue, 07 Jan 202508:24 AM IST
- AP Ration Shops : పేదలకు అందాల్సిన కందిపప్పు పక్కదారి పడుతోంది. చాలా ప్రాంతాల్లో కందిపప్పు సరఫరా తక్కువ అవుతోంది. దీంతో డీలర్లు కొంతమందికే ఇచ్చి.. మిగతా పప్పును వ్యాపారులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 40 శాతం వరకు లబ్ధిదారులకు కందిపప్పు అందడం లేదని తెలుస్తోంది.
Tue, 07 Jan 202506:35 AM IST
- AP Govt : కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలంటే.. ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలన్న ఉద్యోగుల డిమాండ్‌కు.. ఈ ఉత్తర్వులు భిన్నంగా ఉన్నాయి.
Tue, 07 Jan 202505:55 AM IST
- AP High Court: ముంబై సినీ నటిని వేధింపులకు గురి ఫిర్యాదుపై నమోదైన కేసులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఏసీపీ, సీఐ, అడ్వకేట్‌లకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Tue, 07 Jan 202505:04 AM IST
- AP Ration Shops: ఏపీలోని పలు జిల్లాల్లో రేషన్ దుకాణాల కేటాయింపు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న దుకాణాల నుంచి రేషన్ కార్డులను విభజించి కొత్త దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది.
Tue, 07 Jan 202504:04 AM IST
- Vizianagaram Crime: విజయనగరం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మద్యం తాగుతూ పని డబ్బులు గురించి ఇద్దరు స్నేహితుల మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో వివాదం మరింత ముదిరింది. దీంతో మద్యం మత్తులో ఉన్న యువకుడు తన స్నేహితుడిని ఇనప చువ్వతో పలుమార్లు పొడిచి హత్య చేశాడు.
Tue, 07 Jan 202502:27 AM IST
- AP HMPV Alert: హెచ్‌ఎంపివి వైరస్‌పై ప్రజలు అనవసరంగా ఆందోళన చెంద వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఏపీలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని వైద్యఆరోగ్య శాఖ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ‌్యమంత్రి ఆదేశించారు.
Tue, 07 Jan 202501:51 AM IST
- Tirumala Vaikunta Darsanam: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో సామాన్య భక్తుల దర్శనాలకు అధిక ప్రాధాన్య ఇచ్చేలా కసరత్తు చేస్తోంది. జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు అవకాశం కల్పిస్తారు. జనవరి 9 నుంచి టోకెన్లు జారీ చేస్తారు.
Tue, 07 Jan 202501:08 AM IST
- Kuppam Solar Energy: రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా మొదట కుప్పంలో ప్రయోగించాకే రాష్ట్రమంతటా అమలు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని నడిమూరు గ్రామంలో పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ పైలట్ ప్రాజెక్టును సీఎం ప్రారంభించారు. ప్రతి ఇంటికి సోలార్ అందిస్తామన్నారు.
Tue, 07 Jan 202512:30 AM IST
- AP Rera Rules: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పెరగాలనేది ప్రభుత్వ లక్ష్యమని...దానికనుగుణంగానే నిబంధనలు సరళతరం చేస్తున్నామని మంత్రి నారాయణ ప్రకటించారు.రెరాలో అపరిష్కృతంగా ఉన్న పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై మంత్రి నారాయణ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
Tue, 07 Jan 202511:30 PM IST
- CPM On APERC: విద్యుత్ ఛార్జీల పెంపుదల లేదంటూనే ప్రజలపై సర్దుబాటు చార్జీలపై పేరుతో భారం మోపుతోందని సీపీఎం ఆరోపించింది. విద్యుత్ చార్జీల పెంపుదల కోసం ఏపీ ప్రభుత్వం, పంపిణీ సంస్థలు, విద్యుత్ నియంత్రణ మండలి సిద్ధం అవుతుండటంపై అభ్యంతరం తెలిపింది.