Andhra Pradesh News Live January 6, 2025: CM Chandrababu : తక్షణమే 3 వేల హెచ్ఎంపీవీ టెస్టింగ్ కిట్లను తెప్పించండి, సీఎం చంద్రబాబు ఆదేశాలు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 06 Jan 202506:26 PM IST
CM Chandrababu On HMPV Cases : హెచ్ఎంపీవీ కేసుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ఏపీ సీఎం చంద్రబాబు వైద్యాధికారులతో సమావేశం నిర్వహించి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్వాసకోశ వ్యాధులు, ఇన్‌ఫ్లూయెంజా కేసుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.
Mon, 06 Jan 202501:31 PM IST
Mega Fans road accident : గేమ్ ఛేంజర్ ఈవెంట్ తర్వాత ఇంటికి వెళ్తూ ఇద్దరు మెగా ఫ్యాన్స్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హీరో రామ్ చరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు.
Mon, 06 Jan 202512:32 PM IST
Srikakulam Crime : శ్రీకాకుళం జిల్లా దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి విద్యార్థినికి మాయమాటలు చెప్పి, కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో...తనకు రాజకీయ పలుకుబడి ఉందని బెదిరిస్తున్నాడని బాధితులు వాపోతున్నారు.
Mon, 06 Jan 202512:06 PM IST
- Vizag Railway Division: విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు ముహుర్తం ఖరారైన నేపథ్యంలో వాల్తేర్ డివిజన్‌ను కొత్త జోన్‌లోనే కొనసాగించాలన్న కేంద్రం నిర్ణయంపై బిజూ జనతాదళ్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వాల్తేర్ డివిజన్ కోల్పోతే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ తీవ్రంగా నష్టపోతుందని చెబుతోంది.
Mon, 06 Jan 202510:46 AM IST
Ignou Admissions : ఇగ్నో విశాఖ క్యాంపస్ లో పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ, డిగ్రీ ఆనర్స్, పీజీ. డిప్లమా, సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇగ్నో విశాఖ ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ తెలిపారు.
Mon, 06 Jan 202510:26 AM IST
Annadata Sukhibhava Scheme : రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయనుంది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో కలిపి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ స్కీమ్ అమలుకు సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
Mon, 06 Jan 202508:28 AM IST
- Sankranthi Kodi Pandalu : సంక్రాంతి పండగ వస్తోంది. కోడి పందేలకు వేళైంది. దీంతో నిర్వాహకులు బరులు సిద్ధం చేస్తున్నారు. పోలీస్ శాఖ నుంచి హెచ్చరికలు ఉన్నా.. నేతల అండతో నిర్వాహకులు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం పండగ నాలుగు రోజుల్లోనే కోట్లాది రూపాయలు కూడబెట్టుకునే ప్లాన్ చేస్తున్నారు.
Mon, 06 Jan 202506:38 AM IST
- Rajahmundry : రాష్ట్రంలో రైళ్ల షెడ్యూల్ మార్పులతో ప్రయాణికులు ఇక్కట్లకు గురవుతున్నారు. సమాచారం తెలియకపోవడంతో పాత షెడ్యూల్ ప్రకారం రైల్వే స్టేషన్‌లకు చేరుకుంటున్నారు. అప్పటికే రైలు వెళ్లిపోవడం, లేకపోతే రైలు ఆలస్యంగా ఉండటంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.
Mon, 06 Jan 202506:37 AM IST
- EG Gang Rape: తూర్పుగోదావరి జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒంటరి మహిళపై ఐదుగురు యువకులు లైంగిక దాడికి యత్నించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon, 06 Jan 202504:21 AM IST
- Minor Girl Rape: రాష్ట్రంలో చిన్నారులపై దాడులు ఆగడం లేదు. రోజుకోక ఘటన వెలుగులోకి వస్తుంది.తాజాగా కృష్ణా జిల్లాలో ఘోరమైన ఘటన వెలుగు చూసింది.అభంశుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై దివ్యాంగుడు అత్యాచారానికి ఒడిగట్టాడు.నిందితుడికి బాధిత కుటుంబమే రోజూ అన్నం పెడుతున్నా కృతజ్ఞత లేకుండా ప్రవర్తించాడు.
Mon, 06 Jan 202502:49 AM IST
- AP Police Recruitment: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షల్లో భాగంగా నిర్వహిస్తున్న శరీర కొలతలు, దేహ దారుఢ్య పరీక్షలు పలు జిల్లాల్లో వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జనవరి 11 నుంచి 20వ తేదీ మధ్య అయా జిల్లాల్లో వాటిని నిర్వహిస్తారు.
Mon, 06 Jan 202512:30 AM IST
- Janasena Plenary: గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయంతో ఊపు మీదున్న జనసేన పార్టీ ఈ ఏడాది పార్టీ ప్లీనరీ ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రాతనిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజక వర్గంలో జనసేన ప్లీనరీ నిర్వహించబోతున్నారు.
Mon, 06 Jan 202511:30 PM IST
- CBN Kuppam Tour: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు, రేపు కుప్పంలో పర్యటించనున్నారు. సొంత నియోజక వర్గంలో జరిగే పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 8వ తేదీన విశాఖపట్నంకు కుప్పం నుంచి బయల్దేరి వెళ్తారు.