Andhra Pradesh News Live January 5, 2025: AP Tourism : ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులకు రాయితీలు అందిస్తాం- మంత్రి కందుల దుర్గేష్
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 05 Jan 202504:12 PM IST
AP Tourism : ఏపీలో సినీ, పర్యాటక రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సీఎం చంద్రబాబు పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించారని గుర్తుచేశారు. పరిశ్రమల తరహాలో టూరిజం ప్రాజెక్టులకు రాయితీ ప్రకటిస్తామన్నారు.
Sun, 05 Jan 202503:40 PM IST
Haidava Shankharavam : కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వీహెచ్పీ కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ కల్కి సినిమాపై సంచలన వ్యాఖ్యల చేశారు.
Sun, 05 Jan 202501:10 PM IST
JC Prabhakar Reddy : సినీ నటి మాధవీ లతపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తాజాగా జేసీ స్పందించారు. వయసురీత్యా ఆవేశంలో అలా మాట్లాడేశానని, అందుకు క్షమాపణలు కోరారు. తనను పార్టీ మారాలని సూచించిన వారికి కౌంటర్ ఇచ్చారు.
Sun, 05 Jan 202511:34 AM IST
EdCIL Jobs : ఏపీలో 255 ఉద్యోగాల భర్తీకి ఈడీసీఐఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు దాఖలకు జనవరి 10 ఆఖరు తేదీగా నిర్ణయించారు. కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసే ఈ పోస్టులకు దాఖలు చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
Sun, 05 Jan 202510:38 AM IST
IRCTC Tour Packages : విశాఖ నుంచి కేరళ, అస్సాం మేఘాలయ టూర్ ప్యాకేజీలను ఐఆర్సీటీసీ అందిస్తోంది. సుందరమైన కేరళ, మేజికల్ మేఘాలయ పేరుతో ఈ ఎయిర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Sun, 05 Jan 202510:33 AM IST
- AP Ministers Staff : ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతలపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేల సిబ్బందిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా.. హోంమంత్రి అనిత పీఏ అక్రమాల వ్యవహారం టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయినట్టు తెలుస్తోంది.
Sun, 05 Jan 202509:23 AM IST
AP Lands Resurvey : ఏపీలో జనవరి 20 నుంచి భూముల రీసర్వే చేపట్టనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. త్వరలో 22ఏ భూములపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. సంక్రాంతి తర్వాత కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
Sun, 05 Jan 202507:12 AM IST
- Visakhapatnam : విశాఖ సెంట్రల్ జైలులో గంజాయి, సెల్‌ఫోన్లు దర్శనమిచ్చాయి. అటు అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తాజాగా.. హోంమంత్రి అనిత జైలును సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. వివాదాలపై వివరణ ఇచ్చారు.
Sun, 05 Jan 202506:44 AM IST
- AP Cinema Ticket Price : సంక్రాంతి సీజన్ వచ్చింది. ఈ సమయంలో ప్రముఖ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ సినిమాలకు ఏపీ ప్రభుత్వం వెసులుబాట్లు కల్పించింది. టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఈ ఇష్యూపై విమర్శలు వస్తున్నాయి. ధరల పెంపును సీపీఐ ఖండించింది.
Sun, 05 Jan 202505:55 AM IST
- Haindava Shankaravam Vijayawada : హైందవ శంఖారావంతో కృష్ణా జిల్లాకు కళ వచ్చింది. శంఖారావంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. లక్షలాది మంది వస్తారని అంచనా వేసి అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశారు.
Sun, 05 Jan 202503:44 AM IST
- Krishna District Crime : కృష్ణా జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుంది. ఫోన్ చాటింగ్‌లో పరిచయం అయిన యువకుడు.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికను నమ్మించి రూమ్‌లో బంధించి అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Sun, 05 Jan 202503:35 AM IST
- TTD Local Darshan Quota Tokens : తిరమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. ఇవాళ(జనవరి 5)స్థానిక కోటా టికెట్లను విడుదల చేయనుంది. మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలతో పాటు తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఈ టోకెన్లను జారీ చేస్తారు.
Sun, 05 Jan 202502:22 AM IST
- AP Aarogyasri EHS Services : ఏపీలోని ఆరోగ్య శ్రీతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం సేవలు నిలిచిపోనున్నాయి. భారీగా బకాయిలు పేరుకుపోవడంతో ఈ సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రకటన చేశాయి. జనవరి 6వ తేదీ నుంచి నగదు రహిత చికిత్సలు నిలిపేస్తామని స్పష్టం చేశారు.