Andhra Pradesh News Live January 4, 2025: CM Chandrababu : నేవీ సహకారంతో మారిటైం గేట్‌వేగా ఏపీ, పర్యాటక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తాం- సీఎం చంద్రబాబు-today andhra pradesh news latest updates january 4 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live January 4, 2025: Cm Chandrababu : నేవీ సహకారంతో మారిటైం గేట్‌వేగా ఏపీ, పర్యాటక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తాం- సీఎం చంద్రబాబు

CM Chandrababu : నేవీ సహకారంతో మారిటైం గేట్‌వేగా ఏపీ, పర్యాటక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తాం- సీఎం చంద్రబాబు

Andhra Pradesh News Live January 4, 2025: CM Chandrababu : నేవీ సహకారంతో మారిటైం గేట్‌వేగా ఏపీ, పర్యాటక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తాం- సీఎం చంద్రబాబు

05:18 PM ISTJan 04, 2025 10:48 PM HT Telugu Desk
  • Share on Facebook
05:18 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 04 Jan 202505:18 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: CM Chandrababu : నేవీ సహకారంతో మారిటైం గేట్‌వేగా ఏపీ, పర్యాటక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తాం- సీఎం చంద్రబాబు

  • CM Chandrababu : ఏపీకి విశాఖపట్నం ఆర్థిక రాజధాని, రాబోయే రోజుల్లో విశాఖ మేటైన నగరంగా తయారవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ పర్యాటక రాజధానిగా విశాఖను మార్చుతామన్నారు. దేశానికి రక్షణతో పాటు విపత్తు సమయంలో నావికాదళం అద్భుతంగా పని చేసి ప్రజల ప్రాణాలు కాపాడుతోందన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 04 Jan 202504:23 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Pawan Kalyan : సినీ పరిశ్రమకు రాజకీయ రంగు పూయడం ఇష్టం లేదు, టికెట్ల విషయంలో హీరోలు ఎందుకు దండాలు పెట్టాలి - పవన్ కల్యాణ్

  • Pawan Kalyan : సినీ పరిశ్రమకు రాజకీయ రంగు పూయడం మాకు ఇష్టం లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. సినిమా టికెట్ల ధరల పెంపు డిమాండ్ అండ్ సప్లై ఆధారంగానే ఉంటుందన్నారు. సినిమా టికెట్ల కోసం హీరోలు వెళ్లి ఎందుకు ప్రభుత్వాధినేతలకు దండాలు పెట్టాలని పవన్ ప్రశ్నించారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 04 Jan 202501:25 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Game Changer Ticket Rates : గేమ్ ఛేంజర్ మూవీ టికెట్ల రేట్లు భారీగా పెంపు, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

  • Game Changer Ticket Rates Hike : గేమ్ ఛేంజర్ మూవీ టికెట్ల రేట్ల పెంపు, అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షో టికెట్ ధర రూ.600లుగా నిర్ణయించింది. జనవరి 10 నుంచి జనవరి 23 వరకు ఐదు షోలు, రేట్లు పెంపునకు అనుమతినిచ్చింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 04 Jan 202511:36 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Disability Persons Petrol Subsidy : దివ్యాంగుల‌కు స‌బ్సిడీపై పెట్రోల్‌, డీజిల్- 50 శాతం రాయితీకి ఇలా అప్లై చేసుకోండి

  • Disability Persons Petrol Subsidy : రాష్ట్రంలో దివ్యాంగుల‌కు స‌బ్సిడీ మీద పెట్రోల్‌, డీజిల్ అందుబాటులోకి తీసుకొచ్చారు. దాదాపు 50 శాతం రాయితీ క‌ల్పిస్తున్నారు. ఆయా జిల్లాల్లోని విక‌లాంగుల సంక్షేమ కార్యాల‌యంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  

పూర్తి స్టోరీ చదవండి

Sat, 04 Jan 202511:24 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Kadapa Crime : కడప జిల్లాలో విషాదం.. మ‌ద్యం తాగేందుకు డ‌బ్బులివ్వ‌లేద‌ని గొడవ.. తండ్రిని చంపిన కుమారుడు

  • Kadapa Crime : క‌డ‌ప జిల్లాలో దారుణ‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. మ‌ద్యానికి బానిసైన ఓ వ్యక్తి.. ఏకంగా తండ్రినే చంపేశాడు. మ‌ద్యం తాగేందుకు తండ్రి డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని.. హ‌త్య చేశాడు. త‌ల్లి ఫిర్యాదు మేర‌కు కొడుకుపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 04 Jan 202510:50 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Matsyakara Bharosa : మత్స్యకారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, ఏప్రిల్ నెలలో ఖాతాల్లోకి రూ.20 వేలు

  • Matsyakara Bharosa : ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పింది. మత్స్యకార భరోసాపై మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన చేశారు. ఏప్రిల్ నెలలో రూ.20 వేల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ఇంజన్లు, మత్స్యకారుల బోట్లపై 70 శాతం సబ్సిడీని అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 04 Jan 202510:35 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Lokesh interview with students : విద్యార్థుల ప్రశ్నలు.. నారా లోకేష్ ఆసక్తికర సమాధానాలు

  • Lokesh interview with students : ఇక్కడ చదువుకున్న యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని.. మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా పని చేస్తున్నామని చెప్పారు. యువత బ్రెయిన్ గెయిన్ చేయడానికి అన్నిచర్యలు తీసుకుంటున్నామన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 04 Jan 202510:00 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: JC Prabhakar Reddy Vs BJP : కూటమిలో కుంపట్లు, జేసీ వర్సెస్ బీజేపీ - ఫ్లైయాష్ నుంచి పార్క్ వరకూ!

  • JC Prabhakar Reddy Vs BJP : ఏపీలో కూటమి నేత మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఫ్లైయాష్ తో మొదలైన వివాదం ఇప్పుడు మరో టర్న్ తీసుకుంది. జేసీ పార్క్ లో న్యూ ఇయర్ వేడుకలపై బీజేపీ మహిళా నేతలు విమర్శలు, జేసీ కౌంటర్, బీజేపీ నేతల రీకౌంటర్లతో ఏపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 04 Jan 202508:56 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Women Swimming Record : వైజాగ్ నుండి కాకినాడ వరకు.. సముద్రంలో 150 కిలోమీటర్లు ఈదిన 52 ఏళ్ల మహిళ

  • AP Women Swimming Record : రాష్ట్రానికి చెందిన ఓ మహిళ అరుదైన రికార్డ్ సాధించారు. సముద్రంలో ఏకంగా 150 కిలో మీటర్లు ఈదారు. ఆమె వయస్సు 52 సంవత్సరాలు కావడం గమనార్హం. ఈ వయస్సులో కూడా ఇంత సాహసం చేయడం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 04 Jan 202507:51 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Mid Day Meal Scheme : జూనియర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం ప్రారంభం.. ఏ రోజు ఏం పెడతారు.. మెనూ ఇదే

  • AP Mid Day Meal Scheme : కొత్త ఏపీలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పండగ వాతావరణం నెలకొంది. మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం పునః ప్రారంభించారు. ఇంటర్మీడియట్‌ బోర్డు నుంచి కళాశాలలకు వచ్చిన ఆదేశాలతో.. మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించారు. దీని మెనూ ఇలా ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 04 Jan 202507:08 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Guntur : కేసుల నుంచి తప్పించుకోవడానికి.. బతికుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించాడు.. అంతలోనే ఊహించని ట్విస్ట్

  • Guntur : అతనో రౌడీ షీటర్. ఎన్నో హత్య కేసుల్లో నిందితుడు. ఎన్నోసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. ప్రాణభయంతో పారిపోయాడు. కానీ.. కేసులు వెంటాడుతున్నాయి. దీంతో ఓ కానిస్టేబుల్ సాయంతో కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ కథ అడ్డం తిరిగింది. పోలీసులు పట్టుకొని లోపలేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 04 Jan 202506:34 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Pensions : బోగస్‌ పెన్ష‌న్ల ఏరివేత‌కు రంగం సిద్ధం...! మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ, వెరిఫికేష‌న్ ఎలా చేస్తారంటే..?

  • ఏపీలో బోగస్‌ పింఛన్ల ఏరివేత ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా విక‌లాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధుల‌ పెన్ష‌న్లలో అనర్హలు ఎక్కువగా ఉన్నట్లు తేలటంతో… రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. 
పూర్తి స్టోరీ చదవండి

Sat, 04 Jan 202505:05 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vizag Flight : వైజాగ్ వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య.. హైదరాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

  • Vizag Flight : ఆ విమానం వైజాగ్ వెళ్లడానికి ముంబయి నుంచి బయలుదేరింది. చాలా దూరం వచ్చాక ఏదో సమస్య ఉన్నట్టు పైలట్ గుర్తించారు. వెంటనే హైదరాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో ఆ ఫ్లైట్‌లో ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 04 Jan 202504:27 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: YS Jagan Questions : 'చంద్రబాబు గారూ... ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా?' వైఎస్ జగన్ 6 ప్రశ్నలు

  • ముఖ్యమంత్రి చంద్రబాబుకు  వైసీపీ అధినేత జగన్ మరోసారి ప్రశ్నలు సంధించారు. తల్లికి వందనంపై భారీగా ప్రచారం చేసి.. చేతులెత్తేసే ప్రయత్నం చేశారని ఫైర్ చేశారు. ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చిచెప్పేశారని… ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా? అని నిలదీశారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 04 Jan 202503:47 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vizianagaram : ఆరు నెల‌ల పసిపాప‌పై అత్యాచారం.. నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష‌

  • Vizianagaram : విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఆరు నెల‌ల పసిపాపపై అత్యాచారం జ‌రిగింది. ఈ ఘోర‌మైన ఘ‌ట‌న‌లో నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష ప‌డింది. అంతేకుండా పోక్సో కోర్టు ప్ర‌త్యేక న్యాయ‌మూర్తి కె.నాగ‌మ‌ణి జ‌రిమానా కూడా విధించారు. ఈ విష‌యాన్ని జిల్లా ఎస్పీ వ‌కుల్ జిందల్ వెల్ల‌డించారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 04 Jan 202512:00 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Arogyasri: ఏప్రిల్‌ 1నుంచి ఏపీలో బీమా విధానంలో ఆరోగ్య సేవలు, ప్రతికుటుంబానికి రూ.2500 బీమా ప్రీమియం

  • AP Arogyasri: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ ఎక్కడికీ పోలేదని, ఎన్టీఆర్‌ వైద్య సేవ పేరుతో మరింత మైరుగైన వైద్య సేవలు అందించేలా రూపాంతరం చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ప్రకటించారు. ఏప్రిల్ 01 నుంచి నగదు రహిత చికిత్సల్లో హైబ్రిడ్ విధానం అమలవుతుందని స్పష్టం చేశారు
పూర్తి స్టోరీ చదవండి