LIVE UPDATES
TDP Mahanadu 2025 : జగన్ ఇలాకాలో టీడీపీ మహానాడు.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh News Live January 31, 2025: TDP Mahanadu 2025 : జగన్ ఇలాకాలో టీడీపీ మహానాడు.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 31 Jan 202504:23 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: TDP Mahanadu 2025 : జగన్ ఇలాకాలో టీడీపీ మహానాడు.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
- TDP Mahanadu 2025 : మహానాడు అంటే టీడీపీ నాయకులు, కార్యకర్తలందరికి పెద్ద పండుగ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జన్మదినం మే 28న టీడీపీ ఏటా మహానాడును నిర్వహిస్తుంది. ఈసారి వైసీపీ చీఫ్ జగన్ సొంత జిల్లా కడపలో మహానాడును నిర్వహించాలని.. సైకిల్ పార్టీ ప్లాన్ చేస్తోంది.
Fri, 31 Jan 202501:49 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Srikakulam Crime : ఇంత తెగింపా.. హాస్టల్‌లోకి చొరబడి డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం.. సిబ్బంది ఏం చేస్తున్నారు?
- Srikakulam Crime : శ్రీకాకుళంలో ఘోరమైన ఘటన జరిగింది. హాస్టల్‌లోకి చొరబడి డిగ్రీ విద్యార్థినిపై దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Fri, 31 Jan 202512:41 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Amaravati ORR : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు.. 10 ముఖ్యమైన అంశాలు
- Amaravati ORR : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో రాజధాని రూపురేఖలు మారిపోనున్నాయి. ఈ ప్రాజెక్టు అమరావతికి మణిహారంగా మారనుంది. దీన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఈ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో కేంద్రం స్వల్ప మార్పులు సూచించింది.
Fri, 31 Jan 202511:01 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP DSC RECRUITMENT : త్వరలోనే 16,347 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్.. చంద్రబాబు కీలక ప్రకటన
- AP DSC RECRUITMENT : ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారికి సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలోనే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు ఈ ప్రకటన చేశారు.
Fri, 31 Jan 202510:36 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: South Central Railway : కరీంనగర్ టు హైదరాబాద్.. వయా మానేరు.. ఈ రైల్వే బ్రిడ్జ్ చాలా స్పెషల్ గురూ!
- South Central Railway : తెలంగాణలో కనెక్టివిటీని పెంచడానికి సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రాజెక్టులను చేపడుతోంది. దీంట్లో భాగంగానే మానేరు నదిపై బ్రిడ్జ్‌ను నిర్మించనున్నారు. విజయవాడ వద్ద కృష్ణా నదిపై నిర్మించినట్టు.. దీన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇది పూర్తయితే కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు రావడం చాలా ఈజీ.
Fri, 31 Jan 202510:07 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: TTD Council Meeting : శ్రీవారి భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు.. ఈ దర్శనాలు రద్దు!
- TTD Council Meeting : తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ భేటీలో పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. రథసప్తమి కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించింది. అటు వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీపైనా కీలక నిర్ణయం తీసుకుంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
Fri, 31 Jan 202508:55 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Special Trains : ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రెండు ప్రత్యేక రైళ్లు కొనసాగింపు.. 16 ట్రైన్లకు అదనపు కోచ్‌లు
- Special Trains : ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణానికి సౌకర్యంగా ఉండటానికి, అదనపు రద్దీని తగ్గించడానికి రెండు వీక్లీ స్పెషల్ రైళ్ల సేవలను పొడిగించాలని నిర్ణయించింది. అలాగే 16 రైళ్లకు అదనపు కోచ్‌లను జత చేసింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
Fri, 31 Jan 202506:35 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala Special Days 2025 : తిరుమల శ్రీవారి అప్‌డేట్స్ - ఫిబ్రవరి నెలలో జరిగే కార్యక్రమాలివే
- ఫిబ్రవరి నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. తేదీల వారీగా పూర్తి వివరాలను వెల్లడించింది. ఫిబ్రవరి ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి వేడుకలు ఉంటాయని పేర్కొంది.
Fri, 31 Jan 202505:04 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: SI Suicide : తణుకులో తుపాకీతో కాల్చుకుని ఎస్సై సూసైడ్
- SI Suicide in Tanuku Rural Police Station : పశ్చిమ గోదావరి జిల్లాలో సర్వీస్ తుపాకీతో కాల్చుకున్ని ఎస్‌ఐ ఏజీఎస్ మూర్తి సూసైడ్ చేసుకున్నాడు. ఇటీవల ఎస్‌ఐ సస్పెండ్ అయిన కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
Fri, 31 Jan 202504:12 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Kakinada Crime : వివాహేతర సంబంధం..! ప్రియుడిని దారుణంగా హతమార్చిన ప్రియురాలు
- కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ… ప్రియుడిని ఇనుప గొట్టంతో అతి దారుణంగా హతమార్చింది. నిందితురాలు పరారీలో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Fri, 31 Jan 202501:49 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP WhatsApp Governance : 'వాట్సాప్' ద్వారా ఏపీ ప్రభుత్వ సేవలను ఎలా పొందాలి..? ఈ వివరాలను తెలుసుకోండి
- Mana Mitra Governance in Andhrapradesh: ఏపీలో సరికొత్త వ్యవస్థ ద్వారా పౌరసేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ ద్వారా పౌరసేవలు ప్రారంభమయ్యాయి. 9552300009 నెంబరుపై ‘మన మిత్ర’ ద్వారా 161 పౌరసేవలు పొందవచ్చు. ఈ సరికొత్త వ్యవస్థ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి...