Andhra Pradesh News Live January 30, 2025: Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ అందుకే నష్టాల్లోకి వెళ్లింది.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు-today andhra pradesh news latest updates january 30 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live January 30, 2025: Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ అందుకే నష్టాల్లోకి వెళ్లింది.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ అందుకే నష్టాల్లోకి వెళ్లింది.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh News Live January 30, 2025: Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ అందుకే నష్టాల్లోకి వెళ్లింది.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

03:58 PM ISTJan 30, 2025 09:28 PM HT Telugu Desk
  • Share on Facebook
03:58 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 30 Jan 202503:58 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ అందుకే నష్టాల్లోకి వెళ్లింది.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

  • Vizag Steel Plant : ఓవైపు జీతాలు రావడం లేదని కార్మికులు ఆందోళన బాటపట్టారు. మరోవైపు కేంద్రమంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శనకు వచ్చారు. ప్రైవేటీకరణపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. కానీ ఆయన మాటలను నమ్మబోమని కార్మిక సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అటు ప్లాంట్ నష్టాలపై కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202502:41 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: YSRCP : కూటమి ప్రభుత్వంపై మరో పోరాటం.. ఫిబ్రవరి 5న వైసీపీ ఫీజు పోరు.. కారణాలు ఏంటీ?

  • YSRCP : కూటమి ప్రభుత్వంపై వైసీపీ మరో పోరుకు సిద్ధమైంది. ఇటీవల విద్యుత్ ఛార్జీలపై పోరాటం చేసిన ఫ్యాన్ పార్టీ.. ఇప్పుడు విద్యార్థుల కోసం ఉద్యమించడానికి సిద్ధమైంది. ఫీజు పోరు పేరుతో పోరాటం చేయడానికి రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆ పార్టీ నాయకులు విడుదల చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202512:28 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Govt Schemes : వెనుక‌బ‌డిన వ‌ర్గాలకు దన్నుగా కూటమి ప్రభుత్వం.. స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

  • AP Govt Schemes : స్వయం ఉపాధి అవకాశాలు పెంచేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. వెనుక‌బ‌డిన వ‌ర్గాల నుంచి ఉపాధి పథకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులకు రాయితీపై రుణాలు ఇవ్వనుంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202510:56 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Investments in AP : పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేలా ట్రాకింగ్ చేయాలి.. చంద్రబాబు కీలక ఆదేశాలు

  • Investments in AP : చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ సమావేశం జరిగింది. 15 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 19,580 ఉద్యోగాల కల్పన జరగవచ్చని బోర్డ్ అంచనా వేసింది. పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేలా ట్రాకింగ్ చేయాలని సీఎం ఆదేశించారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202509:29 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: APSRTC : విశాఖ‌, క‌డ‌ప నుంచి కుంభ‌మేళాకు సూప‌ర్ ల‌గ్జ‌రీ స్పెష‌ల్ స‌ర్వీసులు.. ప్యాకేజీ వివరాలు ఇవే

  • APSRTC : మ‌హా కుంభమేళా యాత్రికుల‌కు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. విశాఖ‌, క‌డ‌ప నుంచి మ‌హా కుంభ‌మేళాకు ప్ర‌త్యేక స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తెచ్చింది. విశాఖ‌ నుంచి మూడు రోజుల్లో స‌ర్వీసులు అందుబాటులో ఉంటాయి. క‌డ‌ప నుంచి ఒక రోజు మాత్ర‌మే సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202508:56 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Simhachalam Lands: సింహాచలం పంచ గ్రామాల సమస్యకు పరిష్కారం, 12,149 ఇళ్ల క్రమబద్దీకరణ.. విశాఖలో ప్రత్యామ్నయ భూకేటాయింపు

  • Simhachalam Lands: సింహాచలం పంచగ్రామాల ఆక్రమణల సమస్య కొలిక్కి వచ్చింది. ఆలయ భూములకు పరిహారంగా ప్రభుత్వ భూమిని దేవస్థానానికి అప్పగించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో దేవాలయ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న 12వేల మందికి లబ్ది చేకూరనుంది. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202507:21 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Whatsapp AP: వాట్సాప్‌లోనే ఏపీ ప్రభుత్వ సేవలు.. 95523 00009తో మెటా పౌర సేవలు, ప్రారంభించిన నారా లోకేష్

  • Whatsapp AP: ఏపీలో వాట్సాప్‌ ద్వారా పౌరసేవల్ని అందించేందుకు  “మన మిత్ర ప్రజల చేతిలో ప్రభుత్వం” పేరుతో పౌర సేవల్ని మంత్రి నారా లోకేష్‌ లాంఛనంగా ప్రారంభించారు.మెటా భాగస్వామ్యంతో ప్రజలకు వివిధ రకాల పౌర సేవలు ఇకపై వాట్సాప్‌లోనే అందిస్తారు.ప్రభుత్వ సర్టిఫికెట్లకు  ఇబ్బంది పడకుండా మొబైల్‌లోనే అందిస్తారు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202505:30 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Mega DSC Update: ఏపీ మెగా డిఎస్సీ అప్డేట్.. ఎన్నికల కోడ్‌ ముగియగానే నోటిఫికేషన్? షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు..

  • AP Mega DSC Update: ఏపీలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడటంతో తీవ్రమైన జాప్యం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.  ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యేలోపు నియామకాలు చేపట్టేలా  ఎన్నికల కోడ్ ముగియగానే నోటఫికేషన్‌ జారీ చేస్తారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202505:07 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Crime News : విద్యార్థినిపై లైంగిక వేధింపులు - స్కూల్ హెచ్ఎంకు దేహశుద్ధి, సస్పెండ్ చేసిన డీఈవో

  • ఐదో త‌ర‌గ‌తి విద్యార్థినిపై ప్ర‌ధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటన కాకినాడ జిల్లాలోని క‌ర‌ప మండ‌లంలో జరిగింది. తల్లితో పాటు బంధువులకు విషయం తెలియటంతో హెచ్ఎంకు దేహాశుద్ధి చేశారు. విచారణ జరిపిన డీఈవో హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు వేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202505:06 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Lands Regularization: ఏపీలో ఆక్రమిత భూముల క్రమబద్దీకరణకు గ్రీన్ సిగ్నల్, అభ్యంతరం లేని ఆక్రమణలకు అమోదం

  • Lands Regularization: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.  అభ్యంతరం లేని స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న వాటిని క్రమబద్దీకరించేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. 150 గజాల వరకు ఇంటి స్థలాలను ఈ మేరకు క్రమబద్దీకరిస్తారు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202504:10 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Inter Exams: యథాతథంగా 2026 ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. ప్రతిపాదన విరమించుకున్న ఏపీ ఇంటర్‌ బోర్డు

  • AP Inter Exams: ఏపీలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలనే ప్రతిపాదనలను బోర్డు ఉపసంహరించుకుంది. 2026 మార్చి నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్ని రద్దు చేయాలనే యోచనతో ఇటీవల సూచనలు, సలహాలను ఇంటర్ బోర్డు ఆహ్వానించింది. పరీక్షల రద్దు నిర్ణయాన్ని అంతా వ్యతిరేకించడంతో యథాతథంగా పరీక్షల నిర్వహణ జరుపనున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202501:44 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP WhatsApp Governance : నేటి నుంచి ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ - ప్రధానమైన 10 విషయాలు

  • WhatsApp governance in AP : ఏపీ ప్రభుత్వం సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. దేశంలో తొలిసారిగానే ప్రభుత్వ పౌరసేవలను అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించనుంది. ఇవాళ్టి నుంచే వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన ముఖ్య వివరాలు ఇక్కడ చూడండి…
పూర్తి స్టోరీ చదవండి